Ads 468x60px

Wednesday, April 11, 2012

మధువనిలో రాధికవో





మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం !

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం !

మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో

కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలీ..
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలీ..
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడూ..
వెతలే మాసిన కధలో వెలిగెను నేడీ సూర్యుడూ..

తొలి తొలీ వలపులే..
తొలకరీ మెరుపులై..
విరిసే వేళలో..హేలలో..డోలలో..

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం !

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ..

బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడూ..
ఎదిగిన బాలిక ఎద గల గోపికకతడే దేవుడూ..
మధురాపురికి యమునా నదికి ఒకటే రాధికా..
మరువైపోయిన మనసున వెలసెను నేడీ దేవతా..

వెలుగులా వీణలే..పలికెనూ జాణలో..
అదియే రాగమో..భావమో..బంధమో..

మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం !

చిత్రం : అల్లరిబావ
సంగీతం: రాజన్-నాగేంద్ర
గాత్రం : యస్.పి.బాలు, పి.సుశీల
రచన : వేటూరి

2 comments:

  1. రాజన్-నాగేంద్ర సంగీతమంటే చాలా ఇష్టం. వేటూరి గారి సాహిత్యం దానికి తోడైతే ఇక చెప్పాల్సింది ఏముంది. జ్యోతిగారు మీ బ్లాగ్ చాలా నచ్చింది. మీ బహుముఖ ప్రజ్ఞకు నా జోహార్లు.

    ReplyDelete
  2. రాజన్-నాగేంద్ర సంగీతమంటే చాలా ఇష్టం. వేటూరి గారి సాహిత్యం దానికి తోడైతే ఇక చెప్పాల్సింది ఏముంది. జ్యోతిగారు మీ బ్లాగ్ చాలా నచ్చింది. మీ బహుముఖ ప్రజ్ఞకు నా జోహార్లు.

    ReplyDelete

Share

Widgets