సరిగమపదని సప్తస్వరాలు నీకు
అవి ఏడురంగుల ఇంద్రధనుస్సులు మాకు
మనసే ఒక మార్గము మమతే ఒక దీపము
ఆ వెలుగే మాకూ దైవము
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో, మనసిజ రాగ వశీకరమో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
ఆనందాలే భోగాలైతే, హంసానంది రాగాలైతే
నవ వసంత గానాలేవో సాగేనులే, సురవీణ నాదాలెన్నో మొగేనులే
వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోనలలో
మోవుల కొమ్మల ఊగిన కోయిల వేణువులూదిన గీతికలు
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
అందాలన్నీ అందే వేళ, బంధాలన్నీ పొందే వేళ
కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగమమేదో సాగేనులే
కోరికలే సారికలై ఆడిన పాడిన సందడిలో
మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
చిత్రం : అమావాస్య చంద్రుడు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
సంగీతం : ఇళయరాజా
0 comments:
Post a Comment