Ads 468x60px

Tuesday, February 20, 2007

పది మందిలో

పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే
విరి తోటలో పూలెన్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే
పది మందిలో||

గోపాలునికి ఎంతమంది గోపికలున్న గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే
గోపాలునికి ఎంతమంది గోపికలున్న గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే
ఆకాశ వీధిలో తారలెన్ని వున్న అందాల జాబిల్లి అసలుఒక్కడే
పది మందిలో||

ఏడారిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే
ఏడారిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే
నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను
నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను
ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే
పది మందిలో||


చిత్రం : ఆనంద నిలయం
గానం : ఘంటసాల
రచన: ఆత్రేయ
సంగీతం:పెండ్యాల

1 comments:

  1. సినీ ఆకాశ వీధిలో తారలెన్ని వున్న అందాల జాబిల్లి అసలుఒక్కడే. అతడే..మన ఘంటసాల.

    ReplyDelete

Share

Widgets