Wednesday, February 8, 2012
శివగోవింద గోవింద
హరిహి ఓం ... హరిహి ఓం.... హరిహి ఓం... హరిహి ఓం
శివ గోవింద గోవింద... హరి గోవింద గోవింద....
ఉత్పాతములెన్నో ఉద్బవిల్లేను, తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను
అంతు పొంతూ లేని ఆపదల దేశంబు అల్లకల్లోలమై పోయెను
శివ గోవింద గోవింద.......
హంపిలో హనుమంతుడు ఆగ్రహమ్మున లేచి ఆర్బాటముగా కేక వేసేను
ఆ కేకలకు జనులు ఆదరిపోయేను ఆకు రాలినయట్లు రాలిపోయేను...
శివ గోవింద గోవింద.......
హైదరాబాదును మూసి మాహానది వరదతోటి ముంచి వేసేను
బావులు చెరువులు నీళ్ళు లేక ఎండి క్షామ దేవత తాండవించెను
శివ గోవింద గోవింద.......
ఉదయగిరిలో ఒక కాన్పుకే ఒక భామ ఏడ్గురు పిల్లల్నికంటుంది
సాగరంలో పెద్ద బడబాలనం పుట్టి గ్రామాలనే మర్చివేస్తుంది
శివ గోవింద గోవింద.......
ఉన్నవాళ్లు లేనివాళ్ళు ఒక్కటే అని సామ్యవాదము పైకి వస్తుంది
బంగారమే కంటికగుపడక మాయమై ఇత్తడికి ఆదిక్యమోస్తుంది
శివ గోవింద గోవింద.......
శ్రీ గిరి మల్లయ్య దేవాలయమ్ములో పట్ట పగలే ముసళ్ళు దూరెను
తిరుపతి వెంకన్న గుడి నాల్గురోజులు పుజలేక మూతపడెను
శివ గోవింద గోవింద.......
తిరుపతి కొండపై జలధార పుట్టి అందరికి ఆధారమయ్యేను
అమెరికా దేశాన భుకంపములు పుట్టి పట్టణాలకే చేటు వచ్చేను
శివ గోవింద గోవింద.......
ఆరేండ్ల పిల్లకు ఆశ్చర్యకరముగా మగచిన్నవాడు జన్మించేను
వేప చెట్టుకు అమృతబిందువులరీతిగా పాలు కారే రోజు వచ్చేను
శివ గోవింద గోవింద.......
ధరణి పట్టని జనం తల్లకిందులుగా పెరిగి తిండి గుడ్డ చాలకుండెను
తెరమీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారమును చేలయించెను
తెరమీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారమును చేలయించెను
శివ గోవింద గోవింద.......
కంచికి పడమర గాండ్లవారి ఇంట కామదేనువు ఒకటి పుట్టెను
పల్నాటిసీమలో ప్రజలవంచేన చేసి ద్రవ్యమంతా ఒకడు దోచెను
శివ గోవింద గోవింద.......
గండికోటను మందుగుండు ప్రేలిపోయి జననష్టమే సంభవించెను
పచ్చెర్ల కోటలో కోడి మాట్లాడేను నేల్లురునకు ముప్పు వచ్చేను
శివ గోవింద గోవింద.......
వొంగుతులేచేటి ఈత చెట్టుని చూచి లోకులంత పూజ చేసేరు
వెనుకజన్మములోన జరిగిన కథలన్నీ మూడేళ్ళ బాలుడు చెప్పేను
శివ గోవింద గోవింద.......
యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను
యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను
వీరభోగా వసంత రాయుడుగ నేవచ్చి దుష్ట శిక్షణ అపుడు చేస్తాను
చిత్రం : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
గానం: రామకృష్ణ
మాయదారి మరల బండిరా
మాయదారి మరల బండి రా ....
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా....
మాయదారి మరల బండి రా ....
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా....
పంచవింసతే తత్వమ్ములచే దశవిధములైన వాయువులచే
సప్త దాతువులు నవనాడులచే తైతక్కలాడే తోలు బొమ్మరా ....
మాయదారి మరల బండి రా ....
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా....
ఊపిరి పేరే హంస రా.. ఉచ్వాశ నిశ్వాసల కొలత రా ...
అహం సోహం అను మార్గమ్మున పరమాత్ముడు నడిపే తమాషా బండి రా ...
మాయదారి మరల బండి రా ....
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా....
భూమి నిలయమై గుధ స్థానమున
నాలుగురేకుల ఎరుపు రంగుతో వెలుగు చుండును
ఒక ఘడియ నలభై విఘడియలకు ఆరు నూర్ల హంస జపము జరుగును ...
అధినాయకుడు గణపతి రా... అదే రా మూలాధార చక్రము....
ఆధార చక్రమునకు పైన రెండంగులములలో బుహ్యమందున
జనస్తానమై ఆరు ధలముల తెలుపు వర్ణమున వెలుగు చుండును
పదహారు గడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపము జరుగును... అధినాయకుడు ప్రజాపతి రా ... అదే రా స్వాదిష్టాన చక్రము...
స్వాదిష్టాన చక్రముపై మూడంగులములలో నాభియందున
అగ్నినిలయమై పది దలములతో నీలిరంగున వెలుగు చుండును
పదహారు గడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపము జరుగును...
అధినాయకుడు లక్ష్మిపతి రా ... అదే రా మణిపూరక చక్రము...
మణిపూరక చక్రముపైన పది అంగులములలో హృదయమందున
వాయునిలయమై పన్నెండు దలముల పచ్చని కాంతితో వెలుగుచుండును
పదహారు గడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపము జరుగును...
అధినాయకుడు గౌరీపతి రా ... అదే రా అనాహత చక్రము...
అనాహత చక్రము పైన పన్నెండు అంగులములలో కంఠమందున
గగననిలయమై పదహారు దలముల జ్యోతి వర్ణమున వెలుగు చుండును
రెండు గడియల నలభై ఐదు విఘడియలకు వేయి హంసల జపము జరుగును...
అధినాయకుడు జీవుడు రా ... అదే రా విశుద్ధ చక్రము...
విశుద్ధ చక్రం మొదలు పన్నెండంగులములలో భుమద్యమందున
అంతః కలనకు నిలయమై రెండు దలముల శుద్ధ వర్ణమున వెలుగుచుండును
రెండు గడియల నలభై విఘడియలకు వేయి హంసల జపము జరుగును
అధినాయకుడు సర్వేశ్వరుడు రా ... అదే రా ఆగ్నేయ చక్రము..
ఈ చక్రములకు నడినెత్తి పైన బ్రహ్మ రంద్రమొకటున్నది
ప్రణవ నిలయమై తేజోమయమై సహస్రదలముల కమలమందున
ఓం కారం ద్వనియించుచుండును...
రెండు గడియల ఆరు విఘడియలకు వేయి హంసల జపము జరుగును
అధినాయకుడు గురుమూర్తి రా ... అదే రా సహస్రారము....
ఏకాగ్రతతో మనసు నిల్పిన ఓం కారము వినిపించును రా
భూమద్యమ్మున దృష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించును రా
ఆ చిదానందముర్తిని దర్శించిన ముక్తి మీకు ప్రాప్తించును రా ! ముక్తి మీకు ప్రాప్తించును రా !
చిత్రం : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
గానం : రామకృష్ణ
Tuesday, February 7, 2012
చెప్పాలని ఉంది
ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే గదా గుండె బలం తెలిసేది
దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకోను మేలైనా
ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా
ఎవ్వరితో ఏ మాత్రం పంచుకొని వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలెమిటండీ
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
గుండెల్లో సుడి తిరిగే కలత కధలు
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
అయినవాళ్లు వెలివేస్తే అయినా నే ఏకాకిని
కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
అయినవాళ్లు వెలివేస్తే అయినా నే ఏకాకిని
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
పాట బాట మారాలని చెప్పటమేనా నేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచె వన్నెల విరి తోట
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచె వన్నెల విరి తోట
బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం
ఏది మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచెనకు మోడై గోడు పెట్టు వాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగి మత్త కోకిల
కళ్ళువున్న కభోదిలా చెవులున్నా బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదనందుకు అక్కడ కరువాయెను నా స్థానం
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
అసహాయతలో దడ దడ లాడే హృదయ మృదంగ ధ్వానం
నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బ్రతుకుల నిత్యం చస్తూ సాగే బాధల బిడారు
దిక్కు మొక్కు తెలియని దీనుల యదార్ధ జీవన స్వరాలూ
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలవనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరి చెయ్యాలి
జన గీతిని వద్దనుకుంటూ నాకు నేనే హద్దనుకుంటూ
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను
నేను సైతం విశ్వ వీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోస్తాను
నేను సైతం ప్రపంచాద్యపు తెల్ల రేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపెను
నేను సైతం నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపెను
సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించు దాకా
ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించు దాకా
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
నేను సైతం నేను సైతం నేను సైతం
నేను సైతం నేను సైతం నేను సైతం
చిత్రం: రుద్ర వీణ
గానం: బాలు
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: ఇళయరాజా