వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే సత్యార్ధ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే
ఆపాతమధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము
శ్రీభారతీ క్షీరసంప్రాప్తము అమృతసంపాతము సుకృతసంపాకము
సరిగమ స్వరధుని సారవరూధుని సామ సునాదవినోదిని
సకలకళాకళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని
మాంపాహి మకరంద మందాకినీ! మాంపాహి సుజ్ఞాన సంవర్ధినీ!
ఆలోచనామృతము సాహిత్యము సహితహితసత్యము శారదాస్తన్యము
సారస్వతాక్షర-సారధ్యము జ్ఞానసామ్రాజ్యము జన్మసాఫల్యము
సరస వచోబ్ధిని సారసలోచని వాణీ పుస్తకధారిణీ!
వర్ణాలంకృత-వైభవశాలిని వరకవితాచింతామణీ
మాంపాహి సాలోక్యసంధాయినీ! మాంపాహి శ్రీచక్ర సిమ్హాసినీ!
0 comments:
Post a Comment