Ads 468x60px

Saturday, August 30, 2008

Get this widget | Track details | eSnips Social DNA


ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి (2)
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ
ప్రకృతినెల్ల హాయిగా (2)
తీయగా, మాయగా పరవశింపజేయుచు || ఎచటి నుండి ||

జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ (2)
మనసు మీద హాయిగా (2)
తీయగా, మాయగా మత్తుమందు జల్లుచు || ఎచటి నుండి ||

హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ (2)
ప్రకృతినెల్ల హాయిగా (2)
తీయగా, మాయగా పరవశింపజేయుచు || ఎచటి నుండి ||

చిత్రం : అప్పు చేసి పప్పు కూడు
గానం : ఘంటసాల, పి.లీల
రచన : పింగళి
సంగీతం :సాలూరి రాజేశ్వరరావు

0 comments:

Post a Comment

Share

Widgets