Ads 468x60px

Saturday, April 11, 2015

ఏమని నే.. చెలి పాడుదునో




ఏమని నే..  చెలి పాడుదునో
తికమకలో ఈ మకతికలో
తోటలలో .. పొదమాటులలో.. 
తెరచాటులలో...
ఏమని నే మరి పాడుదునో
తికమకలో ఈ మకతికలో

 
నవ్వు.. చిరునవ్వు.. విరబూసే పొన్నలా
ఆడు.. నడయాడు.. పొన్నల్లో నెమలిలా
పరువాలే పార్కుల్లో.. ప్రణయాలే పాటల్లో
 నీ చూపులే నిట్టూర్పులై.. నా చూపులే ఓదార్పులై
నా ప్రాణమే నీ వేణువై.. నీ ఊపిరే నా ఆయువై..
సాగే తీగ సాగే రేగిపోయే లేత ఆశల కౌగిట..

 

ఏమని నే.. మరి పాడుదునో.. 
తికమకలో ఈ మకతికలో
 

చిలక.. గోరింక.. కలబోసే కోరిక
పలికే.. వలపంతా.. మనదేలే ప్రేమికా
దడ పుట్టే పాటల్లో.. ఈ దాగుడుమూతల్లో
ఏ గోపికో దొరికిందనీ.. ఈ రాధికే మరుపాయెనా
నవ్విందిలే బృందావని.. నా తోడుగా ఉన్నావని..

 ఊగే తనువులూగే.. వణకసాగె రాసలీలలు ఆడగ

ఏమని నే..  మరి పాడుదునో ..
తొలకరిలో తొలి అల్లరిలో మన అల్లికలో..

 ఏమని నే.. చెలి పాడుదునో
తికమకలో ఈ మకతికలో
 చిత్రం : మంత్రిగారి వియ్యంకుడు ( 1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

2 comments:

Share

Widgets