Ads 468x60px

Saturday, December 29, 2007

ప్రియురాల సిగ్గేలనే..

ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి -2

నాలోన ఊహించినా కలలీనాడు ఫలియించెస్వామి -2

ఏమి ఎరుగని గోపాలునకు ప్రేమలేవో నెరిపినావు -2
మనసుధీర పలుకరించి మా ముద్దు ముచ్చట్లు చెల్లించవే//ప్రి//

ప్రేమలు తెలిసి దేవుడవని విని నా మదిలోనే కొలిచితిని
స్వామిని నీవని తలచి నీకే బ్రతుకు కానుక చేసితిని//నాలో//

సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవు ఓ భామా
ఇప్పుడేమన్నా ఒప్పనులే ఇక ఎవరేమన్నా తప్పదులే //ప్రి//

చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం
గానం : ఘంటసాల, పి.సుశీల


ఎవ్వరికోసం ఈ మందహాసం

ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరింపవే
సొగసరి ఒకపరి వివరింపవే

చెలిమికోసం చెలిమందహాసం ఏమని వివరింతునొ
గడుసరి ఏమని వివరింతునో

వలపులు చిలికే వగలాడి చూపు
పిలువక పిలిచి విరహాల రేపు

యెదలో మెదలే చెలికానిరూపు
ఏదో తెలియని భావాల రేపు

ఈ నయగారం ప్రేమ సరాగం
అందించు అందరాని సంబరాలే //ఎవ్వరి//

పరుగులు తీసె జవరాలి వయసు
మెరుపై మెరిసి మరపించు మనసు

ప్రణయం చిందే సరసాల బంధం
ఇరువురి నొకటిగ పెనవేయు బంధం
ఈ వయ్యారం ఈ సింగారం
ఈ వయ్యారం ఈ సింగారం
చిందించుచిన్ని చిన్ని వన్నెలెన్నో //ఎవ్వరి//

చిత్రం : నర్తనశాల
గానం : ఘంటసాల, పి.సుశీల

రేపంటి రూపం కంటే

రేపంటి రూపం కంటే పూవంటి చూపులవంటి
నీకంటి చూపుల వెంట నా బ్రతుకంటె

రేపంటి వెలుగెకంటి పూవంటి దొరవే కంటె
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటె
నా తోడు నీవై వుంటే నీ నీడ నేనేనంటె
ఈ జంట కంటే వేరు లేనే లేదంటె

నీమీద ఆశలువుంచి ఆపైన కోరిక పెంచి -2
నీకోసం రేపూ మాపూ వుంటివి పొమ్మంటె

నే మల్లెపూవై విరిసి నీ చల్లని జడలో వెలసి
నీ చల్లని నవ్వుల కలవుంటె చాలంటె..

నీ కాలి మువ్వల రవళి నా భావి మోహనమురళి
ఈ రాగ సరళీ తరలి పోదాం రమ్మంటె //రేపంటి//
నీలోన మగసిరితోటి నాలోన సొగసుల పోటీ
నేయించి నేవోడిపోని పొమ్మంటె
నాలోని నీవే గెలిచి నీ గెలుపు నాదని తెలిసి-2
రాగాలు రంజిలు రాజే రాణి రమ్మంటె //రేపంటి//

చిత్రం : మంచిచెడు
గానం : ఘంటసాల, పి.సుశీల

మనసు పరిమళించెనే

మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవవసంత గానముతో నీవు చెంత నిలువగనే

మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవవసంత గానముతో నీవు నటన సేయగనే

నీవు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
గల గల గల సెలయేరులలొ కలకలములు రేగగా

కొత్త పూల నెత్తావులలో మత్తుగాలి వీచగా
భ్రమరమ్ములు గుబుగుబులుగా జుంజుమ్మని పాడగా

చిత్రం : శ్రీకృష్ణార్జున యుద్ధం
గానం : ఘంటసాల, పి.సుశీల

చెలికాడు నిన్నే రమ్మని

చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా

నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చిలికాయి
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేది హాహా హో హో

నీ అందమే శ్రీగంధమై నాడెందమలరించే
నీరూపమే నాలో ప్రియా నా చూపులు వెలిగించే అహాహా అహా
నీతోడుగా నడయాడగా ఇంకేమి కావాలి
మధురానురాగాలే ఫలించే తరుణం రావాలి.

చిత్రం : కులగోత్రాలు
గానం : ఘంటసాల, పి.సుశీల

మధుర భావాల సుమమాల

మధుర భావాల సుమమాల మనసులో పూసే ఈ వేళ
పసిడి కలలేవో చివురించి ప్రణయ రాగాలు పలికించే -2

ఎదను అలరించు హారములో
పొదిగితిని ఎన్నెన్ని పెన్నిధిలో

మరువరాని మమతలన్ని
మెరిసిపోవాలి కన్నులలో //మధుర//

సిరులు తులతూగు చెలిమికైనా
కరుణ చిలికేవు నాపైన

కలిమికన్నా చెలిమి కన్న
కలవు మణులెన్నో నీలో //మధుర//

ఒకే పడవందు పయనించే
ఒకే గమ్యము ఆశించి

ఒకే మనసై ఒకే మనువై
ఆ ఉదయశిఖరము చేరితిమి //మధుర//

చిత్రం : జైజవాన్
గానం : ఘంటసాల, పి.సుశీల

చిలుకా ఏ తోడు లేక

చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక //చిలుకా//


బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే
వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హాలహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా//


అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం పొంగే నీ ధనరాశితో అనాధగా మిగిలావే అమావాస్యలో
తీరా నీవు కనుతెరిచాకా తీరం కనబడదే యింకా //చిలుకా//

చిత్రం : శుభలగ్నం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : సిరివెన్నెల

ఈ పాదం పుణ్యపాదం

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం ప్రణవ మూల నాదం
ప్రథమలోకపాదం ప్రణతులే చేయలేని ఈ తరమేల ఈ కరమేల
ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం

మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ...
భక్తకన్నప్ప కన్న పరమపాదం భాగ్యపదం
ఆత్మలింగ సయంపూర్ణ ఆత్మలింగ స్వంపూర్ణుడే సాక్షాత్కరించినా
చేయూతవీడినా అయ్యో అందని అనాధనైతి మంజునాధా
ఈ పాదం పుణ్యపదం ధరనేలే ధర్మపదం
ప్రణయమూల పాదం ప్రళయ నాట్యపాదం
ప్రణతులే చేయలేని ఈ శిరమేల ఈ బ్రతుకేల

భక్త శిరియాళు నేలిన హేమపాదం
బ్రహ్మ విష్ణులే భుజించే ఆదిపాదం అనాదిపాదం
అన్నదాత విశ్వదాత లీలా వినోదిగా
నన్నేలగా దిగిరాగా అయ్యో చీ
పొమ్మంటి నే పాసినై తినే ఈ పాదం పుణ్యపాదం ఈపాదం
ధర్మపాదం
సకల ప్రాణపాదం సర్వమోక్ష పాదం
తెలుసుకోలేని నా ఈ తెలివేల ఈ తనువేల


చిత్రం : శ్రీ మంజునాధా
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

తోటలోకి రాకురా

తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది
కన్నుసైగ చేయకురా కామినీ చోరా గోపికాజారా
మా రాధ అనురాగం మారనిది అది
ఏ రాసకేళిలోన చేరనిది జిలుగు పైట లాగకురా
తొలకరి తుమ్మెద చిలిపి తుమ్మెదా కన్నెసిగ్గు మేలిముసుగు
వీడనిది అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది
రోజు దాటి పోగానే జాజులు వాడునురా
మోజులు వీడునురా కన్నెవలపు సన్నజాజి వాడనిది
అది ఎన్ని జన్మలైనా వసివాడనిది

చిత్రం : బుద్ధిమంతుడు
గానం : పి.సుశీల
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహాదేవన్

ఒక వేణువు వినిపించెను

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా
ఒక్ రాధిక అందించెను..నవరాగ మాలికా

సిరి వెన్నెల తెలవోయెను..జవరాలి చూపులో
నవ మల్లిక చివోయెను.. చిరునవ్వు సొగసులో

వనరాణియె అలివేణికి..సిగపూలు తురిమెనో
రేరాణియే నా రాణికి..పారాణి పూసెనో

ఏ నింగికి ప్రభవించెనో..నీలాల తారక
నా గుండెలో వెలిగించెను..శృంగార దీపికా

చిత్రం : అమెరికా అమ్మాయి
గానం : జి.ఆనంద్
రచన : శ్రీగోపి
సంగీతం: జి.కె.వెంకటేష్

పులకించని మది పులకించు

పులకించని మది పులకించు
వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు
మనసునే మరపించు గానం
మనసునే మరపించు..

రాగమందనురాగ మొలికి
రక్తి నొసగును గానం
రేపు రేపను తీపి కలలకు
రూపమిచ్చును గానం

చెదిరిపోయే భావములకు చేర్చి కూర్చును గానం
జీవ మొసగును గానం ..
మది చింత బాపును గానం ..
వాడిపోయిన పైరులైనా నీరు
గని నర్తించును కూలిపోయిన తీగయైనా

కొమ్మ నలిమి ప్రాకును కన్నె మనసు
ఎన్నుకొన్న తోడు దొరికిన మరియు
దోర వలపే కురియు...
మది దోచుకొమ్మనీ తెలుపు //పులకించని//

చిత్రం : పెళ్ళికానుక
గానం : జిక్కి
రచన : ఆత్రేయ
సంగీతం : ఏ.ఎం.రాజా

చల్లని రాజా!

చల్లని రాజా! ఓ చందమామా! నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా! నా చందమామా!
పరమేశుని జడలోన చామంతిని
నీలి మేఘాలనాడేటి పూబంతిని
నిను సేవించెదా నను దయచూడవా?
ఓ వన్నెల వెన్నెల నా చద్నమామా //చలని//

చల్లని రాజా! ఓ చందమామా! నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా!నా చందమామా
నిను చూసిన మనసెంతో వికసించుగా
తొలి కోరికలెన్నో చిగురించగా
ఆశలూరించునే చెలికనిపించునే
చిరునవ్వుల వెన్నెల కురిపించునే

చల్లని రాజా! ఓ చందమామా! నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా! నా చందమామా!


చిత్రం :ఇలవేలుపు
గానం : ఏ.ఎం.రాజా, జిక్కి

చుక్కలన్ని చూస్తున్నాయీ

చుక్కలన్ని చూస్తున్నాయీ చుక్కలన్ని చూచేనూ ఫక్కున నవ్వేనూ
ఎక్కడైన దాగుందామా చక్కనైన చినవాడా
చందమామ వస్తున్నాడు చందమామ వచ్చేనూ
నిన్ను నన్ను చూసేనూ ఎక్కడైన దాగుందామా అందమైన చినదానా

మల్లె తీగమాటున కళ్ళు కలుపుకుందామా కళ్ళలోని కోరికతో
మనసు నింపుకుందామా మల్లె తీగమాటున మల్లెలన్ని చూచేనూ
కళ్ళలోని కోరికలు మల్లెలే కాజేయులే //చుక్కలన్ని//

కొలనులోని నీళ్ళలో కొంతసేపు వుందామా
కలలుగనే హృదయంలో వలపు నిలుపుకుందామా
కొలనులోన దాగుంటే అలలు మనను చూచేనూ
వలపులోని తీయదనం అలలే కాజేయులే //చుక్కలన్ని//

నా కన్నుల చాటుగా నిన్ను దాచుకుంటానే
నీకౌగిలి మాటుగా నేను నిదురపోతాలే
నేను నీకు తోడునే నేను నీకు తోడునే
నీవు నేను ఒకటైటే జీవితం స్వర్గమే //చుక్కలన్ని//

చిత్రం : జ్వాలాదీప రహస్యం
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : దాశరథి
సంగీతం : ఎస్.పి.కోదండపాణి

అమ్మ కడుపు చల్లగా

అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా

నా మెడలో తాళిబొట్టు కట్టరా నా నుదట నిలువు బొట్టు పెట్టరా
నీ పెదవిమీద సిరునవ్వు సెరగదురా నీ సిగపూవుల రేకైనావాడదురా వాడదురా
బతకరా బతకరా పచ్చగా //అమ్మ//

చల్లని అయితేణికి మొక్కరా సన్నికల్లు మీదకాలు తొక్కరా
చల్లవేళ కంటనీరు వద్దురా నా నల్లపూసలే నీకు రక్షరా రక్షరా
బతకరా బతకరా పచ్చగా //అమ్మ//

నా కొంగు నీ చెంగూ ముడివేయరా నాచేయి నీ చేయి కలపరా
ఏడడుగులు నాతో నడవరా ఆ యముడైనా మనమద్దికి రాడురా రాడురా
బతకరా బతకరా పచ్చగా //అమ్మ//

చిత్రం : సాక్షి
గానం : పి.సుశీల
రచన : ఆరుద్ర
సంగీతం : కె.వి.మహాదేవన్

Friday, December 28, 2007

మనసున మల్లెల మాలలూగెనే

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో.....
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా......
అలలు కొలనులో గల గల మనినా.....
అలలు కొలనులో గల గల మనినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా......
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఎగసిన హౄదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో

చిత్రం : మల్లీశ్వరి
గానం : భానుమతి
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు

శ్రీకర కరుణాలవాళ

శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా
శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా
సిరులు యశము సోభిల్ల దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా

కాకతీయ వైభవం హంపి వేంగీ ప్రాభవం
కాకతీయ వైభవం హంపి వేంగీ ప్రాభవం
కన్నతండ్రి కలలు నిండి
మా కన్నతండ్రి కలలు నిండి కలకాలం వర్ధిల్లగా

శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా
సిరులు యశము సోభిల్ల దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా

పెరిగి మాబాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా
పెరిగి మాబాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా
తెలుగు కీర్తి తేజరిల్లి తెలుగు కీర్తి తేజరిల్లి దిశలా విరాజిల్లగా

శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా
సిరులు యశము సోభిల్ల దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా !!

చిత్రం : బొబ్బిలి యుద్ధం
గానం : భానుమతి
రచన : సముద్రాల
సంగీతం :సాలూరి రాజేశ్వర రావు

జయకృష్ణా ముకుందామురారి

హే.....కృష్ణా.... ముకుందా....మురారీ....
జయకృష్ణా ముకుందామురారి
జయగోవింద బృందా విహరీ //జయ//

దేవకిపంట వసుదేవునిఇంటా 2
యముననునడిరేయి దాటితివంటా 2
వెలసితివంటా నందుని ఇంటా 2
వ్రేపల్లె ఇల్లాయేనంటా...ఆ..//జయ//


నీ పలుగాకి పనులకు గోపెమ్మ
కోపించి నినురోటబంధించెనంటా
ఊపునబోయీ మ్రాకులకూలిచి 2
శాపాలు బాపితివంటా....ఆ..//జయ//


అమ్మా తమ్ముడు మన్నుతినేనూ
చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నాయనిచెవినులిమి యశోద
యేదన్నా నీ నోరుచూపమనగా...ఆ...
చూపితివట నీ నోటను
బాపురే పదునాల్గు భువనభాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యత గాంచేన్ //జయ//

కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ
కేళీగటించిన గోపకిషోరా 2
కంసాదిదానన గర్వాపహరా 2
హింసావిదూరా పాపవిహారా //జయ//


కస్తూరి తిలకం లలాట పలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరేకంకణం
సర్వాంగే హరిచందనంచ కలయన్
కంఠేచ ముక్తావళిం గోపశ్రీ పరివేష్టితో ...
విజయతే గోపాల చూడామణి 2
లలిత లలిత మురళీ స్వరాళీ
పిలకిత వనపాళి గోపాళీ 2
మురళికృత నవరానకేళి 2
వనమాలీ శిఖిపించ మౌళీ2
కృష్ణా ముకుందా మురారీ

చిత్రం : పాండురంగ మహత్యం
గానం : ఘంటసాల

ఎన్నాళ్ళని నా కన్నులు

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా
ఎంతపిలిచినా ఎంత వేడినాఈనాటికి దయ రాదేలా
గోపాలా నంద గోపాలా గోపాలా నంద గోపాలా

వీనులవిందగు వేణుగానమూ నినుతరించగ వేడితిరా
ఆ....ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
వీనులవిందగు వేణుగానమూ నినుతరించగ వేడితిరా
వేచి వేచి వెన్నముద్దవలే కరిగిపోయరా
నా బ్రతుకు కరిగి పోయరా నాబ్రతుకూ....

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా
వెన్నమీగడల జున్నుపాలకు ఏమి కొరతరా మన ఇంటా
ఆ....ఆ....ఆ..ఆ..ఆ.ఆ..ఆ....
వెన్నమీగడల జున్నుపాలకు ఏమి కొరతరా మన ఇంటా
వెన్నెను దొంగిల పరుల ఇంట దెబ్బలు తినకురాకన్నయ్యా
ఈ తల్లి హృదయమూ ఓర్వలేదయా

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా

చిత్రం : శ్రీ వేంకటేశ్వర మహత్యము
గానం : పి.శాంతకుమారి
సంగీతం : పెండ్యాల

మల్లె తీగవంటిదీ

మల్లె తీగవంటిదీ మగువ జీవితం - 2
చల్లనిపందిరి వుంటే
అల్లుకొపోయేనూ అల్లుకొ పోయేనూ//మల్లె //

తల్లి తండ్రుల ముద్దూమురిపెం
చిన్నతనం లో కావాలీ 2
ఇల్లలికి పతి అనురాగం
ఎల్లకాలమూ నిలవాలి 2
తల్లికి పిల్లల ఆదరణ
పండు వయసులో కావాలీ
ఆడవారికీ అన్నివేళలా
తోడూనీడ వుండాలీ
తోడూనీడ వుండాలీ//మల్లె //

నుదుట కుంకుమ కళ కళ లాడే
సుధతే ఇంటికి శోభా 2
పిల్లల పాపలప్రేమగ పెంచే
తల్లే ఆరని జ్యోతీ 2
అనురాగం తో మనసును దోచే
వనితే మమతల పంటా
జన్మను ఇచ్చి జాతిని నిలిపే
జననే జగతికి ఆధారం
జననే జగతికి ఆధారం //మల్లె //


చిత్రం : మీనా
గానం : పి.సుశీల
సంగీతం : రమేశ్ నాయుడు

మధువలక బోసే...

మధువలక బోసే
ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ
మధువలక బోసే
ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ

మధువలకబోసే ఇ చిలిపికళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ

అడగకనే ఇచ్చినచో
అది మనసుకందమూ
అనుమతినే కోరకనే
నిండేవు హౄదయమూ
తలవకనే కలిగినచో
అదిప్రేమ బంధమూ
బహుమతిగా దోచితివీ
నాలోని సర్వమూ
మనసు మనసుతో...ఊసులాడనీ
మూగభాషలో..బాసచేయనీ
ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ

మధువలకబోసే ఇ చిలిపికళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ

గగనముతో కడలి చెలి పలికినది ఏమనీ
తలపులకు..వలపులకు..సరిహద్దులేదనీ
కుసుమముతో ఆభ్రమరం తెలిపినది ఏమనీ
జగమునకు మనచెలిమి ఆదర్శ్యమౌననీ
కలలు తీరగా...కలిసి పొమ్మనీ
కౌగిలింతలో...కరిగి పొమ్మనీ
ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ

మధువలకబోసే...హా
ఈ చిలిపి కళ్ళూ...ఆ.
అవి నాకు వేసే..ఆ.
బంగారు సంకెళ్ళూ.

చిత్రం : కన్నవారి కలలు
గానం : వి.రామకృష్ణ, పి.సుశీల
రచన : రాజశ్రీ
సంగీతం :వి.కుమార్

వెన్నెల్లో గోదారి అందం

వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం -2(వెన్నెల్లో గోదారి)
అది నిరుపేద నా గుండెలో
చలి నిట్టూర్పు సుడిగుండమై
నాలో సాగే మౌనగీతం
//వెన్నెల్లో గోదారి //

జీవిత వాహిని అలలై ... జీవిత వాహిని అలలై
ఊహకు ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో..ఎడబాటే..
ఒక పాటై పూలదీవిలో సుమవీణ మోగునా
//వెన్నెల్లో గోదారి//

నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి..
కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నాచూపులు చూడలేని మంచు బొమ్మనై..
యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని చిదిమి చిదిమి
వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే..
నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం .. - 2
ఆశలు మాసిన వేసవిలో... ఆవేదనలో రేగిన ఆలాపన సాగే ..
మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కరిగే
మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో ..తిరిగే.. సుడులై ..
ఎగసే ముగిసే కదనేనా .. ఎగసే ముగిసే కదనేనా..


చిత్రం : సితార
గానం : ఎస్.జానకి
సంగీతం : ఇళయరాజా

పిలిచినా బిగువటరా

పిలిచినా బిగువటరా ఔరౌరా -3
చెలువలు తామే వలచి వచ్చిన పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా ఆ

ఈ నయగారము ఈ వయ్యారముఈ - 2
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా

గాలుల తేనెల వాడని మమతల - 2
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందెల రవళుల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా - 2
పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా

చిత్రం : మల్లీశ్వరి
గానం : భానుమతి
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి

ఓ బంగరు రంగుల చిలకా

ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీనా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ ....నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ

పంజరాన్ని దాటుకునీ..
బంధనాలు తెంచుకునీ..నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా..
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో.. నీ చేతులలో.. పులకించేటందుకే ..
//ఓ బంగరు రంగుల చిలకా పలకవే//

సన్నజాజి తీగుంది..తీగ మీద పువ్వుంది..
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది..జుంటి తేనె కోరింది..
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో..ఈ కోనల్లో..మనకెదురే లేదులే

ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ

చిత్రం : తోటరాముడు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
రచన: వేటూరి
సంగీతం : చక్రవర్తి

ఆకాశం ఏనాటిదో

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ

ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే..ప్రణయాలై.. స్వప్నాలే...స్వర్గాలై...
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలవెను

ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది

ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించెనో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ
కౌగిలిలో చెరవేచు మదనుని కరిగించీ గెలిపించమనగ
మోహాలే.. దాహాలై....సరసాలే.. సరదాలై
కలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది

చిత్రం : నిరీక్షణ
గానం : ఎస్.జానకి
సంగీతం : ఇళయరాజా

మాటే మంత్రమూ

ఓం శతమానం భవతి శతాయుః పురుష
శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ !

మాటే మంత్రమూ మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం... - మాటే మంత్రమూ
చరణం : నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా..పూవూ తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో - మాటే మంత్రమూ

నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎదనా కోవెలా.. ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

మాటే మంత్రమూ..మనసే బంధమూ
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూ
ఇది కళ్యాణం కమనీయం జీవితం !


చిత్రం : సీతాకోకచిలుక
గానం :ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
రచన : వేటూరి
సంగీతం:ఇళయరాజా

సిరిమల్లె నీవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే //సిరిమల్లె నీవే//


ఎలదేటిపాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లే
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే వనదేవతల్లే
పున్నాగపూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే // సిరిమల్లె నీవే //


మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకోవే నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే //సిరిమల్లె నీవే//

చిత్రం : పంతులమ్మ
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

తెలవారదేమో స్వామి....

తెలవారదేమో స్వామి....
తెలవారదేమో స్వామి నీ తలపుల మునుకలో
అలసిన దేవెరి అలమేలు మంగకూ......

చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై అలసిన దేవెరి,
అలసిన దేవెరి అలమేలు మంగకూ ....

మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునె మది మరి మరి తలచగమరి మరి తలచగ
అలసిన దేవెరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామి గ మ ప ని
తెలవారదేమోస ని ద ప మ ప మ గ ని స గ మ
తెలవారదేమో స్వామిప ని ద ప మ గ మప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి స రి ని స
తెలవారదేమో స్వామి....

చిత్రం : శ్రుతిలయలు
గానం : కె.జె.యేసుదాస్,
రచన :సిరివెన్నెల
సంగీతం:కె.వి.మహాదేవన్

లలిత ప్రియ కమలం...

లలిత ప్రియ కమలం విరిసినదీ కన్నుల కొలనిడి..ఆ
ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని .. ఆ....
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని .. ఆ....
అమృతకలశముగా ప్రతినిమిషం అమృతకలశముగా ప్రతినిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది
లలిత ప్రియ కమలం విరిసినదీ.....


రేయీ పగలూ కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నెలా నింగీ కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరులవనం మన హృదయం-2
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి ఈ రాగ చరితరగల మ్రుదురవళీ
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను
(లలిత ప్రియ కమలం విరిసినదీ..కన్నుల కొలనిడి....)


కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ
కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం
తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినదీ-2
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఉదయ రవికిరణం మెరిసినదీ ఊహల జగతిని ఆలలిత ప్రియ కమలం విరిసినదీకన్నుల కొలనిడి..ఆ....
లలిత ప్రియ కమలం విరిసినదీ....

చిత్రం : రుద్రవీణ
గానం : యేసుదాస్, చిత్ర
సంగీతం:ఇళయరాజా

యమునా తటిలో

యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా

ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెనే కాదా-2


రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే

రాసలీలలా రాజు రానిదే రాగ బంధమె లేదే-2

కుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే

రాధ గుండెలోయదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో...పాపం రాధా

యమునా తటిలో నల్లనయ్యకై యెదురు చూసెనే రాధా

ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడి పోయెనే కాదా

చిత్రం : దళపతి
గానం : చిత్ర
సంగీతం : ఇళయరాజా

చాంగురే బంగారు రాజా

చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే....
అయ్యారే....నీకే మనసియ్యలని వుందిరా
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

ముచ్చటైన మొలక మీసముంది
భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముంది
మేటి దొరవు అమ్మక చెల్లనీ సాటి ఎవ్వరునుండుట కల్ల
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

కైపున్న మచ్చకంటి చూపు
అది చూపు కాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో
గుచ్చుకుంటే తెలుస్తుందిరా..
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా...
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

గుబులుకొనే కోడెవయసు
లెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచు దనపు గిలిగింత గడుసు గడుసు పులకింత
ఉండనీయవేమి సేతురాకై దండలేక నిలువలేనురా
చాంగురే...చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా

చిత్రం : శ్రీకృష్ణపాండవీయం
గానం : జిక్కి
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం: పెండ్యాల

వేణువై వచ్చాను భువనానికి

వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి

ఏడుకొండలకైనా అండ తానొక్కడే
ఏడు జన్మల తీపి ఈ బంధమే -2
నీ కంటిలో నలక లో వెలుగు నేననక
నేను నేననుకుంటే ఎద చీకటి హరీ హరీ.....హరీ
రాయినై ఉన్నాను ఏనాటికీ రామ పాదము రాక ఏనాటికీ..

వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయె
నీరు నిప్పుగ మారె నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు
పుట్టిల్లు చేరెను మట్టి ప్రణాలు హరీ హరీ హరీ
రెప్పనై ఉన్నాను నీ కంటికి పాపనై వస్తాను నీ ఇంటికి...
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి

చిత్రం : మాతృదేవోభవ
గానం : చిత్ర
సంగీతం : కీరవాణి
రచన : వేటూరి సుందర రామ్మూర్తి

ఆమనీ పాడవే హయిగా…

ఆమనీ పాడవే హయిగా…
మూగవై పోకు ఈ వేళా…
రాలేటి పూల రాగాలతొ… పూసేటి పూల గంధాలతొ
మంచు తాకి కోయిలా… మౌనమైన వేళలా…
ఆమనీ పాడవే హయిగా… - 2

వయస్సులో వసంతమే… ఉషస్సులా జ్వలించగా
మనస్సుల్లో నిరాశలే… రచించెలే మరీచికా
పదాల నా ఎదా… స్వరాల సంపదా
తరాల నా కధా… క్షణాలదే కధా…
గతించిపొవు గాధ నేననీ…

ఆమనీ పాడవే హయిగా… మూగవై పోకు ఈ వేళా…

ఛుకాలతో… పికాలతో… ధ్వనించిన మధూధయం…
వినీధులీ కలా నిజం… స్ర్పుశించినా మహోదయం…
మరొ ప్రపంచమె మరింత చెరువై…నివాళి కోరిన ఉగాది వేళలో…
గతించిపోని గాధ నేననీ…

ఆమనీ పాడవే హయిగా… మూగవై పోకు ఈ వేళా…
రాలేటి పూల రాగాలతొ… పూసేటి పూల గంధాలతొ
మంచు తాకి కోయిలా… మౌనమైన వేళలా…
ఆమనీ పాడవే హయిగా… - 2

చిత్రం : గీతాంజలి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం:ఇళయరాజా

ఓ పాప లాలి....

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రెమకే లాలి పాడన తీయగా…
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రెమకే లాలి పాడన తీయగా…ఓ పాప లాలీ…

నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా…
నీ సవ్వడె సన్నగ ఉండాలనికోరనా గుండెనే కోరికా…
కలలారని పసి పాప తల వాల్చిన వొడిలొ
తడి నీడలు తడనీయకు ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవీ

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రెమకే లాలి పాడన తీయగా…ఓ పాప లాలీ…

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకిగాలిలో… తెలిపో… వెళ్ళిపో…
ఓ కోయిల పాడవే నా పాటని…తీయని… తేనెలే… చల్లిపో…
ఇరు సంధ్యలు కదలాడే యెద ఊయల ఒడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి యెండకు సిరివెన్నలకిది నా మనవీ…

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రెమకే లాలి పాడన తీయగా…

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రెమకే లాలి పాడన తీయగా…ఓ పాప లాలీ…

చిత్రం : గీతాంజలి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం:ఇళయరాజా

ఇది మల్లెల వేళయనీ

ఇది మల్లెల వేళయనీ
ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ విందులు చేసింది

కసిరే ఏండలు కాల్చునని
ముసిరే వానలు ముంచునని -2
ఎరుగని కొయిల ఎగిరింది
ఎరుగని కొయిల ఎగిరింది చిరిగిన రెక్కల వొరిగింది నేలకు వొరిగింది

మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం -2మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు
వాడని వసంత మాసం వసి వాడని కుసుమ విలాసం
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

ద్వారానికి తారా మణి హారం
హారతి వెన్నెల కర్పూరం - 2
మోసం ద్వేషం లేని సీమలో
మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం
ఇది మల్లెల వేళయనీ
ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ విందులు చేసింది

చిత్రం : సుఖదుఖాలు
గానం : పి.సుశీల
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం:ఎస్.పి.కోదండపాణి

మరల తెలుపనా

మప మప ని రిమ రిమ స ఆ ఆ ఆ...

మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
కనుపాపలో నింపుకున్నా చిరునవ్వుల పరిచయాన్ని - మరల తెలుపనా

విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని-2
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని -2
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్ప లేక చేతకాక మనసుపడే తడబాటుని - మరల తెలుపనా

నిన్న లేని భావమేదొ కనులు తెరిచి కలయచూచి - 2
మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి
ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన
తెలిరరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ..
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా....

చిత్రం : స్వయంవరం
గానం : చిత్ర
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్

Wednesday, December 26, 2007

ఆనంద తాండవ మాడే

ఆ..ఆ..ఆ..
ఆనంద తాండవ మాడే - శివుడు
అనంతలయుడు - చిదంబర నిలయుడు
నగరాజ సుత - చిరునగవులు చిలుకంగ
సిగలోన ఒగలొలికి ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ

ప్రణవ నాదం ప్రాణం కాగా - ప్రకృతి మూలం తానం కాగా
భువనములే రంగ భూమికలు కాగా
భుజంగ భూషణుడు - అనంగ భీషణుడు
పరమ విభుడు - గరళధరుడు
భావ రాగ తాళ మయుడు సదయుడు

ఏమి శాంభవ లీల - ఏమి తాండవ హేల
అణువణువులోన దివ్యానంద రసడోల
సుర గరుడులు - ఖేచరులు - విద్యాధ్రులు
నిటల తట ఘటిత - నిజకరకములై
నిలువగా - పురహరాయని పిలువగా -కొలువగా

కిణకిణ కిణ కిణ మణి నూపురముల ఝణత్కారములు మ్రోయగా
ధిమి ధిమి ధిమి ధిమ డమరుధ్వానము
దిక్తటముల మార్మోయగా
విరించి తాళము వేయగా - హరి మురజము మ్రోయింపగా
ప్రమధులాడగా అప్సరలు పాడగా - ఆడగా _ పాడగా

చిత్రం : అమెరికా అమ్మాయి
గానం : పి.సుశీల
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం : జి.కె.వెంకటేష్

చక్కనయ్యా చందమామా

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ.. గొల్లుమన్నాము //చక్క//

మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ..
వెతుకుతున్నామూ //చక్క//

దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో..
రాలేకవున్నావో... //చక్క//

చిత్రం : భార్యాబిడ్డలు
గానం : పి.సుశీల
రచన : ఆత్రేయ
సంగీతం : కె.వి.మహాదేవన్

తొలికోడి కూసింది

తొలికోడి కూసింది - తెల తెలవారింది
వెలుగులలొ జగమంతా జలకాలాడింది //తొలి//

దూరాల ఆకాశ తీరాల
బంగారు హారాలు వేసెను కిరణాలు
ఈ వేళ విరిసే భావాల
మెరిసే శ్రీ వేంకటేశుని చరణాలు//తొలి//

అనురాగవల్లి - ఆతీగవల్లి - అలరారె తనపూల పాపలతో
తొలిచూరులేగ తలవూపి రాగ - పులకించె గోమాత చేవులతో//తొలి//

చిత్రం : తిక్క శంకరయ్య
గానం : పి.సుశీల
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు

అందాల బొమ్మతో ఆడాడవా?

అందాల బొమ్మతో ఆడాడవా?
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ
కనులు చేపలై గంతులు వేసె
మనసు తోటలొ మల్లెలు పూసె
దోసిట వలపుల పూవులు నింపీ
నీ కోసము వేచితి రావోయీ

చల్ల గాలిలో కబురంపితి నోయి
చందమామలో వెదకితి నోయీ
తార తారనూ అడిగితి నోయీ
దాగెద వేలా? రావోయీ

నల్లని మేఘము జల్లు కురియగా
ఘల్లన ఆడే నీలినెమలినై
నిను గని పరవశమందెద నోయీ
కనికరించి ఇటు రావోయీ

చిత్రం : అమరశిల్పి జక్కన్న
గానం : పి.సుశీల
రచన : దాశరథి
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు

నిను చేర మనసాయెరా !

నిను చేర మనసాయెరా ! నా స్వామి
చనువార దయసేయరా!
విడిదికి రమ్మని చాల వేడితిరా
బిడియము నీకేలరా _ దొరా
సరసుడవని నిన్నే పదిమంది పొగడ
మరిమరి కోర్కెలు విరిసెను ప్రియుడా
వయసు నీకొరకె పలువరించెరా
తనువు నిన్ను దలచి పులకరించెరా
మగువ కోర మొగమాట మేలరా
బిగువు మాని జవరాలి నేలరా
సొగసు చూచి ఎదురు కాచి నిలచి
పగలు రేలు దిగులు చెందు చెలికి

చిత్రం : బొబ్బిలి యుద్ధం
గానం : పి.సుశీల
రచన : శ్రీశ్రీ
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

ముత్యాల చెమ్మచెక్క

ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగల లాడ //ముత్యాల//

తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె //ముత్యాల//

ఒప్పులకుప్ప - వయ్యారి భామా
సన్నబియ్యం - చాయపప్పు
చిన్నమువ్వ - సన్నగాజు
కొబ్బరికోరు - బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్ - నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు - నీ మొగుడెవడు

ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె //ముత్యాల//

చిత్రం : బొబ్బిలి యుద్ధం
గానం : పి.సుశీల
రచన : ఆరుద్ర
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు

కొళ్ళాయి కట్టితినేమి మా గాంధి

జోహారు శిఖిపించమౌళి

జోహారు శిఖిపించమౌళి
జోహారు రసరమ్య గుణశాలి! వనమాలి!
కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే అరులను జడిపించి
నయగార మొకకంట! జయవీర మొకకంట!
చిలకరించి చెలువుమించి నిలిచిన
శ్రీకర నరవర! సిరిదొర //జోహారు//

నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నిగమాలకే నీవు సిగబంతివైనావు
యుగయుగాల దివ్యలీల నెరసిన
అవతారమూర్తి! ఘనసార కీర్తి //జోహారు//

చకిత చకిత హరిణేక్షణా వదన
చంద్రాకాంతు లివిగో!
చలిత లలిత రమణీ చేలాంచల
చామరమ్ము లివిగో!
ఝళం ఝళిత సురలలనా నూపుర
కలరవమ్ము లివిగో! మధు
కరరవమ్ములివిగో ! మం
గళరవమ్ములివిగో !
దిగంతముల అనంతముగ గుబాళించు
సుదూర నందన సుమమ్ము లివిగో

చిత్రం : శ్రీ కృష్ణ విజయము
గానం : పి.సుశీల
రచన : సి. నారాయణరెడ్డి
సంగీతం: పెండ్యాల

అందమైన తీగకు

అందమైన తీగకు పందిరుంటే చాలును
పైకి పైకి ప్రాకుతుంది చినదానా
పరవశించి పాడుతుంది చినదానా

పాదులోని తీగవంటిది పడుచు చిన్నది
పరువమొస్తే చిగురువేసి వగలు పోతుంది
మొగ్గ తొడిగి మురిసిపోతూ సిగ్గుపడుతుంటుంది
తగ్గ జతకయి కళ్ళతోనే వెతుకుతుంటుంది

కళ్ళు కళ్ళు కలిసినప్పుడు కలలు వస్తాయి
కన్నెపిల్ల కలలకెపుడో కాళ్ళు వస్తాయి
అడుగులోన అడుగు వేస్తే అందమొస్తుంది
నడువలేని నడకలే ఒక నాట్యమవుతుంది.

చిత్రం : భార్యా బిడ్డలు
గానం : ఘంటసాల

మరదలు పిల్లా

మరదలు పిల్లా ఎగిరిపడకు
గడసరి పిల్ల ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా - 2

మొగలిపువ్వులా సొగసుంది
ముట్టుకుంటే గుబులౌతుంది
కోడెత్రాచులా వయసుంది
అది కొరుకుతుంటే దిగులౌతుంది
ఆమెలో బలే అందముంది - 2

కసురుకుంటే కవ్విస్తాను
విసుకుంటే ఉరికిస్తాను
ముక్కుతాడు తగిలిస్తాను
మూడు ముళ్ళు వేసిస్తాను
ఏనాడైనా నీవాడనే - 2

చిత్రం : గండికోట రహస్యం

గానం : ఘంటసాల

కలవరమాయే మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలేమాయె
మనసే ప్రేమ మందిరమాయె
కలవరమాయే మదిలో నామదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడియాయే
మనసే పూలమండపమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

నాలో యేమొ నవభావనగా
మెల్లగ వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా
మనసున కోయిల కూసే


చిత్రం : పాతాళ భైరవి
గానం : ఘంటసాల, పి.లీల

నడిరేయి ఏ జాములో

నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో

మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభునికి మా మనవి వినిపించవమ్మా


ఏడేడు శిఖరాలు నే నడువలేను
ఏపాటి కానుక అందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
వివరించి నా బాధ వినిపించలేను

అమ్మా .. మముగన్న మాయమ్మ అలిమేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభునికి మా మనవి వినిపించవమ్మా


కలవారినేకాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనివాడు
స్వామి కరుణమయుండన్న బిరుదేలనమ్మా
అడగవే మా తల్లి అనురాగవల్లి
అడగవే మాయమ్మా అలిమేలుమంగా..

చిత్రం : రంగులరాట్నం
గానం : ఎస్.జానకి, ఘంటసాల

ఓ రంగయో పూలరంగయో

ఓ రంగయో పూలరంగయో ఓరచూపు చాలించి సాగిపోవయో
పొద్దువాలి పోతున్నదోయి ఇంత
మొద్దు నడక నీకెందుకోయి

పగలనక రేయనక పడుతున్న శ్రమనంత
పరులకొరకే దారపోయి మూగజీవులు

ఆటలలొ పాటలలొ ఆయాసం మరచిపోయి
ఆనందం పొందగలుగు ధన్యజీవులు

కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని
యీ దీనుల జీవితాలు మారుటెన్నడో

కలవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి
కనిపెట్టి మేలు చేయ గలిగినప్పుడే

చిత్రం : వెలుగు నీడలు
గానం : ఘంటసాల, పి.సుశీల

చిగురాకులలో చిలకమ్మా

ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట విన రావమ్మా
మరు మల్లెలలో మామయ్యా మంచి మాట సెలవీవయ్యా

పున్నమి వెన్నెల గిలిగింతలకు
పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మా
ఎవరన్నారో ఈ మాటా వింటున్నాను నీ నోట
తెలిసి తొణికిన వినవేలా
వలపే కోమలి వయ్యారాలకు
తలపే మనసుల తియ్యదనాలకు
కలవారి కలువలు సెలవియ్య
పై మెరుగులకే భ్రమ పడకయ్యా
మనసే మాయని సొగసయ్యా
గుణమే తరగని ధనమయ్యా


చిత్రం :దొంగరాముడు
గానం : ఘంటసాల,పి.సుశీల

వెన్నెలలో వేడి

వెన్నెలలో వేడి ఏలనో
వేడిమిలోనే చల్లనేలనో
నీ మాయ యేమో జాబిలి
నీ మాయ యేమో జాబిలి

వెన్నెలలోనే విరహమేలనో
విరహములోనే హాయి ఏలనో
నీ మాయ యేమో జాబిలి
నీ మాయ యేమో జాబిలి
మొన్నటికన్నా నిన్న వింతగా
నిన్నటికన్నా నేడు వింతగా
నీ సొగసూ ని వగలూ
హాయి హాయీగా వెలసేనే
రూపము కన్నా చూపు చల్లగా
చూపులకన్నా చెలిమి చల్లనా //వెన్నెల//


చిత్రం : జయసింహ
గానం : ఘంటసాల

Monday, December 24, 2007

కొనుమిదే కుసుమాంజలి

కొనుమిదే కుసుమాంజలి
అమరులా ప్రణయాంజలీ
రసికా నటలోక సార్వభౌమ నాదలోల విజయగోపాల

కాళీయ ఫణిరాజు పడగలపైనా
కాలియందియలు ఘల్లుమనా
లీలా నాట్యము చేసి చూపినా
తాండవ కృష్ణా జోహార్ జోహార్
నీ మధు మురళీ గానము విన్నా
భామలు మోహము మీరి దీనలై
రారా మదిని వగదీర మరులు నెరవేర
మనసు తనివార కౌగిలి వీర
నెరా దొరా మాపై నెనరు గొనర
మారుకేళి దేలుపు మను మగువల
మహానందమయ మలయోల్లాస గతులా
దివ్య రాస కేళి మహిమ జూపి మురియజేసి
నిదవధి సుఖమొసగిన ఘనశ్యామ
సత్యభామ పరంధామ
కొనుమిదే కుసుమాంజలీ
అమరులా ప్రణయాంజలీ

చిత్రం : శ్రీకృష్ణతులాభారం
గానం : పి.సుశీల
రచన : సముద్రాల
సంగీతం: పెండ్యాల

పాండవులు పాండవులు తుమ్మెదా

పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా

కన్నెగానె బతుకు గడిచిపోతుంది
నన్నెవరేలుకుంటారో అనుకున్నది
జానకి అనుకున్నది శ్రీరామచంద్రుడె చేసుకుంటాడని
విన్నదీ ఒళ్లంతా ఝల్లన్నదీ
నవ మన్మధుని వంటి నాధుని కనులారా
ఒక్కసారి చూడగ వుబలాటపడ్డది
తుమ్మెదా వుబలాటపడ్డది

పెళ్ళి పీటల మీద వెళ్ళి కూర్చున్నది
కళ్లలో.. కాని సిగ్గు కమ్మేసింది
ఓయమ్మా బుగ్గలకుపాకింది

నీ గుండెలోన నేనుండిపోవాలి
నీ అండనే నేను పండిపోవాలి
నా నోముపంట పండాలి
రాముడే రాముడు .. జానకే జానకని
ముందు వెనకందరూ .. మురిసిపోవాలని
జానకి మొక్కుతూ మొక్కుకుంది...

చిత్రం : అక్కా చెల్లెలు
గానం : పి.సుశీల
రచన : ఆత్రేయ
సంగీతం : కె.వి.మహాదేవన్

దీపాలు వెలిగె..

దీపాలు వెలిగె.. పరదాలు తొలిగె
ప్రియురాలు పిలిచె రావోయీ
ప్రియురాలు పిలిచె రావోయీ

నా వయసు నీది .. నీ వలపు నాది
మన మనసులు కలసిన వోయీ
నీ అడుగు జాడ .. నా పూల మేడ
మన మిరువుర మొకటే లేవోయీ

నా తోడు నీవు .. నీ నీడ నేను
మన యిరువురిదే యీ రేయీ
యిక జాగుసేయ తగదోయి నీకు
నా చల్లని రాజా రావోయీ

చిత్రం : పునర్జన్మ
గానం : పి.సుశీల
రచన: శ్రీశ్రీ
సంగీతం : టి.చలపతిరావు

ఎగిరే పావురమా

ఎగిరే పావురమా దిగులెరగని పావురమా దిగిరావా ఒక్కసారి
ప్రతి రాత్రికి పగలుందని ఎరుగుదువా

మోముపైని ఏ నీడలు ముసరరాదని చంద
మామపైని ఏ మబ్బులు మసలరాదని - ఎరుగుదువా పావురమా
మాకన్నా నీవు నయం మూసే చీకటుల
దారిచేసి పోవాలని ఎదుగుదువా
అటుపచ్చని తోటుందని అటు వెచ్చని గూడుందని

అటూ ఇటూ అడుగడుగున చుక్కదీపముంటుందని
ఎగురుదువా పావురమా
ఒక్క గడియగాని, నీ రెక్క ముడవగూడదనీ
దూరాన ధ్రువతారను చేరే తీరాలని ఎరుగుదువా..

చిత్రం : జగత్ కిలాడీలు
గానం : పి.సుశీల
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : ఎస్.పి.కోదండపాణి

ఏమండోయ్ శ్రీవారు

ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు? ఏదీ కాని వేళ

పసివాని చూచుట కీ తొందరా?
మైమరచి ముద్దాడి లాలింతురా?
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకేముంది మీ దగ్గరా

అబ్బాయి పోలిక ఈ తండ్రిదా?
అపురూపమైన ఆ తల్లిదా?
అయ్యగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ధి రానీకు భగవంతుడా..

ప్రియమైన మా యిల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన
కాపురం చేయండి కలకాలము

చిత్రం : మంచి మనసులు
గానం : పి.సుశీల
రచన : ఆరుద్ర
సంగీతం:కె.వి.మహాదేవన్

నీలమోహనా రారా...

నీలమోహనా రారా... నిన్ను పిలిచె నెమలి నెరజాణ
జారువలపు జడివాన కురిసెరా జాజిలత మేను తడసెరా
లతలాగే నా మనసు తడిసెరా //నీల//

ఏలాగే మతిమాలి ఏడే నీ వనమాలి
అతడేనేమో అనుకున్నానే
అంత దవుల శ్రావణ మేఘముల గనీ
ప్రతి మబ్బు ప్రభువైతే ప్రతి కొమ్మా మురళైతే ఏలాగే
ఆ...ఆ...ఆ..ఆ... సారెకు దాగెద వేమి?
నీ రూపము దాచి దాచి మురియుటకా స్వామీ?
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు
నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా

అటు..అటు...ఇటు.. ఇటు.. ఆ పొగడకొమ్మవైపు
ఈ మొగలి గుబురువైపు కార్తీక రాతిరిలో కఱి మబ్బయిందా
నీలిమేఘ మాకాశము విడిచి నేల నడుస్తుందా
నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా
నవ్వే పెదవులకు మువ్వల మురళుందా
పెదవి నందితే పేద వెదుళ్ళు కదలి పాడుతాయా?
నడిచే మబ్బులకు నవ్వే పెదవులు
నవ్వే పెదవులకు మువ్వల వేణువులు..


చిత్రం : డాక్టర్ ఆనంద్
గానం : పి.సుశీల
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : కె.వి.మహాదేవన్

బ్రహ్మలు గురుబ్రహ్మలు

బ్రహ్మలు గురుబ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు
శృతిలయ సంగమ సుఖ జతిలో స్వరపదయోగజ సమగతిలు
ముఖంత మాస మునివరులు భువిలో వెలసిన సురవరులు
భువిలో వెలసిన సురవరులూ బ్రహ్మ

వేదమూర్తులే నాగయోగ వరమొకటే కోరుకున్న అభిరుచులె
ఆ స్వరధను లెవరో తెలసి తలచి నాగు పాదికై రాగ భావ
తాలనలో గతి విడిచి పాడుకున్న అభినవగతినై వలచి మలచి తీసానులే కొత్తరాగమే ఆ...
వేసానులే ఆదితాళమే పదమునాకు మనుగడకాగా
లయలు జతులు ప్రియులు కాగా జగతి నెరికి సుగమ గతలునడిగె //బ్రహ్మలు//

త్యాగ బ్రహ్మము తాళ్ళపాక అన్నమయ్య జతియించే భక్తి భావన
సురలిల కృతులె తలచి తలచి నూతనత్వమె కోరుకున్న అభిరుచులె
గమనించి నవ్య రీతిలో గమగపులయతో కలిసిమెలసి
సాగెనులే బాటసారిగా ఆ.. సంగీతమే జీవనాడిగా
తెలుగునాట జగతికే పాట చిలిపి వలపు కలిపి పదము పాడ
మనసు నిలిపి మధుర జతల తేలే బ్రహ్మ //బ్రహ్మలు//

చిత్రం : ఎగిరే పావురమా
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

ఇదిగో రాయలసీమ గడ్డ

ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ
ఈ గడ్డలో పగల సెగలొద్దురా ఈ మట్టిలో నెత్తురు వదలొద్దురా
//ఇదిగో//

పతిత పావనుడు తిరుపతి వేంకటేశ్వరుడు
సర్వరక్షకుడు శ్రీశైల మల్లేశ్వరుడు కొలువున్నది ఈ సీమలోనే
రంకెలిడు లేపాక్షి బసవన్న శిల్పం రణబేరి వినవింపు
చంద్రగిరి దుర్గం నెలకొన్నదీ నేలలోనే
//ఇదిగో//

హరుని కంటికే కన్ను అర్పించిన కన్నప్ప భక్తవరుడు
విజయనగర సామ్రాజ్య దురంతర కృష్ణరాయ భువిభుడు
చరిత్రకెక్కిన ధరణి ఇది పదాలనే సర పదాల నడిపిన అన్నమయ్య కృతులు
ఇహపరాల కలిపిన వీరబ్రహ్మేంద్ర సర్పగతులు
అలలైపొంగిన అవని ఇది
//ఇదిగో//

తెల్లదొరల హడలెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..వందేమాతరం
మడమ తిప్పక స్వరాజ్య సంగ్రామం నడిపిన కడప కోటిరెడ్డి
గాడిచర్ల కల్లూరి సదాశివం అబ్బూరి హంపన్న లింగన్న, షేక్ బీర్ లబియాబి .. వందేమాతరం
ఒక్కరా ఇద్దరా పదుగురా నూర్గురా ఎందరెందరో
త్యాగమూర్తులకు జన్మనిచ్చిన జనని ఇది
//ఇదిగో//

అంతనిచ్చెనంత నిరంతర విగస్వర వైభవంతో విరాజిల్లిన
రాయలసీమ మన రైతన్నల సీమ
ఈనాడు పుష్కల ముష్కల శక్తుల దురంతరాలతో అతలా
కుతలమవుతుంటే చూస్తూ ఉంటారా చూస్తూనే ఉంటారా

అయితే యువత ఉగ్రమించాలి నవత విప్లవించాలి
రాగొంతులా గర్జించే నాదమే మహోధ్యమమై
కుళ్ళిన ఈ వ్యవస్థకే కొత్త నెత్తురెక్కించాలి సరికొత్త చరిత సృష్టించాలి

చిత్రం : సీతయ్య
గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
రచన : డా.సి.నారాయణరెడ్డి

Sunday, December 23, 2007

ముక్కుమీద కోపం

హూ ముక్కుమీద కోపం నీ ముకానికే అందం నా
బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం

అడపదడప ఇద్దరు అలిగేతేనే అందం
అలకతీరి కలిసేదే అందమైన బంధం

సిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం
ఆ బుగ్గమీద సిటికేసి దగ్గరొస్తె బంధం

ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం
ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళె బంధం

తల్లీగోదారికీ ఎల్లువొస్తె అందం
ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం

చిత్రం : మూగమనసులు
గానం : జమునారాణి
రచన : ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్

పగటి పూట చంద్రబింబం

పగటి పూట చంద్రబింబం అగుపించెను ఏదీ ఏదీ
అందమైన నీ మోమే అదిగా కింకేది కానరాని మన్మధుడేమో
కనుపించెను ఏడీ ఏడీ ఎదుటవున్న నీవేలే ఇంకా ఎవరోయీ

వన్నె వన్నె తారలెన్నో కన్నుగీటి రమ్మన్నాయీ ఏవీ ఏవీ
అవి నీ సిగలోనే ఉన్నాయి, పదును పదును బాణాలేవో
ఎదను నాటుకుంటున్నాయీ ఏవీ ఎవీ అవి నీ ఓరచూపులేనోయీ //పగటి//

ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు
ఏమో ఏమో ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో //పగటి//

చిత్రం : చిక్కడు దొరకడు
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : సి.నారాయణరెడ్డి
సంగీతం: టి.వి.రాజు

రఘుకుల తిలకా,

రఘుకుల తిలకా నీ ఆనతి రచియించితి రామాయణ సత్కృతి
ఆకృతి వరియించిన పతివి నీవే అతులిత కైవల్య గతివి నీవే!...

జగమే రామమయం ! మనసే
అగణిత తారక నామ మయం
నీల జలద రమణీయ రూపం నిగమాంచల మందిర మణిదీపం
సుందర జానకీ వందిత చరణం
సురముని శరణం! భవతాప హరణం

ఆ చిరునవ్వే అమృతపు జల్లు అఖిల జగములేలు ఆచేతి విల్లు
అతని గానమున అలరారుకావ్యం అన్ని యుగాలకు నవ్య్యాతి నవ్యం

ఎవని కమల కమనీయ పదము! చూ
పించె అహల్యకు ముక్తి పదము!
ఎవని చంద్రిక మృదుల కరము! అం
దించెను శబరికి దివ్యవరము
ఎవని ఏలుబడి ఇంటికొక్క గుడి నిలిపెనో
ఎవని రాజ్యమే రామరాజ్యమై వెలసెనో!
ఆ రాముడు నా అంతరంగమున నిండగా
అహము మరచి, ఈ యిహము మరచి
జన్మాంతర బంధములెల్ల విడిచి
ఆ మహర్జ్యోతిలో లీనము కానా
ఆ మహా ప్రభునిలో లీనము కానా
ఓ రామా! రఘురామా! కైవల్య రామా!

చిత్రం : కథానాయిక మొల్ల
గానం : పి.సుశీల
రచన : సి.నారాయణరెడ్డి
సంగీతం:ఎస్.పి.కోదండపాణి

కన్నయ్యా, నల్లని కన్నయ్యా

కన్నయ్యా, నల్లని కన్నయ్యా
నిన్ను కనలేని కనులుండునా
నిన్ను ప్రేమింతురే నిన్ను పూజింతురే
నన్ను గనినంత నిందింతురే

గుణమెంట లేనింట పడవైతువా
నన్ను వెలివేయువారికే బలిచేతువా
సిరిజూచుకుని నన్ను మరిచేవయా
మంచిగుడి చూచుకొని నీవు మురిసేవయా
బంగారు మనసునే ఒసగినావు
అందు అందాల గుణముచే పొదిగినావు
మోముపై నలుపునే పులిమినావు
ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు

చిత్రం : నాదీ ఆడజన్మే
గానం : పి.సుశీల
రచన : శ్రీశ్రీ
సంగీతం: ఘంటసాల

మనసే అందాల

మనసే అందాల బృందావనం, వేణు
మాధవుని పేరే మధురామృతం

కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపైన కడుపావనం //మనసే//

రాధను, ఒక వంక లాలించునే సత్య
భామను మురిపాల తేలించునే

మనసార నెరనము తనవారిని, కోటి
మరులందు సుధలందు తనియించునే....//మనసే//



చిత్రం: మంచి కుటుంబం
గానం : పి.సుశీల
రచన : ఆరుద్ర
సంగీతం:ఎస్.పి.కోదండపాణి

శ్రీ గౌరి ...

శ్రీ గౌరి శ్రీగౌరీవే! శివుని శిరమందు
ఏ గంగ చిందులు వేసినా //శ్రీ గౌరి //

సతిగా తన మేను చాలించి పార్వతిగా మరుజన్మ ధరియించి
పరమేశునికై తపియించి ఆ హరుమేన సగమై పరవశించిన //శ్రీ గౌరి //

నాగకన్యగా తాను జనియించినా జగదంబయైనది హైమవతి
సురలోకమున తాను ప్రభవించినా తరళాత్మమైనది మందాకిని
ఒదిగి ఒదిగి పతిపదములందు నివసించి యుండు గౌరి
ఎగిరి ఎగిరి పతిసిగను దూకి నటియించుచుండు గంగ
లలితరాగ కలితాంతరంగ గౌరి చలిత జీవన తరంగ రంగ గంగ
దవళాంశు కీర్తి గౌరి నవఫేనమూర్తి గంగ
కల్పాంతమైన భువనాంతమైన
క్షతియెరుగని మృతి యెరుగని నిజమిది శ్రీగౌరి శ్రీగౌరియే

చిత్రం : విచిత్ర దాంపత్యం
గానం : పి.సుశీల
రచన : సి.నారాయణరెడ్డి
సంగీతం: అశ్వద్ధామ

Saturday, December 15, 2007

సప్తపది పాటలు

దొరకునా ఇటువంటి సేవ

దొరకునా దొరకునా దొరకునా
దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ


రాగాలనంతాలు నీవేయి రూపాలు
భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు
రాగాలనంతాలు నీవేయి రూపాలు
భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు
నాదాత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
నాదత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
నిను కొల్చువేళ దేవాది దేవ దేవాది దేవ

దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

ఉచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు
ఉచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ
మహానుభావా మహానుభావా

దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

చిత్రం : శంకరాభరణం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కె.వి.మహదేవన్

రాగం తానం పల్లవి

రాగం తానం పల్లవి
రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి
రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి
రాగం తానం పల్లవి


నాద వర్తులై వేద మూర్తులై...
నాద వర్తులై వేద మూర్తులై
రాగ కీర్తులై త్రిమూర్తులై
రాగం తానం పల్లవి

క్రిష్ణా తరంగాల సారంగ రాగాలు
క్రిష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు
క్రిష్ణా తరంగాల సారంగ రాగాలు
క్రిష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు
సస్యకేదారాల స్వరస గాంధారాలు
సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు
క్షీర సాగర శయన దేవ గాంధారిలో
నీ పద కీర్తన సేయగ ప మా ప ద ని

రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి
రాగం తానం పల్లవి

శ్రుతిలయలే జననీ జనకులు కాగా
భావాల రాగాల తాళాల తేలి
శ్రీ చరణ మందార మధుపమ్మునై వాలి
నిర్మల నిర్వాణ మధుధారలే బ్రొలి
భరతాభి నయవేద ఆ ఆఆఆఆఆఅ
భరతాభి నయవేద వ్రత దీక్షబూని
కైలాస సదన కాంభొజి రాగాన
నీ పద నర్తన సేయగ ప దా ని

రాగం తానం పల్లవి......
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి
రాగం తానం పల్లవి

చిత్రం : శంకరాభరణం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కె.వి.మహదేవన్

ఓంకారా నాదాను..

ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము
ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము శంకరాభరణము
శంకర గళ నిగలము శ్రీహరి పద కమలము
శంకర గళ నిగలము శ్రీహరి పద కమలము
రాగ రత్న మాలికా తరలము శంకరాభరణము


శారద వీణా..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము
శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము
నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము
నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము
రసికుల కనురాగమై రస గంగలో తానమై
రసికుల కనురాగమై రస గంగలో తానమై
పల్లవించు సామ వేద మంత్రము శంకరాభరణము
శంకరా భరణము


ఆద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సొపానము
ఆద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సొపానము
శత్వ సాధనకు సత్య శొధనకు సంగీతమే ప్రాణము
శత్వ సాధనకు సత్య శొధనకు సంగీతమే ప్రాణము
త్యాగ రాజ హృదయమై రాగ రాజ నిలయమై
త్యాగ రాజ హృదయమై రాగ రాజ నిలయమై
ముక్తి నొసగు భక్తి యోగ మార్గము
మృతియలేని సుధాలాప స్వర్గము శంకరాభరణము

ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము

ప ద ని శంకరాభరణము
పమగరి గమపదని శంకరాభరణము
సరిసా నిదప నిసరి దపమ గరిగ పమగ పమద పనిద సనిగరి
శంకరాభరణము

దప దమ మాపాదప
మపదప దప దమ మదపమగ మాదపమగ

గమమదదనినిరి మదదనినిరిరిగ
నిరిరిగగమమద సరిరిససనినిదదప శంకరాభరణము

రీససాస రిరిసాస రీసాస సరిసరీస రిసరీసరీసనిద
నీ నీ నీ
దాదనీని దదనీని దానీని దనిద దనిద దని దగరిసానిదప
దా దా ద గరిగా మమగా
గరిగా మమగా
గరి గమపగా మపద మదపమ గరిసరి సరిగసరీ
గరి మగపమదప
మగపమదప నిదపమదప నిదసనిదప నిదసనిరిస
గరీసా గరిసనిదరీసా రిసనిదపసా గరిసనిద నిసనిదప
సనిదపమ నీసాని
నిసనిదపనీదా సనిదపమప రిసనిదప
సరిదపమ గమమగరి గమదా
నిసనిపద మప నిసనిదప నీ దపమగరి రిసనిదప
నగరిసరిసని శంకరాభరణము

చిత్రం : శంకరాభరణము
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం :కె.వి.మహదేవన్

ముద్దబంతి నవ్వులో

ముద్దబంతినవ్వులో మూగబాసలు
ముద్దబంతినవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతినవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిల
చదువుకునే మనసుంటే ఓ కోయిల
మధుమాసమే అవుతుంది అన్నివేళలా
ముద్దబంతినవ్వులో మూగబాసలు
లాలలలాలల లాలలలాలల లాలల



బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ
బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవత
ఇంతచోటులోనె అంత మనసు వుంచి
ఇంతచోటులోనె అంత మనసు వుంచి
నా సొంతమే అయ్యింది ప్రియురాలుగా

ముద్దబంతినవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతినవ్వులో మూగబాసలు



అందమైన తొలిరేయి స్వాగతానికి
మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును
గుడిలోకి రమ్మంది ఈ దైవము
మాట నోచుకోని ఒక పేదరాలిని
మాట నోచుకోని ఒక పేదరాలిని
నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా


ముద్దబంతినవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిల
మధుమాసమే అవుతుంది అన్నివేళలా
ముద్దబంతినవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతినవ్వులో మూగబాసలు


చిత్రం :అల్లుడుగారు
గానం :యేసుదాస్ , చిత్ర
సంగీతం :కె.వి.మహదేవన్

కొండలలో నెలకొన్న

కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు


కుమ్మరదాసుడైన కురువరత్తనంబి
ఇమ్మన్న వరములన్ని ఇచ్చినవాడు
దొమ్ములు చేసినయెట్టి తొండమాన్ చక్కురవర్తి
దొమ్ములు చేసినయెట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు


కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు



ఎదలోని శ్రీసతి ఎపుడో ఎడబాటు కాగ
ఎనలేని వేదనలో రగిలినవాడు
మనసిచ్చి పరిణయమాడిన సతి పద్మావతి
మమతలకోవెలలో మసలినివాడు
నీతికి నిలిచినవాడు దోషిగ మారెను నేడు
ప్రేమకి ప్రాణంవాడు శిక్షకు పాత్రుడుకాడు
ఆర్తరక్షక శ్రీవెంకటేశ్వర కరుణతో
తోడునీడై వాణ్ణి కాపాడు నేడు

కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు

చిత్రం : అల్లుడుగారు
గానం : యేసుదాసు, చిత్ర
సంగీతం: కె.వి.మహదేవన్

ఇది మల్లెల వేళయని ...

ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది


కసిరే ఏండలు కాల్చునని
ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఏండలు కాల్చునని
మరి ముసిరే వానలు ముంచునని
ఎరుగని కొయిల ఎగిరింది
ఎరుగని కొయిల ఎగిరింది చిరిగిన రెక్కల వొరిగింది
నేలకు వొరిగింది
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది


మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం
మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం
వసి వాడని కుసుమ విలాసం
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది


ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం
ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో
మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం

ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

చిత్రం : సుఖఃదుఖాలు
గానం : పి.సుశీల
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: ఎస్.పి.కోదండపాణి

ఇలాగే ఇలాగే సరాగమాడితే...

ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే

వయసులో వేడుంది మనసులో మమతుంది
వయసులో వేడుంది మనసులో మమతుంది
మమతలేమో సుధామయం మాటలేమో మనోహరం
మదిలో మెదిలే మైకమేమో
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే

భావమే నేనైతే పల్లవే నీవైతే
భావమే నేనైతే పల్లవే నీవైతే
ఎదలోన ఒకే స్వరం కలలేమో నిజం నిజం
పగలు రేయి చేసే హాయి
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే ఊయలూగునే

చిత్రం : వయసు పిలిచింది
గానం :ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
రచన : ఆరుద్ర
సంగీతం:ఇళయరాజా

ప్రణతి ప్రణతి ప్రణతి..

సా రి గ మ ప మ గ మ స రి ని రి స
ప మ గ మ స రి
సా రి గ మ ప ని స ని ప మ గ మ స రి ని రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి
ప మ ప మ గ మ స రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి
పమప మమప మ ప నీ
ప్రణుతి ప్రణుతి ప్రనుతి ప్రధమ కళా సృస్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి ఈ ఈ ఈ


పూల ఎదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పూల ఎదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పైరు పాపలకు జోలలు పాడె గాలుల సవ్వడి హ్రీంకారమ హ్రీంకారమ
గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడి శ్రీంకారమా శ్రీంకారమా
ఆ బీజాక్షర విగతికి అర్పించే ద్యోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి ఈ ఈ ఈ ఈ ఈ


పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందనా అది కవనమా
మ గ మ పా ప మ పా పా ప ప ప
నిపపప నిపపప నిపాపపమ
మ ప మ ప మ గా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా ఆ ఆ
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా
అది శిల్పమా అది శిల్పమా
ఆ లలిత కళా సృశ్టికి అర్పించే ద్యోతలివే

ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రనుతి ప్రధమ కళా సృస్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి ఈ ఈ ఈ

చిత్రం : స్వాతికిరణం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. చిత్ర

యాడగాల వడ్డావురో

యాడగాల వడ్డావురో నా మొగుడా!
యాడగాల వడ్డావురో నా మొగుడా!
కూడులేక పిల్లలేమొ కుమిలి చస్తుండ్రూ
పాడు ముండకొడుకు నీకు బుద్ధి రాదు ఏమిసేతు//యాడ//

కల్లుదాగ నేబోతిని నా పెళ్ళామొ!
కల్లెంత కమ్మగున్నదే నా పెళ్ళామొ
కల్లుకేమొ కైపెక్కి ఒల్లుకేమొ తిమ్మిరెక్కె
కల్లుదాగి వస్తుంటె కాలుజారి పడ్డానె

కల్లుమీద మన్నువడ్డారో నీ పీనుగెల్లా!
కల్లెట్టా మరుస్తవురో నీ పీనుగెల్లా!
తల్లి పిల్లలోము మేము తల్లడిల్లి చస్తుంటే
తాళిబొట్టు అమ్ముకొని తందనలాడెదావు

కల్లెంత కమ్మగున్నదే నీ కాల్లుమొత్త!
లొల్లయితే జెయ్యాబోకే నీ కాల్లుమొత్త
ఇల్లు పిల్లలిడిచిపెట్టి ఈదులల్ల జీతముండి
కల్లుదాగుకుంట నేను కడుపు నింపుకుంటగాని

సావనన్న సావవేమీరో నీదుంపదెగ!
సంసార మెట్లుజేతురో నీ దుంపదెగ
దేవుడా నేనేమి సేతు దిక్కెవరింక నాకు
దివాల్‌కోరు మొకపోడ దిగజారి పోయినోడ

సావు గీవు అన్నావంటే నాయాలి నిన్ను
సావ సావ జంపేదానే నాయాలి నిన్ను
కావరంబుబట్టి నీవు కానిపోని మాటలంటె
సావదన్నె దాను నాదు సంగతింక తెలియదేమొ

రచన : ఆర్. వీరాచారి

గజ్జెలెడ్లబండి

గజ్జెలెడ్ల బండిమీద! గంగవరం బోతున్నా
రావే రంగమ్మో జాతరన్న బోదాము..//రావే//

కంచిపట్టు చీరలేదు ! అంచులున్న రవికెలేదు
మంచి మల్లెపూలమీద మనసేమొ గుంజవట్టె
రానుపోర జాతరా గంగవరం నీవెంట..//రాను//

మంచి చీరెలిపిస్తా! మల్లెపూలు దెప్పిస్తా
అంచులున్న రైకమీద అద్దాలేపిస్త పిల్లా//రావే//

చేతులొక పైసలేదు! చేతికి గాజూలు లేవు
చెప్పుకోవాలంటే సిగ్గేలో రావాయే..//రాను//

చేతిగాజులిప్పిస్తా! చేతి ఖర్చు పైసలిస్తా
చెకుముఖిరవ్వ సిగ్గెందుకెపిల్లా..//రావే//

కడియాలు లేకపాయె కంకణాలు లేకపాయె
అడిగేటందుకేమో చాల బిడియపడి సస్తున్నా..//రాను//

కడియాలు ఇప్పిస్తా! కంకణాలు దెప్పిస్తా
అడుగులెయ్యి ముద్దులొలక అందాల రామచిలుక..//రావే//

బోడిమెడ బెట్టుకొని! యాడకొత్తు నీయెంటా
అడ్డిగొకటి అడగాలటని హడలిపోయి సస్తున్నా..//రాను//

మెడకు మంచి హారమేస్త! మేలైన సొమ్ములిస్త
తడవు సేయకుండదావె తరణివెల్లిపోదాము...//రావే//

గజ్జెలెడ్ల బండిమీద! గంగవరం నేనొస్తా
ఆపుర అంజయ్యో బండి మీద నేనొస్తా//ఆపుర//

రావే రంగమ్మో జాతరన్న పోదాము
ఆపుర అంజయ్యో బండిమీద నేనొస్తా //ఆపుర//

రచన : ఆర్.వీరాచారి

Thursday, November 29, 2007

అహా నా పెళ్ళంట!!!

ఆహ నా పెళ్ళియంటా
ఓహొ నా పెళ్ళియంటా
ఆహ నా పెళ్ళంట, ఓహొ నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట
టాం టాం టాం

వీరాధి వీరులంట ధరణీ కుబేరులంటా
భోరు భోరు మంటు మా పెళ్ళివారు వచ్చిరంట
వీరాధి వీరులంట ధరణి కుబేరులంట
భోరు భోరు మంటు మా పెళ్ళివారు వచ్చిరంట
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో
హహ్హహ్హహ్హ

ఆహ నా పెళ్ళియంటా
ఓహొ నా పెళ్ళియంటా
ఆహ నా పెళ్ళంట, ఓహొ నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట
టాం టాం టాం

బాలా కుమారులంట చాలా సుకుమారులంట
బాలా కుమారులంట చాలా సుకుమారులంట
పెళ్ళికొడుకు నన్ను చూసి మురిసి మూర్ఛ పోవునంట
అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో
హహ్హహ్హహ్హ

ఆహ నా పెళ్ళియంటా
ఓహొ నా పెళ్ళియంటా
ఆహ నా పెళ్ళంట, ఓహొ! నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట
టాం టాం టాం


తాళిగట్ట వచ్చునంట
తాళిగట్ట వచ్చునంట తగని సిగ్గునాకంట
సా ద ని స మ మ మా ప ద ప మ గ
తాళిగట్ట వచ్చునంట..
పపప ద మమమ ప దదద మరిగమప
తాళిగట్ట వచ్చునంట..
తథొం థొం థొం థొం! తక ధీం ధీం ధీం
థక థొం థక ధీం థ
అటు తంతాం ఇటు తంతాం
తంతాంతంతాం తాం
స ని ద ప మ గ రి స

తాళిగట్ట వచ్చునంటా
తాళిగట్ట వచ్చునంటా తగని సిగ్గునాకంట
మేలిముసుగు చాటుతీసి దాగుడు మూతలాడునంట

అహహహహహ, అహహహహహ, ఆహహహహహహహహ

చిత్రం : మాయాబజార్
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : పింగళి
సంగీతం :ఘంటసాల

అందలం ఎక్కాడమ్మా !!

అందలం ఎక్కాడమ్మా
అందకుండపోయాడమ్మా
ఇంతవాడు ఇంతకు ఇంతై
ఎంతో ఎదిగిపోయాడమ్మా

నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ
నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఒడిలోన ఒదిగినాడమ్మా..ఆ..ఆ..
నా ఎదనిండా నిండినాడమ్మా ..ఆ..ఆ..

అందలం ఎక్కాడమ్మా
అందకుండపోయాడమ్మా
ఇంతవాడు ఇంతకు ఇంతై
ఎంతో ఎదిగిపోయాడమ్మా

ఆమాటలకు నేను మైమరిచిపోయాను
ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగాను
భళ్లునా తెల్లారిపోయెనమ్మాఓ . .
ఒళ్ళు ఝల్లున చల్లారిపోయెనమ్మా
" అందాన్ని చూశానమ్మా
అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతైనా
నే నీలో ఇమిడిపోతానమ్మా "

అందలం ఎక్కాడమ్మా
అందకుండపోయాడమ్మా
ఇంతవాడు ఇంతకు ఇంతై
ఎంతో ఎదిగిపోయాడమ్మా

చిత్రం : దాగుడుమూతలు
గానం : పి.సుశీల
రచన : దాశరథి
సంగీతం:కె.వి.మహదేవన్

ఏవండోయ్ శ్రీవారు..

ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్... హొయ్

పసివాని చూచుటకీ తొందర
మైమరిచి ముద్దాడి లాలింతుర
లులులుల ఆయి లులులుల ఆయి
ఉహు ఉహు ఉహు ఉహు
పసివాని చూచుటకీ తొందర
మైమరిచి ముద్దాడి లాలింతుర
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకు ఏముంది మీదగ్గర

ఏవండోయ్...
ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్ హొయ్

అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా
ఒహొహొ ఓ
అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా
అయగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ది రానీకు భగవంతుడా...

ఏవండోయ్....
ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్ హొయ్

ప్రియమైన మా ఇల్లు విడనాడి పోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
అయ్యో పాపం
ప్రియమైన మా ఇల్లు విడనాడి పోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన
కపటాలు మానేసి నా మదిలోన
కాపురము చేయండి కలకాలము

ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్ హొయ్ హొయ్ హొయ్

చిత్రం : మంచిమనసులు
గానం : పి.సుశీల
సంగీతం:కె.వి.మహదేవన్
రచన : ఆరుద్ర

నిన్ను చూడనీ...

నిన్ను చూడనీ నన్ను పాడనీ
ఇలావుండిపోనీ నీ చెంతనే...
నిన్ను చూడనీ

ఈ కనులు నీకే ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఈ కనులు నీకే ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఇలావుండిపోనీ నీ దాసినై...

నిన్ను చూడనీ నన్ను పాడనీ
నిన్ను చూడనీ

నీవులేని నేను ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
నీవులేని నేను ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
ఇలారాలిపోనీ నీ కోసమే....

నిన్ను చూడనీ నన్ను పాడనీ
ఇలావుండిపోనీ నీ చెంతనే...
నిన్ను చూడనీ

చిత్రం : మనుషులు మమతలు
గానం : పి.సుశీల
రచన : దాశరథి
సంగీతం: టి.చలపతిరావ్

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ
ఇదేనా ఆ మురళీ
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ
ఇదేనా ఆ మురళీ
కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి
ఇదేనా..ఇదేనా ఆ మురళీ

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ మరులే కురిపించి
జీవన రాగమై బృందావన గీతమై
ఆ.. జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా.. ఇదేనా ఆ మురళీ

వేణుగానలోలుని మురిపించిన రవళి..
నటనల సరళి ఆ నందనమురళీ
ఇదేనా ఆ మురలి మువ్వల మురళీ
ఇదేనా ఆ మురళీ

మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
ఆ..ఆ..ఆసంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా..ఇదేనా ఆ మురళీ

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మొహనమురళీ
ఇదేనా ఆ మురళి..

చిత్రం : సప్తపది
గానం : పి.సుశీల
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్

ఆనతినీయరా హరా!

ఆనతినీయరా! హరా!సన్నుతి సేయగా,
సమ్మతి నీయరా, దొరా! సన్నిధి జేరగా,
ఆనతినీయరా, హరా!సన్నుతి సేయగా,
సమ్మతి నీయరా, దొరా! సన్నిధి జేరగా,
ఆనతినీయరా! హరా!

నీ ఆన లేనిదే, రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వ నాటకం?
నీ సైగ కానిదే, జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం?
వసుమతిలో ప్రతీ క్షణం పసుపతి నీ అధీనమై,
వసుమతిలో ప్రతీ క్షణం పసుపతి నీ అధీనమై,
కదులునుగా సదా సదాశివ!
ఆనతినీయరా! హరా!

ని ని స ని ప నీ ప మ గ స గ

ఆనతి నీయరా!
అచలనాధ అర్చింతునురా!
ఆనతినీయరా!

పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస సగసని


ఆనతినీయరా!
జంగమ దేవర సేవలు గొనరా!!
మంగళ దాయక దీవెనలిడర!
సాష్ఠాంగముగ దండము సేతురా!
ఆనతినీయరా!

సానిప గమపానిపమ

గమగ పాప పప
మపని పాప పప
గగమ గాస సస
నిసగ సాస సస
సగ గస గప పమ పస నిస
గసని సాగ సాగ
సని సాగ సాగ
సగ గాస సాస
సని సాగ గ
గసగ గా
పద గస గా స ని పమగమ గా


ఆనతినీయరా!
శంకరా! శంకించకురా!
వంక జాబిలిని జడను ముడుచుకొని,
విసపు నాగులను చంకనెత్తుకొని,
నిలకడనెరుగని గంగనేలి, ఏ వంకలేని నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరుణిక సేవించుకొందురా!
ఆనతినీయరా!

పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గ
గమపని గా మపనిస మా పనిసగ
నీ స పా ని మా ప గా మ సా గామ
పప పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా
పనిసగ నీ స పా ని మా ప గా మ సా గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గ
గామాపని గమాపాని స మపానీసగని
సపని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా గా
గగ మమ పప నిగ తక తకిట తకధిమ
మమ పప నినిసమ తక తకిట తకధిమి
పపనినిసస గని తక తకిట తకధిమి
సపని మప గమ సగమ
పప పమప నినిపమగస గ గా


రక్షా! ధర శిక్షా దీక్షా దక్ష!
విరూపాక్ష! నీ క్రుపా-వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక,
పరీక్ష సేయక, రక్ష రక్ష యను ప్రార్ధన వినరా!
ఆనతినీయరా! హరా!సన్నుతి సేయగా,
సమ్మతి నీయరా, దొరా! సన్నిధి జేరగా,
ఆనతినీయరా, హరా!

చిత్రం : స్వాతికిరణం
గానం : వాణిజయరాం

ప్రతిదినం నీ దర్శనం

ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదూ

ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదూ

ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా !!

నిదురే రాదూ..రాత్రంతా కలలు నేసె నాకూ
వినగలనంటే తమషాగ ఒకటి చెప్పనా ?
చెప్పు !

ఇంద్రధనసు కిందా కూర్చుని మాట్లాడదాం
అలాగే చందమామతోటి కులాసా ఊసులాడదాం

వింటూంటే వింతగా ఉంది కొత్తగా ఉంది ఏమిటీ కధనం

పొరపాటు..కధకాదు..
గతజన్మలోన జాజిపూల సువాసనేమో !

ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా

పూవుల నదిలో..అందం గా నడుచుకుంటు పోనా
ఊహల రచనే.. తీయంగా చేసి తిరిగి రానా
వెన్నెల పొడిని నీ చెంపలకి రాసి చూడనా
సంపంగి పూల పరిమళం వయసుకీ అద్ది ఆడనా

అదేంటో మైకమే నను వదలినా పొద జరగదూ నిజమో

జడివానా..కురవాలీ..
ఎదలోయలోకి జారి పోయి దారి చూడూ

ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు

ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా

చిత్రం : అనుమానాస్పదం
గానం : ఉన్నికష్ణన్, శ్రేయ ఘోషాల్
రచన : వంశీ

తకిట తదిమి తకిట తదిమి తందాన

తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగుల తప్పని తాళాల
తడిసిన పెదవుల రేగిన రాగాల
శృతిని లయని ఒకటి చేసి

తకిట తదిమి

నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తేలియని ఆశల వయసే వరసా
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసి తేలియని ఆశల లలలలలలా
ఏటిలోని అలలవంటి కంటి లోని కలలు కదిపి గుండియలను అందియలుగ చేసీ

తకిట తదిమి

పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులు గా వెలిసే సుస్వరాల గోపురం
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులు గా వెలిసే సుస్వరాల గోపురం
అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్ మంగా
అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్ మంగా
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెలుగు పాట పల్లవించు పద కవితలు పాడి

తకి్ట తదిమి

చిత్రం : సాగరసంగమం
గానం : ఎస్.పి.బలసుబ్రహ్మణ్యం
సంగీతం : ఇళయరాజా

నాదవినోదం నాట్యవిలాసం

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
భావములో ఆ.. భంగిమలో ఆ.. గానములో ఆ.. గమకములో ఆ...
భావములో భంగిమలో గానములో గమకములోఆంగికమౌ తపమీ గతి సేయ
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
ఆ..ఆ..ఆ......... !!

కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం .. ద ని స రి స ని స
జతియుత గమనం .. ద ని స రి స ని స
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చలనం సురనది పయనం
భరతమైన నాట్యం .. ఆ....
బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
భరతమైన నాట్యం .. ఆ....
బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
తపనుని కిరణం తామస హరణం
తపనుని కిరణం తామస హరణం
శివుని నయన త్రయలాశ్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన లాస్యం
నమక చమక సహజం ..ఝం
నటప్రకృతీ పాదజం .. ఝం
నర్తనమే శివకవచం .. చం
నటరాజ పాద సుమరజం .. ఝం
ధిరనన ధిరనన ధిరనన ధిరననధిర ధిర ధిర ధిర ధిర ధిర..
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ ఆ..ఆ..ఆ !!

చిత్రం : సాగరసంగమం
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.పి.శైలజ
సంగీతం: ఇళయరాజా


Wednesday, November 14, 2007

ఏడ తానున్నాడో బావ

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్ని తిరిగి చూసేవు
ఏడ తానున్నాడో బావ
ఏడ తానున్నాడో బావ
జాడ తెలిసిన పోయిరావా
అందాల ఓ మేఘమాల
అందాల ఓ మేఘమాల

గగనసీమల ఓ మేఘమాల
మా ఊరు గుడి పైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పి పోవా
నీలాల ఓ మేఘమాల ఆ రాగాల ఓ మేఘమాల

మమత తెలిసిన మేఘమాల
మమత తెలిసిన మేఘమాల
నా మనసు బావకు చెప్పి రావా
ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో రేపవలు
ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో రేపవలు
ఎదురుతెన్నులు చూచెనే బావకై
చెదిరి కాయలు కాచెనే
ఏ అందాల ఓ మేఘమాల ఆ
అందాల ఓ మేఘమాల

మనసు తెలిసిన మేఘమాల
మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువలేనని చెప్పలేవా
కళ్లు తెరచినగాని కళ్లు మూసినగాని
కళ్లు తెరచినగాని కళ్లు మూసినగాని
మల్లి రూపే నిలిచెనే
నా చెంత మల్లి మాటే పిలిచెనే

జాలి గుండెల మేఘమాల
బావ లేనిది బ్రతుకజాల
జాలి గుండెల మేఘమాల
కురియు నా కన్నీరు గుండెలో దాచుకొని
వానజల్లుగ కురిసిపోవా కన్నీరు
ఆనవాలుగా బావమోల

చిత్రం : మల్లీశ్వరి
గానం : ఘంటసాల, భానుమతి

పిలిచినా బిగువటరా...

పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా ఆ

ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా

గాలుల తేనెల వాడని మమతల
గాలుల తేనెల వాడని మమతల
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందెల రవళుల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
అందగాడా ఇటు తొందర చేయగా

పిలిచినా బిగువటరా ఔరౌరా
పిలిచినా బిగువటరా

చిత్రం : మల్లీశ్వరి
గానం : భానుమతి రామకృష్ణ

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయనచకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి ఈ ఈ ఈ ఈ ఈ
అనార్కలి అనార్కలి అనార్కలి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాజశేఖరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా

మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా
మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా
మధురమైన బాధరా
మరపురాదు ఆ ఆ ఆ ఆ

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా

కానిదాన కాదురా కనులనైన కానరా
కానిదాన కాదురా కనులనైన కానరా
జాగుసేయనేలరా వేగ రావదేలరా
జాగుసేయనేలరా వేగ రావదేలరా
వేగ రార వేగ రార వేగ రార


చిత్రం: అనార్కలి
గానం : ఘంటసాల, జిక్కి

కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలొనే కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే మనసే పూలమంటపమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

నాలో ఏమొ నవభావనగా మెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమొ నవభావనగా మెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే
కలవరమాయే మదిలో నా మదిలో

నాలో ఏమొ నవరసరాగం పిల్లనగ్రోవి ఊదింది
నాలో ఏమొ నవరసరాగం పిల్లనగ్రోవి ఊదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానం చేసే
కలవరమాయే మదిలో నా మదిలో

కన్నులలొనే కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో

చిత్రం :పాతాళభైరవి
గానం :ఘంటసాల,పి.లీల

జననీ శివకామిని

అమ్మా ఆ ఆ ఆ
అమ్మా ఆ ఆ ఆ
జనని శివకామిని జయశుభకారిణి విజయరూపిణి
జనని శివకామిని జయశుభకారిణి విజయరూపిణి
జనని శివకామిని

అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్న అమ్మవు నీవే
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్న అమ్మవు నీవే
నీ చరణములే నమ్మితినమ్మా
నీ చరణములే నమ్మితినమ్మా
శరణము కోరితి నమ్మా భవాని

జనని శివకామిని జయశుభకారిణి విజయరూపిణి
జనని శివకామిని

నీదరినున్న తొలగు భయాలు
నీదయలున్న కలుగు జయాలు
నీదరినున్న తొలగు భయాలు
నీదయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచి
నిరతము మాకు నీడగ నిలచి
జయము నీయవే అమ్మా
జయము నీయవే అమ్మా భవాని

జనని శివకామిని జయశుభకారిణి విజయరూపిణి
జనని శివకామిని

చిత్రం :నర్తనశాల
గానం :పి.సుశీల

కాశీకి పోయాను రామాహరి..

కాశీకి పోయాను రామా హరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి
గంగ తీర్థాము తెచ్చాను రామా హరి
కాశికి పోలేదు రామా హరీ
ఊరి కాల్వలో నీళ్ళండి రామ హరి
మురుగు కాల్వలో నీళ్ళండి రామా హరి


శ్రీశైలమెళ్ళాను రామా హరి
శివుని విభూది తెచ్చాను రామా హరి
శివుని విభూది తెచ్చాను రామా హరి
శ్రీశైలం పోలేదు రామా హరి
శివుని విభూది తేలేదు రామా హరి
ఇది కాష్టంలో బూడిద రామ హరి

అన్నమక్కరలేదు రామా హరి
నేను గాలి భోంచేస్తాను రామా హరి
ఉత్త గాలి భోంచేస్తాను రామా హరి
గాలితో పాటుగా రామ హరి
వీరు గారెలే తింటారు రామా హరి
నేతి గారెలే తింటారు రామా హరి

కైలాసమెళ్ళాను రామా హరి
శివుని కళ్ళార చూసాను రామా హరి
రెండు కళ్ళార చూసాను రామా హరి
కైలాసమెళితేను రామా హరి
నంది తన్ని పంపించాడు రామా హరి
బాగ తన్ని పంపించాదు రామా హరి

ఆలుబిడ్డలు లేరు రామా హరి
నేను ఆత్మయోగినండి రామా హరి
గొప్ప ఆత్మయోగినండి రామా హరి
ఆ మాట నిజమండి రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి

చిత్రం :అప్పు చేసి పప్పు కూడు
గానం :ఘంటసాల, స్వర్ణలత

పాడుతా తీయగా చల్లగా

పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా

కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకూ

పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా

గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మా సాన్నాళ్ళు
గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు
ఉండమన్న ఉండవమ్మా సాన్నాళ్ళు
పోయినోళ్ళూ అందరూ మంచోళ్ళూ
పోయినోళ్ళూ అందరూ మంచోళ్ళూ
ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు

పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా

మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసుతోటి మనసెపుడో కలసిపోతది
మనిషిపోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసుతోటి మనసెపుడో కలసిపోతది
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది
చావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది
జనమ జనమకది మరీ గట్టిపడతది

పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా
పాడుతా తీయగా చల్లగా

చిత్రం : మూగమనసులు
గానం : ఘంటసాల

Friday, October 26, 2007

ఆదిబిక్షువు వాడినేది కోరేది

ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాలను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిచేరు మన్మథుని మసి జేసినాడు వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి, ముక్కోపి
ముక్కంటి, ముక్కోపి తిక్కశంకరుడు

ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

చిత్రం : సిరివెన్నెల
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం :కె.వి.మహదేవన్
గానం :ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

చందమామ రావే

ఉం ఉం ఉం
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

చలువ చందనములుపూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
చలువ చందనములుపూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

మునిజన మానసమోహిని యోగిని బృందావనం
మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం
మునిజన మానసమోహిని యోగిని బృందావనం
మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం
రాధామాధవ గాథల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం బృందావనం బృందావనం
హే కృష్ణా ముకుందా మురారీ
హే కృష్ణా ముకుందామురారీ కృష్ణా ముకుందా మురారీ
కృష్ణా ముకుందా మురారీ
జయ కృష్ణా ముకుందా మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

చిత్రం : సిరివెన్నెల
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : వాణి జయరాం,


విధాత తలపున ప్రభవించినది

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం...
కనుల కొలనులొ ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం...
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించిపంచి గానం....ఆ ఆ..

సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది...
సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది...
నే పాడిన జీవన గీతం...ఈ గీతం..

విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం....

ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూగ తంత్రులపైన..
జాగృత విహంగ తతులే వినీల గగనపు వెదిక పైన
ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూగ తంత్రులపైన..
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ..
విశ్వకార్యమునకిది భాష్యముగా....

విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం....

జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
జనించు ప్రతిశిశు గల్ళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము నే...

విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం....

నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది...
నేపాడిన జీవన గీతం...ఈ గీతం..

చిత్రం : సిరివెన్నెల
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,


సీతారాముల కళ్యాణము చూతము రారండి

సీతారాముల కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సిరికళ్యాణపు బొట్టును పెట్టి
బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి
నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ
పారాణిని పాదాలకు పెట్టి
పెళ్ళికూతురై వెలసిన సీతా
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

సంపగి నూనెను కురులను దువ్వి
కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము తీర్చి
నామము తీర్చి
చెంపగవాకి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ
చెంపగవాకి చుక్కను పెట్టి
పెళ్ళికొడుకై వెలిసిన రాముని
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి


జానకి దోసిట కెంపుల ప్రోవై
కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై
నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరిసిన సీతారాముల
కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

చిత్రం : సీతారాముల కళ్యాణం
రచన : సముద్రాల సీనియర్
గానం : పి.సుశీల బృందం

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొల్లు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొల్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరుగని వేగం తొ వెళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొల్లు

లయకే నిలయమై నీపాదం సాగాలి
మళయానిల గతిలో సుమ బాలగ తూగాలి
వలలొ ఒదుగునా విహరించె చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించె గురువెడి
తిరిగె కాలానికీ
ఆఅ ఆఆ ఆ
తిరిగే కాలానికీ తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటె
విరుచుకుపడు సురగంగకు విలువేముంది
విలువేముందీ

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొల్లు

దూకె అలలకూ ఏ తాళం వెస్తారు
ఆహహ
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
ఉం ఉం
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు
ఆఅ ఆఅ..
వద్దని ఆపలేరు ఉరికె ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల విలువేముంది
విలువేముందీ

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొల్లు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొల్లు

చిత్రం : స్వర్ణకమలం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

అందెల రవమిది పదములదా

గురు బ్రహ్మ ఆ ఆ
గురు విష్ణు ఆ ఆ
గురు దేవో మహేశ్వరహ ఆ ఆ
గురు సాక్షాత్ పరబ్రహ్మ ఆ ఆ
గురు సాక్షాత్ పరబ్రహ్మ ఆ ఆ
తస్మై శ్రీ గురవే నమ:

ఓం నమో నమో నమ:శివాయ
మంగళ ప్రదాయ గోతురంగతే నమ:శివాయ
గంగ యాత రంగితోత్త మాంగతే నమ:శివాయ
ఓం నమో నమో నమ:శివాయ
శూలినే నమో నమ: కపాలినే నమ:శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమ:శివాయ

అందెల రవమిది పదములదా ఆ

అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిదా
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా ఆ ఆ

అందెల రవమిది పదములదా

మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై మేని విసురు వాయువేగమై
అంగ భంగిమలు గంగ పొంగులై
హావ భావములు నింగి రంగులై లాస్యం సాగె లీల రసఝరులు జాలువారేల
జంగమమై జడ పాడగ
జలపాత గీతముల తోడుగ
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ

అందెల రవమిది పదములదా

నయన తేజమె నకారమై
మనో నిశ్చయం మకారమై
శ్వాస చలనమే శికారమై
వాంచితార్ధమే వకారమై
యోచన సకలము యకారమై
నాదం నకారం మంత్రం మకారం
స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం
ఓం నమ:శివాయ
భావమే మౌనపు భావ్యము కాదా
భరతమే నిరతము భాగ్యము కాదా
పూరిల గిరులు కరిగేల తాండవ మాడే వేళ
ప్రాణ పంచమమే పంచాక్షరిగ పరమ పదము ప్రకటించగా
ఖగోలాలు పదకింకునులై పది దిక్కుల ధూర్జతి ఆర్భటి రేగా

అందెల రవమిది పదములదా అంబరమంటిన హౄదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిదా
అందెల రవమిది పదములదా

చిత్రం : స్వర్ణకమలం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణిజయరాం

శివపూజకు చివురించిన

శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ
శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
నటనాంజలితొ బ్రతుకును తరించనీవా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ

పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తల వంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడి గాలిని జయించి రావా
మది కోరిన మధు సీమలు వరించి రావా
పరుగాపగ పయనించవె తలపుల నావ
కెరటాలకు తల వంచితె తరగదు త్రోవ

పడమర పడగలపై మెరిసే తారలకై
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకె సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించె కాంతులు చిందని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నిదురించిన హృదయ రవళి ఓకారం కాని

శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వ సిరి సిరి మువ్వ

తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా ఆ ఆ ఆ ఆ
ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోదు ఎక్కడా ఆ ఆ ఆ ఆ
అవధి లేని అందముంది అవనికి నలు దిక్కులా ఆ ఆ ఆ ఆ
ఆనందపు గాలి వాలు నడపని నిన్నిలా ఆ ఆ ఆ ఆ
ప్రతి రోజొక నవ గీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా

పరుగాపగ పయనించవె తలపుల నావ
కెరటాలకు తల వంచితె తరగదు త్రోవ

లలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో వికశిత శత దళ శోభల సువర్ణ కమలం

పరుగాపగ పయనించవె తలపుల నావ
కెరటాలకు తల వంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడి గాలిని జయించి రావా
మది కోరిన మధు సీమలు వరించి రావా

స్వధర్మే మిధనం ష్రేయహ పర ధర్మో భయావహ

చిత్రం : స్వర్ణకమలం
గానం : పి.సుశీల

నన్ను దోచుకుందువటే...

నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూల దండ వోలె కర్పూర కలికవోలె కర్పూర కలికవోలె
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు

నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసి పోదు నీలొ
కలసి పొదు నీలొ
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం

్నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

చిత్రం: గులేబకావళి కథ
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : సి. నారాయణరెడ్డి

Wednesday, October 24, 2007

ఆమె….



అవి పెదవులు కావు
కెంజాయ రంగును అలుముకుని ఎక్కుపెట్టిన హరివిల్లులు
అవి నవ్వులు కావు
నా హృదయంలో తీయగా వీచే మన్మధ శరాలు
అవి మాటలు కావు
ఎన్నటికీ తరగని శరపరంపరను నిక్షిప్త పరుచుకున్న అమ్ములపొదులు
అవి చూపులు కావు
నా ఎదను ప్రేమగా కోస్తున్న కరవాలాలు
అవి నడకలు కావు
హిమవన్నగము నుండి జాలువారిన జలపాతాల హొయలు
అవి అడుగుల చప్పుళ్ళు కావు
నా మదిలో సమ్మోహన రాగాలు పలికిన భూపాల రాగాలు
ఒక మేఘం .. మధ్యకు చీలితే కనిపించే
నీలిరంగుల ఆకాశమే .. ఆమె పాపిట.

దట్టమైన మేఘాలే ఆమే కురులు
దశమినాటి జాబిలి లాంటి నుదురు
ఆ మధ్య కస్తూరీ తిలకం
కళ్ళు కలువలు
ముక్కు సంపెంగ
పెదవి పగడం
వెరసి….
ఆమె ఆ బ్రహ్మ సృష్టించిన మెరుపుతీగ..
ఆమె …ఆమె……

రచన : మాదవ్ శర్మ

నా ప్రాణం...




అదే చిరునవ్వు… అదే చిరునవ్వు….
రెండు గులాబీలపై మల్లెమొగ్గ అలవోకగా వాలినట్లు
మేఘమాల కౌగిలినుండి బాలభానుడు బయటపడినట్లు
నవమి నాటి నెలవంక ఆకృతి సంతరించుకున్నట్లు
నీ దగ్గర నా హృదయం కుశలమేనన్నట్లు..

నువ్వంటే నా ఆశా దీపం
నువ్వంటే నా కవితా రూపం
నువ్వంటే నాలోని నిగూఢ తేజం
నువ్వంటే మమతల మణిహారం
నువ్వంటే సొగసుల కావ్యం
నువ్వంటే అందని దూరం
నువ్వంటే ఓ మధుర జ్ఞాపకం
నువ్వంటే వలపుల విరిబాణం
నువ్వంటే నువ్వంటే నా ప్రాణం..



రచన : మాధవ్ శర్మ
Share

Widgets