తననం తననం తననం తననం తననం త..
తం తననం తననం తననం తననం తననం..
తం తన నంతన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవ జీవన భావన పలికెనులే..
తం తన నంతన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవ జీవన భావన పలికెనులే..
నవభావనయే సుమ మోహనమై ఆపై వలపై పిలుపై కళలొలుకగ!!
తం తన నంతన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవ జీవన భావన పలికెనులే
ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే..మది దోచెనులే..మరుమల్లెలు సైగలు చేసెనులే..
కన్నియ ఊహలు వెన్నెలలై కథలై కదిలే విరి ఊయలలై
పున్నమి వేసిన ముగ్గులలో కన్నులు దాచిన సిగ్గులలో..
తేనలకందని తీయని కోరికలే..చిరుమరులను చిలుకగ!!
తం తన నంతన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవ జీవన భావన పలికెనులే...
పొంచిన మదనుడు పువ్వుల బాణం నాటెనులే ఎద మీటెనులే..పులకింతలు హద్దులు దాటెనులే...
చిత్రం: కొత్తజీవితాలు
గానం: పి.సుశీల, ఎస్. జానకి
0 comments:
Post a Comment