Ads 468x60px

Saturday, March 7, 2009

రేపంటి రూపం కంటి

రేపంటి రూపం కంటి
పూవింటి చూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి
నా కంటి కళలూ కలలు నే సొమ్మంటీ

నాతోడు నీవైయుంటే నీ నీడ నేనేనంటి..
ఈ జంట కంటే వేరే లేదు లేదంటి

నీపైన ఆశలు వుంచి ఆపైన కోటలు పెంచి
నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటి
రేపంటి...

నే మల్లెపువ్వై విరిసి నీ నల్లని జడలో వెలసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే కాయలాంటి
నీ కాలిమువ్వల రవళి
నా భావి మోహన మురళి

ఈ రాగసరళి తరలిపోదాం రమ్మంటి
రేపంటి...

నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటి
వేయించి నేనే ఓడిపోని పోమ్మంటి
నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి
రేపంటి ....

చిత్రం : మంచి -చెడు
గానం : ఘంటసాల, ఫై.సుశీల
రచన : ఆత్రేయ
సంగీతం : విశ్వనాధన్ - రామమూర్తి

నేనొక ప్రేమ పిపాసిని



నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది

నేనొక ప్రేమ పిపాసిని....

తలుపు మూసిన తలవాకిటిలో
పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక
అలసి తిరిగి వెళుతున్నా

నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది
నేనొక ప్రేమ పిపాసిని...

పూట పూట నీ పూజ కోసమని
పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోట్టగా
ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను

నేనొక ప్రేమ పిపాసిని...

పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా
నీ చెవిన పడితే చాలునని
నా జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిసేలోగా నివురైపోతాను

నేనొక ప్రేమ పిపాసిని...

చిత్రం : ఇంద్ర ధనుస్సు
గానం : ఎస్.ఫై.బాలసుబ్రహ్మణ్యం
రచన : ఆత్రేయ
సంగీతం : కే.వి.మహాదేవన్

నిలువవే వాలు కనులదానా

Get this widget | Track details | eSnips Social DNA


నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నవే చానా
నువ్వు కులుకుతూ గల గల నడుస్తూ ఉంటే
నిలువదే నా మనసు
ఓ లలనా అది నీకే తెలుసు

నిలువవే....

ఎవరని ఎంచుకోనినావో
పరుడని భ్రాన్తిపదినావో
ఎవరని ఎంచుకోనినావో.. భ్రాంతి పదినావో
సిగ్గుపడి తోలిగేవో
విరహాగ్నిలో నను తోసి పోయేవో

నువు కులుకుతూ...

ఒకసారి నను చూడరాదా
చెంతచేరా సమయమిది కాదా
ఒకసారి నను చూడరాదా
సమయమిది కాదా
వగలాడి నే నీవాడనే కాదా

నువు కులుకుతూ

మగాడంటే మొజులేనిదానా
మనసుంటే నీకు నేను లేనా
మగాడంటే మోజు లేనిదానా .. నీకు నేను లేనా
కోపమా నా పైనా
నీ నోటి మాటకే నోచుకోలేనా

నిలువవే...

చిత్రం : ఇల్లరికం
గానం : ఘంటసాల
రచన :కొసరాజు
సంగీతం : టి. చలపతిరావు

కమ్మనీ ఈ ప్రేమలేఖనే



కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనులతోటలో
తొలి కళల కవితలే మాట మాటలో
ఓహో .. కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది ప్రియతమా

ప్రియతమా....

గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమి గాదు
పువ్వు సోకి నీకు సోకు కన్దేనే
వెలికి రాని వెర్రి ప్రేమ
కన్నీటి దారలోన కరుగుతున్నది
నాడు శోకమోపలేక
నీ గుండె బాధపడితే తాళనన్నది
మనుశులెరుగలెరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్చమైనది
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా
ఉమాదేవిగా శివుని అర్ధభాగమై
నాలోన నిలువుమా
శుభలాలి లాలి జో లాలి లాలి జో
ఉమాదేవి లాలి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా
నా హృదయమా

చిత్రం : గుణ
గానం : ఎస్.ఫై.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
రచన : వెన్నెలకంటి
సంగీతం : ఇళయరాజా

నువ్వేం మాయ చేసావో గాని



నువ్వేం మాయ చేసావో గాని
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటుంది ఓణీ
మరీ చిలిపిదీ వయసు బానీ
హయ్య హయ్యారే హయ్యారే హ్యా
చిందులేస్తున్న ఈ అల్లరి
ఓ స్య సయ్యారే సయ్యారే స్యా
ఎటుపోతుందో ఏమో మరి

నువ్వేం....

ఔరా పంచకళ్యాణి పైనా
వస్తాడంట యువరాజు ఔనా
నువ్వేమైనా చూసావా మైనా
తెస్తున్నాడా ముత్యాల మేనా
హయ్య హయ్యారే హయ్యారే హ్యా
మొగలి పూవంటి మొగుదేవ్వరే
ఓ సయ్యా సయ్యారే సయ్యారే స్యా
మేలతాలాల మనువేప్పుడే

కలా నువ్వు ఎ చాటునున్నా
అలా ఎంత కవ్వించుకున్నా
ఇలా నిన్ను వెంటాడి రానా
ఎలాగైనా నిను కలుసుకోనా
హయ్య హయ్యారే హయ్యారే హ్యా
ఆశపడుతున్న ఈ నా మది
ఓ సయ్యా సయ్యారే సయ్యారే స్యా
అది తీరేది ఎపుదన్నది...

నువ్వేం....


చిత్రం : ఒక్కడు
గానం : శ్రేయ ఘోషాల్
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : మణి శర్మ

నీలి మేఘాలలో

నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళ
నీలి మేఘాలలో ...

ఎ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి
అపురూపమై నిల్చే నా అంతరంగాన

నీలిమేఘాలలో....

నీ చేలిమిలోనున్న నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే మరపింపజేయు

నీలిమేఘాలలో...

అందుకోజాలని ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమౌతావు

నీలి మేఘాలలో ....


చిత్రం : బావా మరదళ్ళు
గానం : ఘంటసాల / జానకి
రచన : ఆరుద్ర
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
Share

Widgets