Ads 468x60px

Saturday, February 24, 2007

స్వరరాగగంగా




ప్రవాహమే గంగా ప్రవాహమే
స్వరరాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధన యోగమే
ప్రప్తేవ సంకేతి క్షాలికె
పలికే కుహు గీతిక
గాన సరసి రుధ మాలిక
స్వరరాగ గంగ ప్రవాహమే

కుందల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈ నాటికి
మట్టింతి రాయె మణిక్యమైపోయె సంగీత రత్నాకరాన
స్వర సప్తకాలె కెరటాలు కాగ ఆ గంగ పొంగింది లోన


చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి వినిపించు రాగాలనంతాలులే
ఈ చక్ర వాసాలు యెగిరె చకోరాలు జగమంత విహరించు రాగాలులె
పిలిచె శకుంతాలు పలికె దిగంతాలు
పులకింతల పుష్య రాగగ్లులె
మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు
మౌనాచరీగాన వేదాలులె

చిత్రం: సరిగమలు
గానం : జేసుదాస్
రచన: వేటూరి



మలయాళంలో ఇదే పాట...

SwaraRaagaGangaa_S...

జననీ శివకామిని

అమ్మా అమ్మా

జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని
జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని

అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే
అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే
నీ చరనములే నమ్మితినమ్మ
నీ చరనములే నమ్మితినమ్మ శరనము కోరితి అమ్మ భవాని

నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు
నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచీ
నిరతము మాకు నీడగ నిలచీ జయమునీయవే అమ్మా
జయమునీయవే అమ్మ భవాని

చిత్రం: నర్తనశాల
గానం : ఎస్.జానకి
సంగీతం:సముద్రాల .సీ

జగమంత కుటుంబం నాది

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే..సన్యాసం శూన్యం నావే

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాదీ

కవినై..కవితనై..భార్యనై..భర్తనై
కవినై కవితనై..భార్యనై భర్తనై
మల్లెలదారిలో..మంచు ఎడారిలో
మల్లెలదారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాల..కన్నీటి జలపాతాల
నాతో నేను అంగమిస్తూ..నాతో నేను రమిస్తూ

వంటరినై అనవరతం .. కటున్నాను నిరంతరం
కలల్ని..కధల్ని..మాటల్ని..పాటల్ని..రంగుల్ని..రంగవల్లుల్ని..కావ్య కన్నెల్ని..ఆడపిల్లల్ని

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాదీ

మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై..శశినై..దివమై..నిశినై
నాతో నేను సహగమిస్తూ..నాతో నేనే రమిస్తూ

ఒంటరినై ప్రతినిముషం .. కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల..హరిణాల్ని హరిణాల..చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని..ఇంద్రజాలాన్ని

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాదీ

గాలిపల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతువాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలె

నా హృదయమే నా లోగిలీ
నా హృదయమే నా పాటకి తల్లీ
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీ వాలి

జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
చిత్రం : చక్రం
గానం : శ్రీ
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం:చక్రి


powered by ODEO

Tuesday, February 20, 2007

ఇత్నా తొ యాద్ హై

ఇత్నా తొ యాద్ హై ముజే కి ఉన్సే ములాకాత్ హుయీ
బాద్ మే జానే క్యా హువా నా జానే క్యా బాత్ హుయీ

వాదే వఫా కె కర్కే కస్మేఉఠా కె
కిసీ పె దిల్ లుటాకే చలా ఆయా
నజ్రే మిలాకే నీంద్ అప్నీ గవాకే
కసక్ దిల్ మె బసాకే చలా ఆయా
దిన్ తొ గుజర్ జాయెగా క్యా హోగా జబ్ రాత్ హుయీ

మారె హయా కె మై తో ఆంఖే ఝుకా కె
జరా దామన్ బచాకె చలీ ఆయీ
పరదా హటాకె ఉంకీ బాతో మె ఆకె
ఉన్‌హే సూరత్ దిఖాకె చలీ ఆయీ
ఏ కిస్‌సె షికాయత్ కరూ షరారత్ మెరె సాత్ హుయీ

తీ ఎక్ కహనీ పహలె యె జిందగానీ
ఉన్‌హె దేఖా తొ జీనా ముఝె ఆయా
దిల్బర్ ఓ జానీ షర్మ్ సె పానీ పానీ
హుయీ మై బస్ పసీనా ముఝె ఆయా

ఐసే మై భీగ్ గయీ జైసే బర్సాత్ హుయీ

MOVIE:MEHBOOB KI MEHENDI
SINGERS:LATA MANGESHKAR,MOHD RAFI




శివశంకరి

ఆ...ఆ...ఆ..ఆఅ.ఆ
శివశంకరి
శివశంకరి శివానంద లహరి శివశంకరి
శివానంద లహరి శివశంకరి
శివానంద లహరి శివశంకరి
చంద్ర కలాధరి ఈశ్వరి ఆ
చంద్ర కలాధరి ఈశ్వరి
కరునామౄతమును కురియజేయుమా
మనసు కరుగదా మహిమ చూపవా దీనపాలనము సేయవే
శివశంకరి శివానంద లహరి శివశంకరి
శివశంకరి శివానంద లహరి శివానంద లహరి శివశంకరి
శివశంకరి శివానంద లహరి శివశంకరి
శివశంకరి శివానంద లహరి శివశంకరి
చంద్ర కలాధరి ఈశ్వరి
రి రి స ని ద ని స మ ప ద ని స ద ని స ద ని స ద ని స
చంద్ర కలాధరి ఈశ్వరి
రి రి స ని ప మ గా రి ద సా
ని రీ ని స రి మ ప దా మ ప ని రి ని స ద ప
చంద్ర కలాధరి ఈశ్వరి
ద ని స మ ప ద ని స స రి మ గ రి మ ప ని ద ని స
మ ప ని రి స రి న్ ఇస ద ని ప మ ప ని స రీ స ని స రి గా రి స
రి ని స ని స ని ప ని ప మ ప మ గ మ రి స ని స
స రి మ ప ని దా ని స స రి మ ప ని దా ని స స రి మ ప ని దా ని స
చంద్ర కలాధరి ఈశ్వరి
చంద్ర కలాధరి ఈశ్వరి ఆ..
శివశంకరి ఆ
శివశంకరి
తోం తోం తోం దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరితోం త్రితియన దరితోం
దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరితోం తారియాన
దిరిదిరితోం తోం తోం దిరిదిరితోం తోం తోం దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరి తన దిరిదిరితోం
దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి నాదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి నాదిరి దిరి దిరి తోం దిరి దిరి దిరి నాదిరి దిరి దిరి తోం
నినినినినిని దనినిదనినిదప పససనిససనిద నిరిరిసరిరిసని
స గ గ రి గ గ ని స స రి రి స రి రి స ని
నిససనిససనిద దనినిదనిని దప
రిరిదదదదనిని రినిదద దగరిరి గగగగరిరిరిని సనిరిరిదదదద
రీరిరీరిరిరి నినిని రీరిరి నినిని గాగగగ నినిని రీరిగరిమా
రిమరి గరిస నిసని పనిప మపమరిగా
సరిసస మపమమ సరిసస సససస సరిసస పనిమప సరిసస సససస మపమమ
పనిసస మపమపనిద మపమపనిద పదపపసనిద పదపసనిద పదపసనిద మమమ
పపప ససస నినిని ససస రిరిరి గరిసని సరిమ ఆఅ
శివశంకరి

చిత్రం:జగదేకవీరుని కథ
గానం : ఘంటసాల
రచన: పింగలి

జంబలకిడిపంబ

ఆడుదాంపాడుదాం

మంచు కురిసే వేళలో

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో

నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో

మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మన్మదునితో జన్మవైరం సాగినపుదో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో

చిత్రం: అభినందన
గానం : బాలసుబ్రమణ్యం,జానకి
రచన: ఆత్రేయ
సంగీతం:ఇళయరాజా

powered by ODEO

అందెను నేడే

అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి

ఇన్నేళ్ళకు విరిసే వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
నిదురించిన ఆశలు చిగురించెలే
చెలికాడే నాలో తలపులు రేపెనులే

నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మృఒగినవి
గిలిగింతల నా మేను పులకించెలే
గిలిగింతల నా మేను పులకించెలే
నెలరాజే నాతో సరసములాడెనులే

ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నా మది విహరించెలే
వినువీధిని నా మది విహరించెలే
వలరాజే నాలో వలపులు చిలికెనులే

చిత్రం: ఆత్మగౌరవం
గానం : ఘంటసాల
రచన :దాశరధి

పది మందిలో

పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే
విరి తోటలో పూలెన్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే
పది మందిలో||

గోపాలునికి ఎంతమంది గోపికలున్న గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే
గోపాలునికి ఎంతమంది గోపికలున్న గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే
ఆకాశ వీధిలో తారలెన్ని వున్న అందాల జాబిల్లి అసలుఒక్కడే
పది మందిలో||

ఏడారిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే
ఏడారిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే
నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను
నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను
ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే
పది మందిలో||


చిత్రం : ఆనంద నిలయం
గానం : ఘంటసాల
రచన: ఆత్రేయ
సంగీతం:పెండ్యాల

బొమ్మను గీస్తే

బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది

చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ
శ్రమ పడిపోకండి తమ సాయం ఉందంది
పొమ్మంతావే బాలికా ఉంటానంటే తోడుగా
అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా
యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది
నీ వైపే నన్నే లాగింది


అందంగా ఉంది తన వెంటే పదిమంది
పడకుండా చూడు అని నా మనసంటుంది
తమకే తెలియంది నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది
నా మనసు యెన్నో కలలు కంటుంది


బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది


చిత్రం : బొమ్మరిల్లు
గానం :శ్రీనివాస్,గోపికాపూర్ణీమ
రచన:భాస్కరభట్ల
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్


powered by ODEO

Thursday, February 15, 2007

గొల్లమల్లమ్మ కోడలా

నల్లా చీర నల్లా రైక
నాలుగొట్టంగ తానమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా

తెల్లా చీర తెల్లా రైక
తెల్లవారంగ తానమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా

ఎర్రా చీర ఎర్రా రైక
ఎడుగొట్టంగ తానమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా

పచ్చా చీర పచ్చా రైక
పదిగొట్టంగ తానమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా

సీటీ చీర సీటీ రైక
సుట్టుకుంటే సింగారమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా

కళ్ళకు కాటుక నుదుటికి బొట్టు
పెట్టుకుంటే వయ్యారమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా


సేకరణ గానం: ఏ.జంగిరెడ్డి


powered by ODEO

Wednesday, February 14, 2007

మాదనో నా వయ్యారి

మావిడి పూసి మావిడి కాసెనా
మాదనో నా వయ్యారి
మావిడి పొలము ఎవరి పాలయా
మాదనో నా వయ్యారి
పైన వోయే పశుల పాలయా
మాదనో నా వయ్యారి
పశులు తిని రచ్చకేలెనా
మాదనో నా వయ్యారి
పశులు తిని రచ్చకేలె


రేగి పూసి రేగి కాసెనా
మాదనో నా వయ్యారి
రే గి పొలము ఎవరి పాలయా
మాదనో నా వయ్యారి
పైన వోయే పశుల పాలయా
మాదనో నా వయ్యారి
పశులు తిని రచ్చకేలెనా
మాదనో నా వయ్యారి
పశులు తిని రచ్చకేలె


నిమ్మ పూసి నిమ్మ కాసెనా
మాదనో నా వయ్యారి
నిమ్మ పొలము ఎవరి పాలయా
మాదనో నా వయ్యారి
పైన వోయే పశుల పాలయా
మాదనో నా వయ్యారి
పశులు తిని రచ్చకేలెనా
మాదనో నా వయ్యారి
పశులు తిని రచ్చకేలె


డాక పూసి డాక కాసెనా
మాదనో నా వయ్యారి
డాక పొలము ఎవరి పాలయా
మాదనో నా వయ్యారి
పైన వోయే పశుల పాలయా
మాదనో నా వయ్యారి
పశులు తిని రచ్చకేలెనా
మాదనో నా వయ్యారి
పశులు తిని రచ్చకేలె


పనస పూసి పనస కాసెనా
మాదనో నా వయ్యారి
పనస పొలము ఎవరి పాలయా
మాదనో నా వయ్యారి
పైన వోయే పశుల పాలయా
మాదనో నా వయ్యారి
పశులు తిని రచ్చకేలెనా
మాదనో నా వయ్యారి
పశులు తిని రచ్చకేలె


సేకరణ గానం: ఏ.జంగిరెడ్డి





powered by ODEO

Tuesday, February 13, 2007

ళ ళ ళ ళ

ళ ళ ళ ళ ఇది రవళే అది రవళే
ళ ళ ళ ళ చెలి సరళే తెలుం తమిళే
తెలిసినది చిలిపి కలె
య ర ల వ ల శ ష స హ లే
తుళ్ళు తుళ్ళు నడుము బళే
తళ్ళి తళ్ళి నడక బళే

వేళాకోళం తాళం
కాళ్ళావేళా కళ్ళెం
పళ్ళెం పళ్ళెం పళ్ళెం
అది మల్లిందంటె పల్లం

ఒళ్ళు ఒళ్ళు కలుపు అది కల్యాణాల వలపు
కళ్ళు కుళ్ళు కలుపు ఎద గుళ్ళూ
కల్ల కపటమేది కసిమేళం మాత్రం నాది
పెళ్ళి దాకా వెళ్ళూ పెనుగుళ్ళూ
కుళ్ళు లేని కులుకు ముల్లు కోరు మనసు
మనకు కాస్త ఉళ్ళా రాబళ్ళా

చిత్రం: అబద్ధం
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం

powered by ODEO

Saturday, February 3, 2007

ముత్యాల ముగ్గు

అలనాటి ముత్యాల ముగ్గులోని రావుగోపాలరావుగారి డైలాగులు చూద్దామా(విందామా)



అనగనగా ఒక రాజు

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి
ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువు సంధ్యలుండికూడ చవటలయ్యారు వొట్టి చవటలయ్యారు

పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు
అయ్యో ఇంటి దీపమార్పివెయ నెంచెనొక్కడు
తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు
తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు
పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు భ్రమసెనొక్కడు 11అనగనగా11

కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమయనె పాలు పోసి పెంపు చేసేను
కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి
ప్రేమయనె పాలు పోసి పెంపు చేసెను
కంటిపాప కంటె యెంతో గారవించేను
కంటిపాప కంటె యెంతో గారవించేను
దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగేను తానుండసాగేను 11అనగనగా11

నాది నాది అనుకున్నది నీది కాదుర
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
నాది నాది అనుకున్నది నీది కాదుర
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
కూరిమి గలవారంత కొడుకులేనురా
కూరిమి గలవారంత కొడుకులేనురా
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా కుక్క మేలురా 11అనగనగా11


చిత్రం : ఆత్మ బంధువు
రచన : ఆత్రేయ
గానం : ఘంటసాల,సుశీల

జననీ శివకామిని

అమ్మా అమ్మా
జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని
జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని

అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే
అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే
నీ చరనములే నమ్మితినమ్మ
నీ చరనములే నమ్మితినమ్మ శరనము కోరితి అమ్మ భవాని

నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు
నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచీ
నిరతము మాకు నీడగ నిలచీ జయమునీయవే అమ్మా
జయమునీయవే అమ్మ భవాని


చిత్రం :నర్తనశాల
సంగీతం: సముద్రాల సీనియర్
గానం : సుశీల

గుర్తుకొస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి యదలొతులో యేమూలనో
నిదురించు ఙాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో యే మమంతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
11 గుర్తు 11

మొదట చూసిన టూరింగ్ సినిమా
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పండ్లకై చేసిన కుస్తి
రాగి చెంబుతో చేసిన ఇస్త్రి
కొతి కొమ్మలొ బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగ చాటుగా కాల్చిన బీడీ
సూతు గాడిపై చెప్పిన చాడి
మోతు బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం
11 గుర్తు 11

మొదటి సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నెలపరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చి వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరు సాయబు పూసిన సెంటూ
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనమ
మొదటి ప్రేమలో తీయందనము
11 గుర్తు 11


చిత్రం : నా ఆటోగ్రాఫ్
రచన : చంద్రబోస్


powered by ODEO

మనసొక మధుకలశం

మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం

మరిచిన మమతొక్కటి
మరి మరి పిలిచినది
మరిచిన మమతొక్కటి
మరి మరి పిలిచినది
ఒక తీయని పరి తాపమై
ఒక తీయని పరి తాపమై

తొలకరి వలపొకటి
తలపుల తొలిచినది
తొలకరి వలపొక్కటి
తలపుల తొలిచినది
గత జన్మలా అనుబంధమై
గత జన్మలా అనుబంధమై


చిత్రం : నీరాజనం
సంగీతం: ఓ.పి.నయ్యర్
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం

నిను చూడక

నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక యే జన్మకైన ఇలాగే

యే హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకొంటినీ
యే చిరుగాలి కదలాడినా
నీ చరాణల సృతి వింటినీ
నీ ప్రతి రాకలో ఎన్ని శశి రేఖలో
నీ ప్రతి రాకలో ఎన్ని శశి రేఖలో

నీ జత కూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం

చిత్రం : నీరాజనం
సంగీతం:ఓ.పి.నయ్యర్
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం,జానకి



powered by ODEO

మదిలో వీణలు

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇల లోన విరిసె ఈ నాడే

సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది

కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందు కోరేను
కెర తాల వెలుగు చెంగలువా నెల రాజు పొందు కొరెను
అందల తారలై మెరిసి చెలి కాని చెంత చేరేను.

రాధ లోని అనురాగమంత మాధవునిదేలే
వేను లోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే


చిత్రం : ఆత్మీయులు
రచన : దాశరథి
గానం : సుశీల
సంగీతం: ఎస్.రాజేశ్వర్ రావు


powered by ODEO

ఈ నల్లని రాలలో

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ... ఈ నల్లని రాలలో

పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి
ఈ నల్లని||

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనె జల జలమని పొంగి పొరలు
ఈ నల్లని||

పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును
ఈ నల్లని||

చిత్రం: అమరశిల్పి జక్కన్న
గానం : ఘంటసాల
రచన: సి.నారాయణరెడ్డ్య్
సంగీతం:ఎస్.రాజేశ్వర్ రావు


powered by ODEO

Friday, February 2, 2007

చందురుని మించు

చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే

చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే


అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా ..
నాటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కధ పాడనా ..
కన్నీటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కధ పాడనా
కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే ..
చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే ..
మిగిలెనీ శోకమే
విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే

చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిన్ను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే

మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా
బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా
కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా
పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా
బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా
దివిలో తారకలు .. భువిలో మానవులు ధూళిలో కలసినా
అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే


లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో
లాలి పాపాయి జో జో…

చిత్రం:రక్తసంబంధం
రచన :అనిసెట్టి
సంగీతం:ఘంటసాల
గానం : ఘంటసాల ,సుశీల


powered by ODEO

నిను చూడక

నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక యే జన్మకైన ఇలాగే
11నిను11

యే హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకొంటినీ
యే చిరుగాలి కదలాడినా
నీ చరణాల సృతి వింటినీ
నీ ప్రతి రాకలో ఎన్ని శశి రేఖలో
నీ ప్రతి రాకలో ఎన్ని శశి రేఖలో
11నిను11

నీ జత కూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం


చిత్రం : నీరాజనం
సంగీతం:ఓ.పి.నయ్యర్
గానం :ఎస్.పి.బాలసుబ్రమణ్యం


powered by ODEO

విధాత తలపున

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
ఓం! ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం
ఓం! కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
సరస స్వర సుర ఝరి గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగ్రుత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిల కిల స్వరముల స్వరజతి దొరకని జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా

విరించినై||

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హౄదయ మౄదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసములే

విరించినై||

నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరస స్వర సుర ఝరి గమనమౌ

చిత్రం : సిరివెన్నెల
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం:కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల

ఆకాశ దేశాన

ఆకాశ దేశాన
ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం

వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ యేడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదనా నా విరహ వేదనా

ఆకాశ దేశాన||

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీది నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్పజల దారలతో
ఆ..ఆ..ఆ..ఆ
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా

ఆకాశ దేశాన||

చిత్రం : మేఘసందేశం
రచన : వేటూరి
సంగీతం:రమేష్ నాయుడు
గానం : జేసుదాస్

చూపులు కలసిన శుభవేళా

చూపులు కలసిన శుభవేళా
ఎందుకు నీకీ కలవరము ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనూహించిన అందమె నీలో చిందెనులే
చూపులు కలసిన శుభవేళా
ఎందుకు నీకీ కలవరము

చూపులు కలసిన శుభవేళా
ఎందుకు నీకీ పరవశము ఎందుకు నీకీ పరవశము
ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయెనులే
చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము

ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే
ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే
చెలువములన్ని చిత్ర రచనలే
చెలువములన్ని చిత్ర రచనలే
చలనము లోహో నాట్యములే
చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము

శరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే
శరముల వలనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే
ఉద్యానమున వీర విహారమే
ఉద్యానమున వీర విహారమే
తెలిపెదనో హో శౌర్యములే
చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ పరవశము
ఎందుకు నీకీ కలవరము

చిత్రం: మాయాబజార్
రచన: పింగళి
సంగీతం:ఘంటసాల
గానం : ఘంటసాల,లీల


ఆది భిక్షువు

ఆదిభిక్షువు వాడినేది కోరేది?
బూడిదిచ్చే వాడినేది అడిగేది? (2)
ఏది కోరేది, వాడినేది అడిగేది? (2)


తీపిరాగాలా ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవానినేది కోరేది? (2)
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన
వాడినేది అడిగేది?
ఏది కోరేది, వాడినేది అడిగేది? (2)


తేనెలొలికే పూలబాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది
కోరేది? (2)
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది
అడిగేది?
ఏది కోరేది , వాడినేది అడిగేది? (2)



చిత్రం : సిరివెన్నెల
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం
Share

Widgets