Ads 468x60px

Friday, June 25, 2010

మేఘమా దేహమా




మేఘమా దేహమా .. మెరవకే ఈక్షణం

మెరిసినా కురిసినా .. కరుగు నీ జీవనం

మేఘమా దేహమా .. మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా .. కరుగునీ ..
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం


మెరుపులతో పాటు ఉరుములుగా
దని రిస రిమ దని స దని ప గ

మూగబోయే జీవస్వరములుగా
వేకువ ఝామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచు పల్లకిగా

మేఘమా దేహమా .. మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా .. కరుగు నీ జీవనం

పెనుగాలికి పెళ్ళి చూపు
పువ్వు రాలిన వేళా
కల్యాణంఅందాకా ఆరాటం .. ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో ...

మేఘమా దేహమా .. మెరవకే ఈక్షణం

మెరిసినా కురిసినా .. కరుగు నీ జీవనం

చిత్రం : మంచుపల్లకి
గానం : ఎస్.జానకి.
రచన : వేటూరి
సంగీతం : రాజన్ నాగేంద్ర

0 comments:

Post a Comment

Share

Widgets