Ads 468x60px

Monday, July 9, 2012

ప్రణతి ప్రణతి ప్రణతి



సా రి గ మ ప మ గ మ స రి రీ స
ప మ గ మ స రి స
సా రి గ మ ప ని స ని ప మ గ మ స రి రీ సా
ప్రణతి ప్రణతి ప్రణతి
ప మ ప మ గ మ స రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి
పమప మమప మ ప నీ
ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రధమ కళా సృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి....ఈ ఈ ఈ

పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పైరు పాపాలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా హ్రీంకారమా
గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడి శ్రీంకారమా శ్రీంకారమా
ఆ బీజాక్షర విగతికి అర్పించే జ్యోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి... ఈ ఈ ఈ

పంచ భూతముల పరిష్వంమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా
మ గ మ పా ప మ పా పా ప ప ప
నిపపాప నిపపాప నిపాపపమా
మ ప మ ప మ గా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేలనా అది నటనమా అది నటనమా
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సువర్ణ లేఖనా
అది చిత్రమా అది చిత్రమా ఆ ఆ
మౌన శిలల చైతన్య మూర్తులుగా మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా
అది శిల్పమా అది శిల్పమా
ఆ లలితా కళా సృష్టికి అర్పించే జ్యోతలివే

ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రధమ కళా సృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి... ఈ ఈ ఈ

చిత్రం; స్వాతికిరణం
గానం: ఎస్.పి.బాలు, వాణి జయరాం
సంగీతం: కె.వి.మహాదేవన్

0 comments:

Post a Comment

Share

Widgets