Ads 468x60px

Friday, February 2, 2007

చందురుని మించు

చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే

చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే


అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా ..
నాటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కధ పాడనా ..
కన్నీటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కధ పాడనా
కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే ..
చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే ..
మిగిలెనీ శోకమే
విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే

చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిన్ను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే

మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా
బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా
కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా
పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా
బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా
దివిలో తారకలు .. భువిలో మానవులు ధూళిలో కలసినా
అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే


లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో
లాలి పాపాయి జో జో…

చిత్రం:రక్తసంబంధం
రచన :అనిసెట్టి
సంగీతం:ఘంటసాల
గానం : ఘంటసాల ,సుశీల


powered by ODEO

1 comments:

  1. ఈ పాటను ఎంతో అద్భుతంగా రాశారు...అంతే హృద్యంగా పాడారు.

    ఈ పాటను చూస్తే నాకు ఎమ్మెస్ రామారావు గారి సుందరకాండ గుర్తుకు వస్తోంది. అంత సరళంగా సాగిపోతుంది ఈ గానం

    విహారి
    http://vihaari.blogspot.com

    ReplyDelete

Share

Widgets