Ads 468x60px

Wednesday, February 17, 2016

కలికి మేనిలో

కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో కలిగే స్పందనం
ఇలకూ వెన్నెలకూ
ఇలకూ వెన్నెలకూ
జరిగే సంగమం
కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో
 
రంగుల కలగా మెరిసే ఆకాశం
ముంగిట తానే నిలిచే
తోటకు వరమై దొరికే మధుమాసం
గూటిని తానే వలచే
గర్భ గుడిని దాటి కదిలింది దేవతా
గర్భ గుడిని దాటి కదిలింది దేవతా
చేయి అందుకొమ్మని చేరుకుంది నీ జత

కలికి మేనిలో కలిగే స్పందనం
ఇలకూ వెన్నెలకూ
ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం
కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో

పెదవుల వలలో పెరిగే ఏకాంతం
ప్రేమకు పేరై ఎగిసే
తలపుల వడిలో ఒదిగే అనురాగం
తలుపులు తానే తెరిచే
తల్లి నేల వేసే మన పెళ్ళి పందిరి
తల్లి నేల వేసే మన పెళ్ళి పందిరి
వేయి జన్మలెత్తినా వీడదు మన కౌగిలి

కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో కలిగే స్పందనం
ఇలకూ వెన్నెలకూ
జరిగే సంగమం
కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో

 చిత్రం: సంకీర్తన (1987)
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : సినారె
గానం : బాలు, జానకి

0 comments:

Post a Comment

Share

Widgets