Ads 468x60px

Saturday, August 30, 2008

మౌనముగానే మనసు పాడిన

మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే || మౌనముగా ||

కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆ...
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృతవాహినిని ఓలలాడి మైమరచితిలే || మౌనముగా ||

ముసిముసి నవ్వుల మోము గని నన్నేలుకొంటివని మురిసితిలే
ఆ... ఆ... ఆ...
ముసిముసి నవ్వుల మోము గని నన్నేలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుచు విసరిన వాల్జడ వలపు పాశమని వెదరితినే || మౌనముగా ||

చిత్రం : గుండమ్మ కథ
గానం : ఘంటసాల
రచన : పింగళి
సంగీతం : ఘంటసాల

0 comments:

Post a Comment

Share

Widgets