Ads 468x60px

Monday, July 9, 2012

శృతినీవు గతినీవు

శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి
ఈ నాకృతి నీవు భారతి
ఈ నాకృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతిశరణా గతి నీవు భారతి
 
నీ పదము లొత్తిన పదము ఈ పదము నిత్యకైవల్య పదము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు
కోరిన మిగిలిన కోరికేమి నినుకోనియాడు కృతులు పెన్నిధి తప్ప
చేరిన యిక చేరువున్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప
శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి

శ్రీనాధ కవినాద శృంగార కవితా తరంగాలు నీ స్పూర్తులే
అల అన్నమాచార్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులే
శ్రీనాధ కవినాద శృంగార కవితా తరంగాలు నీ స్పూర్తులే
అల అన్నమాచార్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులే

త్యాగయ్య గలసీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే
నీ కరుణ నెలకున్న ప్రతి రచన జననీ భవతారక మంత్రాక్షరం
శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి
ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి

చిత్రం: స్వాతికిరణం
గానం : వాణి జయరాం
సంగీతం : కె.వి.మహాదేవన్

0 comments:

Post a Comment

Share

Widgets