ఏ పారిజాతమ్ములీయగలనో సఖి - 1
ఏ పారిజాతమ్ములీయగలనో సఖి - 2
ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ
గిరి మల్లికలు తప్ప గరికపూవులు తప్ప
ఏ కానుకలను అందించగలనో చెలీ
గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప
జగతిపై నడయాడు చంచలా వల్లికా
తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా ….
శరదిందు చంద్రికా,.,,
నీవు లేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి
నీవు లేని విరి పానుపు నిప్పులు చెరిగే కుంపటి
విరులెందుకు సిరులెందుకు
మనసు లేక మరులెందుకు
తలపెందుకు తనువెందుకు
నీవు లేక నేనెందుకు … నీవు లేక నేనెందుకు …
కలువపూల చెంత చేరి కైమోడుపు చేతును
నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలని
మబ్బులతో ఒక్కమాటు మనవి చేసికొందును
నా అంగన ఆలాంగనమున ముంగురులై కదలాలని
చుక్కలతో ఒక్కసారి చూపించి నిను
నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియనై మొలవాలని
పూర్ణ సుధాకర బింబమునకు వినతి చేతును
నా కొలతికి ముఖబింబమై కలలు దిద్దుకోవాలని
ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్ధింతు కడసారిగా
నా రమణికి బదులుగా ఆకారం ధరియించాలని
చిత్రం : ఏకవీర
గాత్రం : ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం
పదం : సినారే
స్వరం : కె.వి.మహదేవన్











