Ads 468x60px

Friday, September 5, 2008

నువ్వేనా నా నువ్వేనా

నువ్వేనా..నా నువ్వేనా
నువ్వేనా..నాకు నువ్వేనా

సూర్యుడల్లే సూది గుచ్చి సుప్రభతమేనా
మాటలాడే చూపులన్ని మౌన రాగమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా..ఆ
ఆనందమేనా..ఆనందమేనా !

నువ్వేనా..నా నువ్వేనా
నువ్వేనా..నాకూ నువ్వేనా

మేఘమల్లె సాగి వచ్చి..దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి..మెరిసి మాయమౌతావు
కలలేనా..కన్నీరేనా

తేనెటీగ లాగ కుట్టి..తీపి మంట రేపుతావు
పువ్వు లాంటి గుండెలోన..దారమల్లె దాగుతావు
నేనేనా..నీ రూపేనా

చేరువైన..దూరమైన..ఆనందమేనా
చేరువైన..దూరమైన..ఆనందమేనా
ఆనందమేనా..ఆనందమేనా !

నువ్వేనా..నా నువ్వేనా
నువ్వేనా..నాకు నువ్వేనా

కోయిలల్లె వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటె నవ్వుతావు
ఏ రాగం ..ఇది ఏ తాళం

మసక ఎన్నెలల్లె నీవు..ఇసుక తిన్నె చేరుతావు
గస గసాల కౌగిలింత..గుస గుసల్లే మారుతావు
ప్రేమంటే..నీ ప్రేమేనా

చేరువైన దూరమైన ఆనందమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా
ఆనందమేనా..ఆనందమేనా !

నువ్వేనా..నా నువ్వేనా
నువ్వేనా..నాకు నువ్వేనా

చిత్రం : ఆనంద్
గానం : రాధాకృష్ణ,శ్రేయ ఘోశాల్
రచన : వేటూరి
సంగీతం : కె.ఎమ్.రాధాకృష్ణన్

0 comments:

Post a Comment

Share

Widgets