రేపంటి రూపం కంటి
పూవింటి చూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి
నా కంటి కళలూ కలలు నే సొమ్మంటీ
నాతోడు నీవైయుంటే నీ నీడ నేనేనంటి..
ఈ జంట కంటే వేరే లేదు లేదంటి
నీపైన ఆశలు వుంచి ఆపైన కోటలు పెంచి
నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటి
రేపంటి...
నే మల్లెపువ్వై విరిసి నీ నల్లని జడలో వెలసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే కాయలాంటి
నీ కాలిమువ్వల రవళి
నా భావి మోహన మురళి
ఈ రాగసరళి తరలిపోదాం రమ్మంటి
రేపంటి...
నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటి
వేయించి నేనే ఓడిపోని పోమ్మంటి
నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి
రేపంటి ....
చిత్రం : మంచి -చెడు
గానం : ఘంటసాల, ఫై.సుశీల
రచన : ఆత్రేయ
సంగీతం : విశ్వనాధన్ - రామమూర్తి
రేపంటి రూపం కంటి
Links to this post Labels: ఆత్రేయ , ఘంటసాల , సుశీల
నేనొక ప్రేమ పిపాసిని
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది
నేనొక ప్రేమ పిపాసిని....
తలుపు మూసిన తలవాకిటిలో
పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక
అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది
నేనొక ప్రేమ పిపాసిని...
పూట పూట నీ పూజ కోసమని
పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోట్టగా
ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని...
పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా
నీ చెవిన పడితే చాలునని
నా జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిసేలోగా నివురైపోతాను
నేనొక ప్రేమ పిపాసిని...
చిత్రం : ఇంద్ర ధనుస్సు
గానం : ఎస్.ఫై.బాలసుబ్రహ్మణ్యం
రచన : ఆత్రేయ
సంగీతం : కే.వి.మహాదేవన్
Links to this post Labels: ఆత్రేయ , కె.వి.మహదేవన్ , బాలు
నిలువవే వాలు కనులదానా
|
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నవే చానా
నువ్వు కులుకుతూ గల గల నడుస్తూ ఉంటే
నిలువదే నా మనసు
ఓ లలనా అది నీకే తెలుసు
నిలువవే....
ఎవరని ఎంచుకోనినావో
పరుడని భ్రాన్తిపదినావో
ఎవరని ఎంచుకోనినావో.. భ్రాంతి పదినావో
సిగ్గుపడి తోలిగేవో
విరహాగ్నిలో నను తోసి పోయేవో
నువు కులుకుతూ...
ఒకసారి నను చూడరాదా
చెంతచేరా సమయమిది కాదా
ఒకసారి నను చూడరాదా
సమయమిది కాదా
వగలాడి నే నీవాడనే కాదా
నువు కులుకుతూ
మగాడంటే మొజులేనిదానా
మనసుంటే నీకు నేను లేనా
మగాడంటే మోజు లేనిదానా .. నీకు నేను లేనా
కోపమా నా పైనా
నీ నోటి మాటకే నోచుకోలేనా
నిలువవే...
చిత్రం : ఇల్లరికం
గానం : ఘంటసాల
రచన :కొసరాజు
సంగీతం : టి. చలపతిరావు
Links to this post Labels: ఘంటసాల







