Ads 468x60px

Wednesday, December 20, 2006

ఎడారిలో కోయిలా..

ఎడారిలో కోయిలాతెల్లారనీ రేయిలా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా


పూదారులన్ని గోదారికాగా
పూదారులన్నీ గోదారికాగా
పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా


'పల్లవించు ప్రతిపాటా బ్రతుకు వంటిదే..
రాగమొకటి లేక తెగిన తీగవంటిదే !'


ఎద వీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవతా
కల ఆయితే శిల అయితే మిగిలింది ఈ గుండెకోతా
నా కోసమే విరబూసినా మనసున్న మనసైన మరుమల్లికా
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలుపూతరగిలింది ఈ రాలుపూతా
.. విధిరాతచేతా.. నా స్వర్ణసీతా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా


'కొన్ని పాటలింతే..గుండెకోతలోనే చిగురిస్తాయ్ !
కొన్ని బ్రతుకులంతే..వెన్నెలతో చితి రగిలిస్తాయ్ !!'


ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాపా
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిటా
బ్రతుకంటే మృతికంటే చేదైన ఒక తీపి పాటచేదైన ఒక తీపి పాటా
.. చెలిలేని పాటా.. ఒక చేదుపాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా


పూదారులన్ని గోదారికాగా
పూదారులన్నీ గోదారికాగా
పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

0 comments:

Post a Comment

Share

Widgets