Wednesday, February 8, 2012
మాయదారి మరల బండిరా
మాయదారి మరల బండి రా ....
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా....
మాయదారి మరల బండి రా ....
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా....
పంచవింసతే తత్వమ్ములచే దశవిధములైన వాయువులచే
సప్త దాతువులు నవనాడులచే తైతక్కలాడే తోలు బొమ్మరా ....
మాయదారి మరల బండి రా ....
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా....
ఊపిరి పేరే హంస రా.. ఉచ్వాశ నిశ్వాసల కొలత రా ...
అహం సోహం అను మార్గమ్మున పరమాత్ముడు నడిపే తమాషా బండి రా ...
మాయదారి మరల బండి రా ....
ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా....
భూమి నిలయమై గుధ స్థానమున
నాలుగురేకుల ఎరుపు రంగుతో వెలుగు చుండును
ఒక ఘడియ నలభై విఘడియలకు ఆరు నూర్ల హంస జపము జరుగును ...
అధినాయకుడు గణపతి రా... అదే రా మూలాధార చక్రము....
ఆధార చక్రమునకు పైన రెండంగులములలో బుహ్యమందున
జనస్తానమై ఆరు ధలముల తెలుపు వర్ణమున వెలుగు చుండును
పదహారు గడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపము జరుగును... అధినాయకుడు ప్రజాపతి రా ... అదే రా స్వాదిష్టాన చక్రము...
స్వాదిష్టాన చక్రముపై మూడంగులములలో నాభియందున
అగ్నినిలయమై పది దలములతో నీలిరంగున వెలుగు చుండును
పదహారు గడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపము జరుగును...
అధినాయకుడు లక్ష్మిపతి రా ... అదే రా మణిపూరక చక్రము...
మణిపూరక చక్రముపైన పది అంగులములలో హృదయమందున
వాయునిలయమై పన్నెండు దలముల పచ్చని కాంతితో వెలుగుచుండును
పదహారు గడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపము జరుగును...
అధినాయకుడు గౌరీపతి రా ... అదే రా అనాహత చక్రము...
అనాహత చక్రము పైన పన్నెండు అంగులములలో కంఠమందున
గగననిలయమై పదహారు దలముల జ్యోతి వర్ణమున వెలుగు చుండును
రెండు గడియల నలభై ఐదు విఘడియలకు వేయి హంసల జపము జరుగును...
అధినాయకుడు జీవుడు రా ... అదే రా విశుద్ధ చక్రము...
విశుద్ధ చక్రం మొదలు పన్నెండంగులములలో భుమద్యమందున
అంతః కలనకు నిలయమై రెండు దలముల శుద్ధ వర్ణమున వెలుగుచుండును
రెండు గడియల నలభై విఘడియలకు వేయి హంసల జపము జరుగును
అధినాయకుడు సర్వేశ్వరుడు రా ... అదే రా ఆగ్నేయ చక్రము..
ఈ చక్రములకు నడినెత్తి పైన బ్రహ్మ రంద్రమొకటున్నది
ప్రణవ నిలయమై తేజోమయమై సహస్రదలముల కమలమందున
ఓం కారం ద్వనియించుచుండును...
రెండు గడియల ఆరు విఘడియలకు వేయి హంసల జపము జరుగును
అధినాయకుడు గురుమూర్తి రా ... అదే రా సహస్రారము....
ఏకాగ్రతతో మనసు నిల్పిన ఓం కారము వినిపించును రా
భూమద్యమ్మున దృష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించును రా
ఆ చిదానందముర్తిని దర్శించిన ముక్తి మీకు ప్రాప్తించును రా ! ముక్తి మీకు ప్రాప్తించును రా !
చిత్రం : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
గానం : రామకృష్ణ
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment