Ads 468x60px

Saturday, June 16, 2007

నా యెంకి

నన్నిడిసి పెట్టెల్లినాడే!
నా రాజు....

మొన్న తిరిగొస్తనన్నాడే!
నీలుతేబోతుంటె, నీతోడె - వోలమ్మి!
న యెంటె యెవరోను నడిసి నట్టుంటాదె!
నన్నిడిసి పెట్టెల్లినాడే
నా రాజు....

అద్దములో సూత్తుంటె అది యేటో సిగ్గమ్మి!
నా యనక యెవురోను నవ్వి నట్టుంటాదె!
నన్నిడిసి పెట్టెల్లినాడే
నా రాజు....

సల్లని యెన్నెట్లో సాపేసి కూకుంటె...
ఒట్టమ్మి - ఒల్లంత ఉలికులికిపడతాదె!
నన్నిడిసి పెట్టెల్లినాడే
నా రాజు....

నీతైనవోడె, నా రాతెట్ట గుంటాదో!
కళ్ళలో సత్తెముగ కట్టినట్టుంటాదె!
నన్నిడిసి పెట్టెల్లినాడే
నా రాజు...
మొన్న తిరిగొస్తనన్నాడే!

రచన: నండూరి సుబ్బారావు
ప్రచురణ: నవరత్న బుక్ హౌస్

0 comments:

Post a Comment

Share

Widgets