Ads 468x60px

Friday, October 21, 2011

తెల్లచీరలో ఎన్ని సిగ్గులో



తెల్లచీరలో ఎన్ని సిగ్గులో.. మల్లెపూలలో ఎన్ని పిలుపులో...
పిలుపు పిలుపు లో ఎన్ని వలపులో..వలపు తలపు లో ఎన్ని మలుపులోఓఓ..

తెల్లా తెల్లని చీరలోనా చందమామా పట్ట పగలు వచ్చినావే చందమామా...||2||
సూరీడొచ్చీ రమ్మంటాడే చందమామా ||2||
చూసిందల్లా ఇమ్మంటాడే చందమామా...

||
తెల్లా తెల్లని||

పువ్వు పువ్వు లో ఎన్ని రేఖలో..రేఖ రేఖ లో ఎన్ని రూపులో...||2||
రూపు రూపు లో ఎన్ని చూపులో..చూపు చూపు లో ఎన్ని ఆశలో...
ఆశె నువ్వైతే నువ్వే నేనౌతా...నేనే నువ్వవుతా

||
తెల్లా తెల్లని||

సంజె సంజెకూ ఎన్ని రంగులో..రంగు రంగు లో ఎన్ని కాంతులో..||2||
సృష్టి సృష్టి కీ ఎన్ని మార్పులో..నిన్న రేపు కీ ఎన్ని చేర్పులో...
నిన్నే నువ్వైతే...నేడే నేనౌతా... నేనే నువ్వవుతా

||
తెల్లా తెల్లని||

చిత్రం: బొబ్బిలి పులి
సంగీతం : జెవి రాఘవులు
సాహిత్యం : దాసరి
గానం : బాలు. పి సుశీల

0 comments:

Post a Comment

Share

Widgets