Ads 468x60px

Monday, July 9, 2012

జాలిగా జాబిలమ్మా




జాలిగా   జాబిలమ్మ  రేయి  రేయంతా
జాలిగా  జాబిలమ్మ  రేయి  రేయంతా
రెప్ప  వెయ్యనే  లేదు  ఎందుచేత  ఎందుచేత
పదహారు  కలలని  పదిలంగా  వున్చనీ 
పదహారు  కలలని  పదిలంగా  వున్చనీ
ఆ  కృష్ణ  పక్షమే  ఎదలో  చిచ్చు  పెట్టుట  చేత // జాలిగా // 



కాటుక   కంటినీరు పెదవుల  నంటనీకు 
చిరు  నవ్వు  దీపకళిక  చిన్నబో  నీయకు
నీ  బుజ్జి  గణపతిని   బుజ్జగించి  చెబుతున్నా
నీ  బుజ్జి  గణపతిని  బుజ్జగించి  చెబుతున్నా
నీ  కుంకుమ కెపుడూ    ప్రోద్దుగుంక
దమ్మా    // జాలిగా //


సున్ని  పిండిని  నలిచి  చిన్నారిగా  మలిచి
సంతసాన  మునిగింది  సంతులేని  పార్వతి
సుతుడన్న  మతిమరచి  సూలాన  మెడవిరిచి
పెద్దరికం  చూపే  చిచ్చుకంటి  పెనిమిటి
ప్రానపతి 
నంటూందా బిడ్డగతి  కంటూందా   


ప్రానపతి  నంటూందా బిడ్డగతి  కంటూందా  
ఆ  రెండు  కళ్ళల్లో  అదీ  కన్నీటి  చితి
కాలకూటంకన్నా  ఘాటైన  గరలమిది
గొంతునులిమే  గురుతై  వెంటనే  వుంటుంది
ఆటూ పోటూ  ఘటనలివి  ఆట  విడుపు  నటనలివి
ఆదిశక్తివి  నీవు  అంటవు  నిన్నేవి
నీ  బుజ్జి  గణపతిని  బుజ్జగించి  చెబుతున్నా
కంచి  కెల్లిపోయేవే కధలన్నీ


జాలిగా  జాబిలమ్మ  రేయి  రేయంతా ...

చిత్రం : స్వాతికిరణం
రచన : సిరివెన్నెల
గానం : చిత్ర, వాణి జయరాం
సంగీతం : కె.వి.మహాదేవన్

0 comments:

Post a Comment

Share

Widgets