Ads 468x60px

Monday, December 24, 2007

నీలమోహనా రారా...

నీలమోహనా రారా... నిన్ను పిలిచె నెమలి నెరజాణ
జారువలపు జడివాన కురిసెరా జాజిలత మేను తడసెరా
లతలాగే నా మనసు తడిసెరా //నీల//

ఏలాగే మతిమాలి ఏడే నీ వనమాలి
అతడేనేమో అనుకున్నానే
అంత దవుల శ్రావణ మేఘముల గనీ
ప్రతి మబ్బు ప్రభువైతే ప్రతి కొమ్మా మురళైతే ఏలాగే
ఆ...ఆ...ఆ..ఆ... సారెకు దాగెద వేమి?
నీ రూపము దాచి దాచి మురియుటకా స్వామీ?
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు
నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా

అటు..అటు...ఇటు.. ఇటు.. ఆ పొగడకొమ్మవైపు
ఈ మొగలి గుబురువైపు కార్తీక రాతిరిలో కఱి మబ్బయిందా
నీలిమేఘ మాకాశము విడిచి నేల నడుస్తుందా
నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా
నవ్వే పెదవులకు మువ్వల మురళుందా
పెదవి నందితే పేద వెదుళ్ళు కదలి పాడుతాయా?
నడిచే మబ్బులకు నవ్వే పెదవులు
నవ్వే పెదవులకు మువ్వల వేణువులు..


చిత్రం : డాక్టర్ ఆనంద్
గానం : పి.సుశీల
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : కె.వి.మహాదేవన్

0 comments:

Post a Comment

Share

Widgets