తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ
తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ
నీ దోవపొడవునా కువకువలా స్వాగతం
నీ కాలి అలికిడికి మెలకువలా వందనం //తెలిమంచు //
ఈ పూల రాగాల పులకింత గమకాలూ
గారాబు కవనాల గాలి సంగతులు
ఈ పూల రాగాల పులకింత గమకాలూ
గారాబు కవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభూ పవళించు భువనాలు
భానుమూర్తి... నీ ప్రాణకీర్తన విని
పలుకని ప్రణతులని ప్రణవశృతిని
పాడనీ ప్రకృతిని ప్రధమ కృతిని //తెలిమంచు //
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలుభూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు
పసరు పవనాలలో పసికూన రాగాలు
పసిడి కిరణాల పడి పదును తేరిన చాలు
తలయుచు తలిరాకు బహుపరాకులు విని
దొరలని దొరనగవు దొంతరని
తరాలని దారి తొలిగి రాతిరిని
తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ
నీ దోవపొడవునా కువకువలా స్వాగతం
నీ కాలి అలికిడికి మెలకువలా వందనం
తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
చిత్రం: స్వాతి కిరణం
సంగీతం: కే. వి. మహదేవన్
గానం: వాణీ జయిరాం
Great post and success for you..
ReplyDeleteKontraktor Pameran
Jasa Pembuatan Booth Pameran
Kontraktor Booth Pameran
Jasa Pembuatan Booth
Jasa Dekorasi Booth Pameran