Ads 468x60px

Saturday, December 15, 2007

ఇది మల్లెల వేళయని ...

ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది


కసిరే ఏండలు కాల్చునని
ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఏండలు కాల్చునని
మరి ముసిరే వానలు ముంచునని
ఎరుగని కొయిల ఎగిరింది
ఎరుగని కొయిల ఎగిరింది చిరిగిన రెక్కల వొరిగింది
నేలకు వొరిగింది
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది


మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం
మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం
వసి వాడని కుసుమ విలాసం
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది


ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం
ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో
మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం

ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

చిత్రం : సుఖఃదుఖాలు
గానం : పి.సుశీల
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: ఎస్.పి.కోదండపాణి

ఇలాగే ఇలాగే సరాగమాడితే...

ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే

వయసులో వేడుంది మనసులో మమతుంది
వయసులో వేడుంది మనసులో మమతుంది
మమతలేమో సుధామయం మాటలేమో మనోహరం
మదిలో మెదిలే మైకమేమో
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే

భావమే నేనైతే పల్లవే నీవైతే
భావమే నేనైతే పల్లవే నీవైతే
ఎదలోన ఒకే స్వరం కలలేమో నిజం నిజం
పగలు రేయి చేసే హాయి
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే ఊయలూగునే

చిత్రం : వయసు పిలిచింది
గానం :ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
రచన : ఆరుద్ర
సంగీతం:ఇళయరాజా

ప్రణతి ప్రణతి ప్రణతి..

సా రి గ మ ప మ గ మ స రి ని రి స
ప మ గ మ స రి
సా రి గ మ ప ని స ని ప మ గ మ స రి ని రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి
ప మ ప మ గ మ స రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి
పమప మమప మ ప నీ
ప్రణుతి ప్రణుతి ప్రనుతి ప్రధమ కళా సృస్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి ఈ ఈ ఈ


పూల ఎదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పూల ఎదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పైరు పాపలకు జోలలు పాడె గాలుల సవ్వడి హ్రీంకారమ హ్రీంకారమ
గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడి శ్రీంకారమా శ్రీంకారమా
ఆ బీజాక్షర విగతికి అర్పించే ద్యోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి ఈ ఈ ఈ ఈ ఈ


పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందనా అది కవనమా
మ గ మ పా ప మ పా పా ప ప ప
నిపపప నిపపప నిపాపపమ
మ ప మ ప మ గా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా ఆ ఆ
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా
అది శిల్పమా అది శిల్పమా
ఆ లలిత కళా సృశ్టికి అర్పించే ద్యోతలివే

ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రనుతి ప్రధమ కళా సృస్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి ఈ ఈ ఈ

చిత్రం : స్వాతికిరణం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. చిత్ర

యాడగాల వడ్డావురో

యాడగాల వడ్డావురో నా మొగుడా!
యాడగాల వడ్డావురో నా మొగుడా!
కూడులేక పిల్లలేమొ కుమిలి చస్తుండ్రూ
పాడు ముండకొడుకు నీకు బుద్ధి రాదు ఏమిసేతు//యాడ//

కల్లుదాగ నేబోతిని నా పెళ్ళామొ!
కల్లెంత కమ్మగున్నదే నా పెళ్ళామొ
కల్లుకేమొ కైపెక్కి ఒల్లుకేమొ తిమ్మిరెక్కె
కల్లుదాగి వస్తుంటె కాలుజారి పడ్డానె

కల్లుమీద మన్నువడ్డారో నీ పీనుగెల్లా!
కల్లెట్టా మరుస్తవురో నీ పీనుగెల్లా!
తల్లి పిల్లలోము మేము తల్లడిల్లి చస్తుంటే
తాళిబొట్టు అమ్ముకొని తందనలాడెదావు

కల్లెంత కమ్మగున్నదే నీ కాల్లుమొత్త!
లొల్లయితే జెయ్యాబోకే నీ కాల్లుమొత్త
ఇల్లు పిల్లలిడిచిపెట్టి ఈదులల్ల జీతముండి
కల్లుదాగుకుంట నేను కడుపు నింపుకుంటగాని

సావనన్న సావవేమీరో నీదుంపదెగ!
సంసార మెట్లుజేతురో నీ దుంపదెగ
దేవుడా నేనేమి సేతు దిక్కెవరింక నాకు
దివాల్‌కోరు మొకపోడ దిగజారి పోయినోడ

సావు గీవు అన్నావంటే నాయాలి నిన్ను
సావ సావ జంపేదానే నాయాలి నిన్ను
కావరంబుబట్టి నీవు కానిపోని మాటలంటె
సావదన్నె దాను నాదు సంగతింక తెలియదేమొ

రచన : ఆర్. వీరాచారి

గజ్జెలెడ్లబండి

గజ్జెలెడ్ల బండిమీద! గంగవరం బోతున్నా
రావే రంగమ్మో జాతరన్న బోదాము..//రావే//

కంచిపట్టు చీరలేదు ! అంచులున్న రవికెలేదు
మంచి మల్లెపూలమీద మనసేమొ గుంజవట్టె
రానుపోర జాతరా గంగవరం నీవెంట..//రాను//

మంచి చీరెలిపిస్తా! మల్లెపూలు దెప్పిస్తా
అంచులున్న రైకమీద అద్దాలేపిస్త పిల్లా//రావే//

చేతులొక పైసలేదు! చేతికి గాజూలు లేవు
చెప్పుకోవాలంటే సిగ్గేలో రావాయే..//రాను//

చేతిగాజులిప్పిస్తా! చేతి ఖర్చు పైసలిస్తా
చెకుముఖిరవ్వ సిగ్గెందుకెపిల్లా..//రావే//

కడియాలు లేకపాయె కంకణాలు లేకపాయె
అడిగేటందుకేమో చాల బిడియపడి సస్తున్నా..//రాను//

కడియాలు ఇప్పిస్తా! కంకణాలు దెప్పిస్తా
అడుగులెయ్యి ముద్దులొలక అందాల రామచిలుక..//రావే//

బోడిమెడ బెట్టుకొని! యాడకొత్తు నీయెంటా
అడ్డిగొకటి అడగాలటని హడలిపోయి సస్తున్నా..//రాను//

మెడకు మంచి హారమేస్త! మేలైన సొమ్ములిస్త
తడవు సేయకుండదావె తరణివెల్లిపోదాము...//రావే//

గజ్జెలెడ్ల బండిమీద! గంగవరం నేనొస్తా
ఆపుర అంజయ్యో బండి మీద నేనొస్తా//ఆపుర//

రావే రంగమ్మో జాతరన్న పోదాము
ఆపుర అంజయ్యో బండిమీద నేనొస్తా //ఆపుర//

రచన : ఆర్.వీరాచారి
Share

Widgets