Ads 468x60px

Friday, February 2, 2007

చూపులు కలసిన శుభవేళా

చూపులు కలసిన శుభవేళా
ఎందుకు నీకీ కలవరము ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనూహించిన అందమె నీలో చిందెనులే
చూపులు కలసిన శుభవేళా
ఎందుకు నీకీ కలవరము

చూపులు కలసిన శుభవేళా
ఎందుకు నీకీ పరవశము ఎందుకు నీకీ పరవశము
ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయెనులే
చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము

ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే
ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే
చెలువములన్ని చిత్ర రచనలే
చెలువములన్ని చిత్ర రచనలే
చలనము లోహో నాట్యములే
చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము

శరముల వలనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే
శరముల వలనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే
ఉద్యానమున వీర విహారమే
ఉద్యానమున వీర విహారమే
తెలిపెదనో హో శౌర్యములే
చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ పరవశము
ఎందుకు నీకీ కలవరము

చిత్రం: మాయాబజార్
రచన: పింగళి
సంగీతం:ఘంటసాల
గానం : ఘంటసాల,లీల


0 comments:

Post a Comment

Share

Widgets