Monday, October 17, 2011
రాసాను ప్రేమలేఖలెన్నో
రాసాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె
దివిలోన తారకలాయె నీ నవ్వులే
రాసాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె
దివిలోన తారకలాయె
నీ నవ్వులే
కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ
కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ
నా మనసు నిన్నే తలచి ఓ యన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసిందీ
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది
రాసాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె
దివిలోన తారకలాయె నీ నవ్వులే
నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో
నీ చల్లని రూపం ఉందీ నా కనులలో
నాలోని సోయగమంతా విరబూసెలే
నాలోని సోయగమంతా విరబూసెలే
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే
రాసాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె
దివిలోన తారకలాయె నీ నవ్వులే
అందాల పయ్యెద నేనై ఆటాడనా
కురులందు కుసుమం నేనై చెలరేగనా
నీ చేతుల వీణని నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా
రాసాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో....
చిత్రం - శ్రీదేవి
గానం - బాలు, జానకి
సంగీతం - జి.కె. వెంకటేశ్
రచన - దాశరధి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment