Ads 468x60px

Monday, December 19, 2011

గాలికి కులమేది


గాలికి కులమేదీ...
ఏదీ... నేలకు కులమేదీ...

మింటికి మరుగేదీ ఏదీ...
కాంతికి నెలవేదీ

పాలకు ఒకటే... ఆ...
పాలకు ఒకటే తెలి వర్ణం
ఏదీ ప్రతిభకు కలదా ఫలభేదం
వీరులకెందుకు కులభేదం
అది మనసుల చీల్చెడు మతభేదం

జగమున యశమే...
జగమున యశమే మిగులునులే
అదీ యుగములకైనా చెదరదులే
దైవం నీలో నిలుచునులే
ధర్మం నీతో నడుచునులే (2)

చిత్రం : కర్ణ
గానం : పి.సుశీల
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి

ముత్యాలు వస్తావా


ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ...
చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను
చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయా...


నీ జారుపైటా... ఊఁ?
ఊరిస్తూవుంది... ఊ హూఁ...
నీ కొంటె చూపు... ఛీ...
కొరికేస్తూ ఉంది
నీ జారుపైటా... ఊరిస్తూవుంది అబ్బా
నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది
కన్నూకన్నూ ఎపుడో కలిసొందీ
ఆ హా హా ఓహోహోహో...
అయ్యో ఏందయ్యా ఈ గోలా... ఊఁ...
సిగ్గేమిలేదా?... నాకెందుకూ...
ఊరోళ్లు ఇంటే ఎగతాళి కాదా
ఏందయ్యా ఈ గోలా సిగ్గేమిలేదా? పోదు బడాయి ॥
నిన్నూ న న్నూ చూస్తే నామరదా
ఆహాహో ఓహోహో ఊహుహు


పర్మినెంటుగానూ... ఆఁ!
నిన్ను చేసుకుంటానూ... అబ్బో
ఉన్నదంతా ఇచ్చేసి... అయ్యో...
నిన్ను చూసుకుంటాను
ఇంటా బైటా పట్టుకునుంటాను
హోహో... హు...
ఆహాహా... ఏహేహేహే...
ఏరుదాటి పొయ్యాకా
తెప్ప తగలయేస్తేనూ
అమ్మామ్మామ్మా...
ఊరంతా తెలిశాక ఒదిలి పెట్టిపోతేనూ
బండ కేసి నిను బాదేస్తానయ్యా
హోహో ఓహోహో ఆహాహాహా
రేవులోన నిను ముంచేస్తానయ్యో
హో ఆహాహా ఊహో ఓహ్


చిత్రం : మనుషులంతా ఒక్కటే
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
రచన : కొసరాజు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

పగటిపూట చంద్రబింబం


విరిసిన ఇంద్రచాపమో
భువిని ప్రభవించిన చంద్రబింబమో
మరు పువుబంతిలో రతియో
మల్లెల దొంతియో మోహకాంతియో
సరస కవీంద్ర కల్పిత రసాకృతిలో
నవరాగ గీతియో
వరసరసీరుహానన బిరాన వరించి తరింపజేయవే

పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏది .. ఏది?
అందమైన నీ మోమే అది గాకింకేది !
కాన రాని మన్మధుడేమో కనపించెను ఏడి .. ఏడి?
ఎదుటనున్న నీవేలే ఇంకా ఎవరోయి!

వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి -2
ఏవీ .. ఏవీ? అవి నీ సిగలోనే ఉన్నాయి ....
పదును పదును బాణాలెవో యెదను నాటుకుంటున్నాయి -2
ఏవీ .. ఏవీ ?అవి నీ ఓర చూపులేనోయి....
పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏది .. ఏది ?
అందమైన నీ మోమే అది గాక ఇంకేది !

ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు -2
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించెవు -2
ఏమో.. ఏమో ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో ......

చిత్రం : చిక్కడు దొరకడు.
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : సి.నారాయణరెడ్డి

అందలం ఎక్కడమ్మా



అందలం ఎక్కాడమ్మా
అందకుండపోయాడమ్మా
ఇంతవాడు ఇంతకు ఇంతై
ఎంతో ఎదిగిపోయాడమ్మా

నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ
నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఒడిలోన ఒదిగినాడమ్మా..
నా ఎదనిండా నిండినాడమ్మా
అందలం ఎక్కాడమ్మా
అందకుండపోయాడమ్మా
ఇంతవాడు ఇంతకు ఇంతై
ఎంతో ఎదిగిపోయాడమ్మా

ఆమాటలకు నేను మైమరిచిపోయాను
ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగాను
భళ్లునా తెల్లారిపోయెనమ్మాఓ . .
ఒళ్ళు ఝల్లున చల్లారిపోయెనమ్మా
అందాన్ని చూశానమ్మా
అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతైనా
నే నీలో ఇమిడిపోతానమ్మా


చిత్రం : దాగుడు మూతలు
గానం : సుశీల
రచన : దాశరథి

అమ్మ కడుపు చల్లగా

అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా

నా మెడలో తాళీబొట్టు కట్టరా నా నుదటా నిలువు బొట్టు పెట్టరా
నీ పెదవి మీద సిరునవ్వు సెరగదురా నీ సిగపూవుల రేకైనా
వాడదురా వాడదురా బతకరా బతకరా పచ్చగా || అమ్మకడుపు ||

చల్లని అయిరేణికి మొక్కరా సన్నికల్లు మీదకాలు తొక్కరా
చల్లనేళ కంటనీరు వద్దురా నా నల్ల పూసలే నీకు
రక్షరా రక్షరా బతకరా బతకరా పచ్చగా || అమ్మకడుపు ||

నా కొంగు నీ చెంగూ ముడివేయరా నా చేయీ నీ చేయీ కలపరా
ఏడడుగులు నాతో నడవరా ఆ యముడైనా మనమద్దికి
రాడురా రాడురా బతకరా బతకరా పచ్చగా || అమ్మకడుపు ||

చిత్రం : సాక్షి
గానం : సుశీల
రచన : ఆరుద్ర
సంగీతం: కె.వి.మహదేవన్

Saturday, December 10, 2011

నిత్యం ఏకాంత క్షణమే అడిగా




నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్ధం లేనట్టి లోకం అడిగా
రక్త తరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా
అనుబంధాలను ఆయుషు అడిగా
ఆనందాక్షుల ఆశీస్సడిగా
మది నొప్పించై మాటలు అడిగా
యెద మెప్పించే యవ్వనం అడిగా
పిడుగులు రాల్చని మేఘం అడిగా
జ్వలించు నూరేళ్ల పరువం అడిగా
వరించు తరించు వలపే అడిగా
ప్రాణతుల్యమౌ బంధం అడిగా
పచ్చికలో మంచి ముత్యాలడిగా
పువ్వుల ఒడిలో పడకే అడిగా
తను ఓదార్చే ఓర్పుని అడిగా
తలనే నిమిరే వేళ్ళని అడిగా
నెమలి ఆట కి పదమే అడిగా
కోయిల పాటకు పల్లవి అడిగా
గదిలో గుక్కెడు నీళ్లే అడిగా
మదిలో జానెడు చోటే అడిగా
మచ్చంటూ లేని జాబిలినడిగా
నక్షత్రానికి నట్టింటినడిగా
దుఖం వధించు అస్త్రం అడిగా
అస్త్రం ఫలించు యోగం అడిగా
చీకటి ఊడ్చే చీపురు అడిగా
పూవులకు నూరేళ్లామని అడిగా
మానవ జాతికి ఒక నీతిని అడిగా
వెతల రాత్రికే వేకువ అడిగా
ఒకటే వర్ణం సబబని అడిగా
ఒకటే అనురాగం గుడిలో అడిగా
వాలని పొద్దుల నెలవంకడిగా
ప్రాణముండగా స్వరం అడిగా
న్యాయం ధర్మం ఇలలో అడిగా
యెద రగిలించే కవితే అడిగా
కన్నెలెరుగని కన్నే అడిగా
క్షామం నశించు కాలం అడిగా
చుక్కలు దాటే స్వతంత్రమడిగా
దిక్కులు దాటే విహంగమడిగా
తొలకరి మెరుపుల నిలకడనడిగా
యెద మావిలో ఏరుని అడిగా
మూగ మాటకు చరణం అడిగా
మౌన బాష వ్యాకరణం అడిగా
శాంతిని పెంచే సంపద అడిగా
వస్తే వెల్లని వసంతమడిగా
యేడేడు జనమలకు ఒక తోడడిగా
ఏనాడు వాడని చిరునవ్వడిగా
ముసిరే మంచుల ముత్యాలడిగా
ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా
ఆశల మెరుపుల జగమే అడిగా
అంధకారమా పొమ్మని అడిగా
అందరి యెదలో హరివిల్లడిగా
మరుగై పోని మమతను అడిగా
కరువై పోని సమతను అడిగా
రాయలంటి కవిరాజుని అడిగా
బమ్మెర పోతన భక్తిని అడిగా
భారతి మెచ్చిన తెలుగే అడిగా
పాశుపతాస్త్రం నరుడై అడిగా
మోహన కృష్ణుని మురళే అడిగా
మధుర మీనాక్షి చిలకే అడిగా
ఉన్నది చెప్పే ధైర్యం అడిగా
ఒడ్డెంకించే పందెం అడిగా
మల్లెలు పూచే వలపే అడిగా
మంచిని పెంచే మంచే అడిగా
పంజా విసిరే దమ్మే అడిగా
పిడుగును పట్టే ఒడుపే అడిగా
: ఉన్నది చెపె దైర్యమదిగ
ద్రోహం అణిచే సత్తా అడిగా
చస్తే మిగిలే చరిత్ర అడిగా
విధిని జయించే ఒరిమినడిగా
ఓరిమిలో ఒక కూరిమినడిగా
సహనానికి హద్దేదని అడిగా
దహనానికి అంతేదని అడిగా
కాలం వేగం కాళ్లకు అడిగా
చిన్నా చితకా జగడాలడిగా
తీయగ ఉండే గాయం అడిగా
గాయానికి ఒక గేయం అడిగా
పొద్దే వాలని ప్రాయం అడిగా
ఒడిలో శిశువై చనుబాలడిగా
కంటికి రెప్పగ తల్లిని అడిగా
ఐదో ఏట బడినే అడిగా
ఆరో వేలుగ పెన్నే అడిగా
ఖరీదు కట్టని చదువే అడిగా
ఎన్నని అడగను దొరకనివి
ఎన్నని అడగను జరగనివి
ఎవరిని అడగను నా గతిని
కళ్లకు లక్ష్యం కలలంటూ
కాళ్లకు గమ్యం కాదంటూ
భగవద్గీత వాక్యం వింటూ
మరణం మరణం శరణం అంటూ

చిత్రం: అద్భుతం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

Thursday, December 8, 2011

అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది




అదే.. అదే.. అదే... నాకు అంతు తెలియకున్నది
ఏదో లాగు మనసు లాగు చున్నది
అదే అదే అదే......


అహా హ హా అహా హ హ అహా హ హా అహా హ హ
అహా హ హ అహా హ హ అహా

అదే అదే అదే వింత నేను తెలుసుకున్నది
అదే నీ వయసు లోన ఉన్నది

నీ నడకలోన రాజహంస అడుగులున్నవి
నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి
ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉన్నవి

ఈ వేళ నా పెదవులేల వణుకుచున్నవి
నీ చేయి సోకగానె ఏదొ హాయి రగిలెను
ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను
ఈ వేళ లేత బుగ్గలేల కందిపోయెను (అదే)

చిత్రం : రాముడు భీముడు
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : సి.నారాయణ రెడ్డి
సంగీతం : పెండ్యాల

తొలికోడి కూసేను



తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో

నాదు మొరకాస్త ఆలించి నిదురపో
అందగాడా నిదురపో చందురూడా నిదురపో అందగాడా నిదురపో చందురూడా నిదురపో


ఇల్లంతా కడగాలి కళ్లాపి చల్లాలి
ముగ్గులు పెట్టాలి గోపాలుడా
కాఫీలు కలపాలి టిఫినీలు చెయ్యాలి
చెంగు విడి చిపెట్టు గోపాలుడా
చెంగు విడి చిపెట్టి సెలవిచ్చి పంపితే
మాపటేళకు మళ్లీ వస్తాను
తెల్లచీర కట్టి మల్లెపూలు పెట్టి
గుమ్ము గుమ్మను కౌగిలిస్తాను
గుండెలో వలపంతా గుమ్మరిస్తాను
చెంగు వదలర సామి గోపాలుడా
సరుసుడ నా సామి గోపాలుడా



సుప్పనాతి సూరీడొచ్చెను
వెన్నెలంతా ఎరబ్రారెను
మల్లెలన్నీ నల్లబోయెను కలువకన్నియ
కందిపోయెను కమిలిపోయెను కానుకో
కంటినిండా నిదురాకోసం
కాచి ఉన్నది చూసుకో రసికరాజ నిదురపో
ధిక్తన ధిక్తన ధిక్తన ధిన ధిక్తన ధిక్తన ధిక్తన
మూడు జాములు తిరగాలేదు
నాలుగోది పొడవాలేదు
తొందరెందుకు సూరీడా ఎందుకొస్తివి సూరీడా
నిన్నెవరు పిలిచారు సూరీడా
నీకిక్కడేమి పని సూరీడా
నీకెప్పుడేమి పని సూరీడా...
పోరా పోరా సూరీడా రారా సూరీడా
పోరా పోరా...

చిత్రం : రాధాగోపాళం
గానం : మురళీధర్, చిత్ర
రచన : ముళ్లపూడి వెంకటరమణ
సంగీతం : మణిశర్మ

పట్నంలో శాలిబండ

http://www.chimatamusic.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3020


పట్నంలో శాలిబండ
పేరైనా గోలకొండ (2)
సూపించు సూపునిండా
ఫిసల్ ఫిసల్ బండ ॥


వయసు పిల్ల వంటి సొంపు
అది వంగి ఉంటె భలే ఇంపు
హహహ...
అది వంగి ఉంటె భలే ఇంపు
అబ్బ అబ్బ...
అది వంగి ఉంటె భలే ఇంపు
ఓరసూపు వలవేసి
దోరవయసు దోచేసి (2)
గులకరాళ్ల నీటిలోన
సెలయేటి బాటలోన (2)
ఒక్కసారి సూడాలి
సంబరాల చాటుబండ
ఫిస
ల్ ఫిసల్ బండ॥


చేప కనుల చిన్నదోయి
నీ చేతికైతే చిక్కదోయి (2)
అల్లిబిల్లి అయి వుందా
బల్లపరుపు అల్ల బండా
అయ్యో అయ్యో అయ్యో...
బల్లపరుపు అల్ల బండా
ఆ... బల్లపరుపు అల్ల బండా॥

చిత్రం : అమాయకుడు
గానం : ఎల్.ఆర్.ఈశ్వరి
రచన : వేణుగోపాల్
సంగీతం : బి.శంకర్

Friday, December 2, 2011

అందెను నేడే అందని జాబిల్లి




అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి

ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
చెలికాడే నాలో తలపులు రేపెనులే
అందెను నేడే అందని జాబిల్లి


నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మ్రోగినవి
గిలిగింతల నా మేను పులకించెలే
నెలరాజే నాతో సరసములాడెనులే
అందెను నేడే అందని జాబిల్లి


ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నామది విహరించెలే

వలరాజే నాలో వలపులు చిలికెనులే




చిత్రం : ఆత్మగౌరవం
రచన : దాశరథి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల

Thursday, December 1, 2011

పాడవోయి భారతీయుడా




పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా

నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నీదే ఆనందం // పాడవోయి //

స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయీ
సాధించినదానికి సంతృప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరపాటోయీ
ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారులా //పాడవోయి//


ఆకాశం అందుకునే ధర లొక వైపు అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు౨
అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకొన్న నీ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దు:స్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితి //పాడవోయి//


పదవీవ్యామోహాలు, కులమతభేదాలు భాషాద్వేషాలు చెలరేగే నేడు
ప్రతిమనిషి మరి ఒకరిని దోచుకునేవాడే
స్వార్థమే అనర్థదాయకం అది చంపుకొనుటే క్షేమదాయకం
సమసమాజనిర్మాణమే నీ లక్ష్యం నీ లక్ష్యం
ఏకదీక్షతో గమ్యం చేరిననాడే లోకానికి మన భారతదేశం
అందించునులే శుభసందేశం

చిత్రం: వెలుగు నీడలు
గానం: ఘంటసాల, పి.సుశీల

ప్రియురాల సిగ్గేలనే ...




ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి
నాలోన ఊహించినా కలలీనాడు ఫలియించెస్వామి
ఏమి ఎరుగని గోపాలునకు ప్రేమలేవో నెరిపినావు
మనసుధీర పలుకరించి మా ముద్దు ముచ్చట్లు చెల్లించవే //ప్రి//


ప్రేమలు తెలిసి దేవుడవని విని నా మదిలోనే కొలిచితిని
స్వామిని నీవని తలచి నీకే బ్రతుకు కానుక చేసితిని
సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవు ఓ భామా
ఇప్పుడేమన్నా ఒప్పనులే ఇక ఎవరేమన్నా తప్పదులే
//ప్రి//


చిత్రం : శ్రీ కృష్ణ పాండవీయం
గానం : ఘంటసాల, పి.సుశీల
సంగీతం: టి.వి.రాజు

నువ్వు నా ముందుంటే



నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు.. రివ్వుమంటుంది వయసు..

ముద్దబంతిలా ఉన్నావు.. ముద్దులొలికిపోతున్నావు..
జింక పిల్లలా చెంగు చెంగుమని చిలిపి సైగలే చేసేవు..

నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు.. రివ్వుమంటుంది వయసు..

చల్లచల్లగ రగిలించేవు.. మెల్లమెల్లగ పెనవేసేవు..
బుగ్గపైన కొనగోట మీటి నా సిగ్గు దొంతరలు దోచేవు..

నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు.. రివ్వుమంటుంది వయసు..

లేత లేతగా నవ్వేవు.. లేని కోరికలు రువ్వేవు..
మాటలల్లి మరుమందు జల్లి నను మత్తులోన పడవేసేవు..

నువ్వు నా ముందుంటే.. నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు.. రివ్వుమంటుంది వయసు..

చిత్రం: గూఢచారి 116
గానం: ఘంటసాల, పి. సుశీలసంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి

Share

Widgets