Ads 468x60px

Friday, August 29, 2008

రేపంటి రూపం కంటి

రేపంటి రూపం కంటి
పూవింటి చూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
రేపంటి వెలుగే కంటి
పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటి

నా తోడు నీవైయుంటే
నీ నీడ నేనేనంటే
ఈ జంట కంటే వేరే లేదు లేదంటి - 2
నీ పైన ఆశలు వుంచి ఆపైన కోటలు పెంచి - 2
నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటి
రేపంటి


నే మల్లెపువ్వై విరిసి
నీ నల్లని జడలో వెలసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే చాలంటి - 2
నీ కాలి మువ్వల రవళి
నా భావి మోహన మురళి - 2
ఈ రాగసరళి తరలిపోదాం రమ్మంటి
రేపంటి

నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటి
వేయించి నేనే ఓడిపోనీ పొమ్మంటి
నేనోడి నీవై గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి
రేపంటి

చిత్రం : మంచి-చెడు
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : ఆత్రేయ
సంగీతం : విశ్వనాధన్ - రామ్మూర్తి

0 comments:

Post a Comment

Share

Widgets