మనసే జతగా...
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో ..
ఆ..ఆఆ.అ
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో .. ఓఓఓ..ఓ
ఈ గిలిగింత.. సరికొత్త వింత ఏమన్నదీ ?
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ
ఏ..ఏ. హె.హే
ఈ గిలిగింత.. సరికొత్త వింత ఏమన్నదీ ?
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ
అందుకే ఓ చెలీ .. అందుకో కౌగిలీ .. ఓ చెలీ ..
ఏ.. హె హే...
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో .. ఓఓఓ..ఓ
ఓ..ఓఓ ఓ..
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో .. ఓఓఓ..ఓ
నింగిని తాకే నీలాల మేఘం ఏమన్నదీ ?
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ
ఆ..ఓ..హో ..
నింగిని తాకే నీలాల మేఘం ఏమన్నదీ ?
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ
ఓ.. అందుకే ఓ ప్రియా .. అందుకో పయ్యెద .. ఓ ప్రియా
ఏ.. హె హే...
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో !
ఓ..ఓఓ ఓ..
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో!
చిత్రం: నోము
గానం : బాలు, సుశీల
సంగీతం: సత్యం
రచన: సి. నారాయణ రెడ్డి
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment