Ads 468x60px

Saturday, August 30, 2008

బృందావనమది అందరిది

Get this widget | Track details | eSnips Social DNA



బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
ఎందుకే రాధ ఈశు నసూయలు అందములందరి ఆనందములే
ఎందుకే రాధ ఈశు నసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే

పిల్లన గ్రోవిని పిలుపులు వింటె ఉల్లము ఝల్లున పొంగదటే
పిల్లన గ్రోవిని పిలుపులు వింటె ఉల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయలలూగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయలలూగదటే

బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే

రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
ఎందుకే రాధ ఈశు నసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
గోవిందుడు అందరి వాడేలే

చిత్రం : మిస్సమ్మ
గానం : ఏ.ఎం.రాజా. పి.సుశీల
రచన : పింగళి
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు

కరుణించు మేరి మాటా



కరుణించు మేరిమాత శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా

పరిశుద్దాత్మ మహిమ వరపుతృగంటి వమ్మ
పృభు ఏసునాధు కృపచే మా భువికి కలిగే రక్ష

కరుణించు మేరిమాత శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా

భువి లేని దారిచేరే పరిహాసమాయే బ్రతుకు
క్షణమైన శాంతిలేదే దినదినము శోధనాయే

కరుణించు మేరిమాత శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా

చిత్రం : మిస్సమ్మ
గానం : పి.లీల
రచన : పింగళి
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
Get this widget | Track details | eSnips Social DNA


ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి (2)
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ
ప్రకృతినెల్ల హాయిగా (2)
తీయగా, మాయగా పరవశింపజేయుచు || ఎచటి నుండి ||

జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ (2)
మనసు మీద హాయిగా (2)
తీయగా, మాయగా మత్తుమందు జల్లుచు || ఎచటి నుండి ||

హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ (2)
ప్రకృతినెల్ల హాయిగా (2)
తీయగా, మాయగా పరవశింపజేయుచు || ఎచటి నుండి ||

చిత్రం : అప్పు చేసి పప్పు కూడు
గానం : ఘంటసాల, పి.లీల
రచన : పింగళి
సంగీతం :సాలూరి రాజేశ్వరరావు

వేషము మార్చెను

వేషము మార్చెను... హోయ్!
భాషను మార్చెను... హోయ్!
మోసము నేర్చెన్....
అసలు తానే మారెను...
అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!
మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!

క్రూరమృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను (2)
హిమాలయముపై జండా పాతెను, (2) ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు!

పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను (2)
వేదికలెక్కెను, వాదము చేసెను, (2) త్యాగమె మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదు, ఆతని బాధ తీరలేదు!

వేషమూ మార్చెను, భాషనూ మార్చెను,
మోసము నేర్చెను, తలలే మార్చెను...
అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!

ఆ...ఆహహాహాహ ఆహాహహా...
ఓ... ఓహొహోహోహో ఓహోహొహో...

చిత్రం : గుండమ్మ కథ
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : పింగళి
సంగీతం : ఘంతసాల

మౌనముగానే మనసు పాడిన

మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే || మౌనముగా ||

కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆ...
కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృతవాహినిని ఓలలాడి మైమరచితిలే || మౌనముగా ||

ముసిముసి నవ్వుల మోము గని నన్నేలుకొంటివని మురిసితిలే
ఆ... ఆ... ఆ...
ముసిముసి నవ్వుల మోము గని నన్నేలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుచు విసరిన వాల్జడ వలపు పాశమని వెదరితినే || మౌనముగా ||

చిత్రం : గుండమ్మ కథ
గానం : ఘంటసాల
రచన : పింగళి
సంగీతం : ఘంటసాల

అలిగిన వేళనే

Get this widget | Track details | eSnips Social DNA


అలిగిన వేళనె చూడాలి గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
రుసరుసలాడే చూపుల లోనే ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి

అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన (2)
తల్లి మేలుకొని దొంగను జూచి ఆ... (2) అల్లరిదేమని అడిగినందుకే
అలిగిన వేళనె చూడాలి గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి

మోహనమురళీగానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా (2)
దృష్టి తగులునని జడిసి యశోద (2) తనను చాటుగా దాచినందుకే
అలిగిన వేళనె చూడాలి

చిత్రం : గుండమ్మ కథ
గానం : పి.సుశీల
రచన : పింగళి
సంగీతం : ఘంటసాల

అలలే పొంగెను




అలలే పొంగెను వేగంగ
అలుపే రాదంది ఈ గంగ
స్నేహం స్వరంలా నాతో వరం లా
బ్రతకాలి తీపి కలలా ఆ...

అలలే పొంగెను వేగంగ
అలుపే రాదంది ఈ గంగ
మొదలంటూ లేధు... తుదికంటూ రాదు...
మిగిలుంది పోనీ మనలా ........


యేనాటి బంధం ... మదిలో ఆనందం...
నుదుటి రాత అనుకో .....
నీ వెంటే నేను .. సరి నా వెంటే నీవు....
విడని తోడు అనుకో ...........
పసి మనసులన్నీ ఈ వేళ.....
ఒకటైనదేమో అది నీ లీలా.........


చీకటి పోని..... వెలుగంతా రానీ....
మనవి ఒక్కటననీ .......
ఓ ఓ ... ఆడిందే ఆట ... మేం పాడిందే పాట.....
ఒట్టేసి అన్న మాట....
సెలయేటి పైన చిన్న వాన.....
విడలేను నిన్ను ఓ క్షణమైనా .
కలిసే ఉంటాము ... కలలే కంటాము ...
కనులన్నీ కలల అలలే ...


అలలే పొంగేను వేగంగ
అలుపే రాదంది ఈ గంగ
దేహం నాదంటు... ప్రాణం మీదంటు...
జననం మీతోనే..... మరణం మీ తోనే...
యే ఏ .........
థ..రత్థ త...రత్థ... ఒహో ఒహో

చిత్రం : సంభవామి యుగే యుగే
గానం : రాంకీ
రచన : కృష్ణ చైతన్య
సంగీతం : అనిల్

పిలచిన బిగువటరా

పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా

ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా



గాలుల తేనెల వాడని మమతల
గాలుల తేనెల వాడని మమతల
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా
పిలచిన బిగువటరా

చిత్రం : మల్లీశ్వరి
గానం : భానుమతి
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

తాధిమి తకదిమి

Bangaru Papa - Tha...


లలలలలలల ఆయీ....
ఆయి ఆయి ఆయీ ఆపదలు గాయి
ఆ! తాధిమి తకధిమి తోల్‌బొమ్మ, దీని తమాష చూడగ కీల్‌బొమ్మ!

తాధిమి తకధిమి తోల్‌బొమ్మ, దీని తమాష చూడగ కీల్‌బొమ్మ!
దీని తమాష... హహహ్హహహహ్హహహ్హ... దీని తమాష చూడగ మాయబొమ్మ!
ఆటమ్మా, పాటమ్మా, జగమంతా బొమ్మాలాటమ్మా! (2)
తళాంగు తకధిమి తోల్‌బొమ్మ, తోం తకతై తకతై... హహ్హహహ్హ...
తోం తకతై తకతై మాయబొమ్మా!
లలలలలలల ఆ....యీ... ఆయి ఆయి ఆయీ ఆపదలు గాయి, ఆపదలు గాయి!

హహ్హహ్హహ... తకతై తకతై మాయబొమ్మ! హుహ్!

నాలుగు దిక్కుల నడిసంద్రమౌ తూగే తేలే తోల్‌బొమ్మ, తూగే తేలే తోల్‌బొమ్మ
ఎవరికెవ్వరూ యేమీ కారు, వివరం తెలుసా, కీల్‌బొమ్మా? ఈ వివరం తెలుసా మాయబొమ్మా!?
తళాంగు తకధిమి తోల్‌బొమ్మ, తోం తకతై తకతై మాయబొమ్మా!

కోపం, తాపం, క్రూరకర్మలు కూడనుకొనియె తోల్‌బొమ్మా, కూడనుకొనియె కీల్‌బొమ్మా!
పాపపు బంతిని పడబోతే పరమాత్ముని నమ్మవె కీల్‌బొమ్మా! (2)
ఆటమ్మా, పాటమ్మా, పరమాత్ముని బొమ్మాలాటమ్మా! (2)
ఆటమ్మా, పాటమ్మా!

చిత్రం : బంగారు పాప
గానం : మాధవపెద్ది సత్యం
రచన :బాలాంత్రపు రజనీకాంతరావు
సంగీతం : అడ్డేపల్లి రామారావు

మనసున మనసై



మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన యేకాంతములో
తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

చెలిమియే కరువై వలపే అరుదై
చెదరిన హృదయమే శిల యై పోగా
నీ వ్యధ తెలిసి నీడగ నిలిచి

తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

11 మనసున ||

చిత్రము : డా.చక్రవర్తి
గానం : ఘంటసాల
రచన : శ్రీ శ్రీ
సంగీతం : సాలూరి రాజేశ్వర్‌రావు

వినిపించని రాగాలే.

Chaduvukunna Ammay...


వినిపించని రాగాలే, కనిపించని అందాలే
అలలై మదినే కలచే, కలలో ఎవరో పిలిచే

II విని II

తొలిచూపులు నాలోనే వెలిగించె దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు

II విని II

వలపే వసంతములా పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలె గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసు
II విని II

వికసించెను నా వయసే, మురిపించు ఈ సొగసె
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే
II విని II


చిత్రం : చదువుకున్న అమ్మాయిలు
గానం : పి.సుశీల
రచన : దాశరధి
సంగీతం : ఎస్. రాజేశ్వర రావు

జల్లంత కవ్వింత

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు
తొలకరి.. మెరుపులా.. ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
వాగులూ వంకలు జలజల చిలిపిగా పిలిచినా
గాలులూ వానలు చిటపట చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో తనువు దాగదూ అదేమి తాకిడో
కొండచాటు కొండమల్లె లేనివంక ముద్దులాడి
వెళ్ళదాయె కళ్ళులేని దేవుడెందుకో మరి
II జల్లంత II

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలిపె నీ మనసులే తెలియని తపనలే తెలుపగ
వానదేవుడె కళ్ళాపి జల్లగ వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్తపాట పుట్టుకొచ్చె ఎవరికొసమో
II జల్లంత II

చిత్రం : గీతాంజలి
గానం : చిత్ర
రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా

Friday, August 29, 2008

రేపంటి రూపం కంటి

రేపంటి రూపం కంటి
పూవింటి చూపుల వంటి
నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
రేపంటి వెలుగే కంటి
పూవింటి దొరనే కంటి
నా కంటి కలలూ కళలూ నీ సొమ్మంటి

నా తోడు నీవైయుంటే
నీ నీడ నేనేనంటే
ఈ జంట కంటే వేరే లేదు లేదంటి - 2
నీ పైన ఆశలు వుంచి ఆపైన కోటలు పెంచి - 2
నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటి
రేపంటి


నే మల్లెపువ్వై విరిసి
నీ నల్లని జడలో వెలసి
నీ చల్లని నవ్వుల కలసి వుంటే చాలంటి - 2
నీ కాలి మువ్వల రవళి
నా భావి మోహన మురళి - 2
ఈ రాగసరళి తరలిపోదాం రమ్మంటి
రేపంటి

నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటి
వేయించి నేనే ఓడిపోనీ పొమ్మంటి
నేనోడి నీవై గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి
రేపంటి

చిత్రం : మంచి-చెడు
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : ఆత్రేయ
సంగీతం : విశ్వనాధన్ - రామ్మూర్తి

Wednesday, August 27, 2008

ఓ రంగయో



ఓ రంగయో పూలరంగయో
ఓరచూపు చాలించి సాగిపోవయో - 2

పొద్దు వాలి పోతున్నదోయి
ఇంత మొద్దు నడక నీకెందుకోయి
II ఓ రంగయో II

పగలనక రేయనక పడుతున్న శ్రమనంత
పరులకొరకు ధారపోయు మూగజీవులు -2

ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి
ఆనందం పొందగలుగు ధన్యజీవులు

II ఓ రంగయో II

కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని
ఈ దీనుల జీవితాలు మారుటెన్నడో - 2
కలవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి
కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే
II ఓ రంగయో II

చిత్రం : వెలుగు నీడలు
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : శ్రీ శ్రీ
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు

మనసున మనసై ..



మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము..
II మనసు II

ఆశలు తీరని ఆవేశములో..
ఆశయాలలో.. ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యము.
అదే స్వర్గము

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీకోసమే కనీరు నింపుటకు -2

నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము

చెలిమియె కరువై వలపే అరుదై
చెదరిన హృదయమే శిలయై పోగా
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము
II మనసున II

చిత్రం : డాక్టర్ చక్రవర్తి
గానం : ఘంటసాల
రచన : శ్రీ శ్రీ
సంగెతం : ఎస్.రాజేశ్వర రావు

ఎటో వెళ్ళిపోయింది మనసు



ఎటో వెళ్ళిపోయింది మనసు..
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలీ.. ఆచూకి తీసి..
కబురియ్యలేవా.. ఏమయిందో!!
II ఎటో వెళ్ళిపోయింది మనసు II

ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్లగాలీ.. ఆ చూకి తీసి.
కబురియ్యలేవా.. ఏమయిందో
ఏమయిందో.. ఏమయిందో

ఏ స్నేహమో.. కావాలనీ
ఇన్నాళ్ళుగా తెలియలేదూ
ఇచ్చేందుకే మనసుందనీ
నాకెవ్వరూ చెప్పలేదూ
చెలిమి చిరునామా.. తెలుసుకోగానే
రెక్కలొచ్చాయో ఏమిటో
II ఎటో వెళ్ళిపోయింది II

కలలన్నవి.. కొలువుండనీ..
కనులుండి ఏం లాభమందీ
ఏ కదలికా.. కనిపించనీ..
శిలలాంటి బ్రతుకెందుకందీ
తోడు ఒకరుంటే.. జీవితం ఎంతో..
వేడుకౌతుందీ అంటూ..
II ఎటో వెళ్ళిపోయింది II

చిత్రం : నిన్నే పెళ్ళాడుతా
గానం : రాజేశ్
రచన : సిరివెన్నెల
సంగీతం : సందీప్ చౌతా

కృష్ణా.. ముకుందా.. మురారీ...




హే .. కృష్ణా.. ముకుందా.. మురారీ...
జయ కృష్ణా ముకుందా మురారీ
జయ గోవింద బృందావిహారీ
II కృష్ణా II

దేవకి పంట వసుదేవు వెంట
యమునను నడిరేయి దాటితివంట
వెలసితివంట నందుని ఇంట
వ్రేపల్లె ఇల్లాయె నంటా - 2
II కృష్ణా II

నీ పలుగాకి పనులకు గోపెమ్మ - 2
కోపించి నిను రోట బంధించెనంట
ఊపున బోయి మాకుల గూలిచి - 2
శాపాలు బాపితివంట
II కృష్ణా II

అమ్మా తమ్ముడు మన్ను తినేనూ
చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా అని చెవి నులిమి యశోద
ఏదన్నా నీ నోరు చూపుమనగా..
చూపితివట నీ నోటను
బాపురే పదునాల్గు
భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు
తాపము నశియించి
జన్మ ధన్యత గాంచెన్
II జయ కృష్ణా II

కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ
కేళీఘటించిన గోప కిశోరా..- 2
కంసాది దానవ గర్వాపహార -2
హింసా విదూరా పాప విదారా
II కృష్ణా II

కస్తూరి తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనంచ కలయం
కంఠేచ ముక్తావళీమ్
గోపస్త్రీ పరివేష్ఠితో
విజయతే గోపాల్ చూడామణీ - 2

లలిత లలిత మురళీస్వరాళీ - 2
పులకిత వనపాలీ గోపాలీ
పులకిత వనపాలీ
విరలీకృత నవరాసకేలీ - 2
వనమాలీ శిఖిపించమౌళి - 2
II కృష్ణా II

చిత్రం : పాండురంగ మహత్మ్యం
గానం : ఘంటసాల
రచన : సముద్రాల జూనియర్
సంగీతం : టి.వి.రాజు

రవివర్మకే అందని ...



రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య రాగానివో

II రవి వర్మకే II

ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
ఎ యొగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావాలో అనురాగ యోగాలై
ఆ.. ఆ.
నీ పాటనే పాడనీ
II రవి వర్మకే II

ఏ గగనమో కురులు జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ .. ఆ..
కదలాడనీ పాడనీ
II రవి వర్మకే II

చిత్రం : రావణుడే రాముడైతే
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
రచన : వేటూరి
సంగీతం : జి.కె.వెంకటేశ్

Sunday, August 24, 2008

ఏ దివిలో విరిసిన

Ee Divilo Virisina...


ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరసిన ప్రేమగీతమో !
నా మదిలో నీవై నిండిపోయెనే..

నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వుల నవ్యతారలై
నా కన్నుల వెన్నెల
కాంతి నింపెనే..

II ఏ దివిలో II

పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!

II ఏ దివిలో II

నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!

II ఏ దివిలో II

చిత్రం : కన్నెవయసు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : దాశరధి
సంగీతం : సత్యం

Saturday, August 23, 2008

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది..



ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను
ఎన్నెన్నో

పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి
నిన్నే చూసిన వేల నిండును చెలిమి
ఓహో హో హో ..నువ్వు కడలివైతే
నే నదిగ మారి చిందులు వేసి వేసి
నిన్ను చేరనా. చేరనా.. చేరనా!
ఎన్నెన్నో

విరిసిన కుసుమము నీవై కురిపించేవు
జాబిలి నేనై నిన్ను పెనవేసేను
ఓహో హో హో మేఘము నీవై నెమలిని నేనై
ఆడనా.. పాడనా.. ఆడనా !
ఎన్నెన్నో

కోటి జన్మలకైనా కోరేదొకటే
నాలో సగమై ఎపుడూ .. నీవుండాలి
ఓహో హో హో నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా
ఈ పొందు ఎల్ల వేళలందు
ఉండనీ. ఉండనీ.. ఉండనీ..
ఎన్నెన్నో

చిత్రం : పూజ
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం
రచన : దాశరథి
సంగీతం : రాజన్-నాగేంద్ర

నాలో ఊహలకు...



నాలో ఊహలకు నాలో ఊసులకు
అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు నాలో కాంతులకు
నడకలు నేర్పావూ
పరుగులుగా.. పరుగులుగా
అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ!
II నాలో ఊహలకు II

ఆ.. ఆ... ఆ..
కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులో నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే
ప్రళయమవుతోందిలా!
II నాలో ఊహలకు II

మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ. ఆవిరౌతూ..
అంతమవ్వాలనే..
II నాలో ఊహలకు II

చిత్రం : చందమామ
గానం, ఆశా భోన్‌స్లే, కె.ఎం.రాధాకృష్ణన్
రచాన్ : అనంత శ్రీరాం
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్.



ప్రియతమా నను పలకరించు ప్రణయమా..
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..
II ప్రియతమా II

ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..
II ప్రియతమా II

నింగి వీణకేమో నేల పాటలొచ్చె
తెలుగు జిలుగు అన్నీ కలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ
వలపె తెలిపే నాలో విరిసి
మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా
నరుడే .. వరుడై నాలో మెరిసే
తారలమ్మకన్నా చీరకట్టుకున్న
పడుచుతనము నాలో మురిసే
మబ్బులనీ వీడిపోయి
కలిసే నయనం తెలిసే హృదయం
తారలన్నీ దాటగానే
తగిలే గగనం.. రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడక గడువే గడిచి పిలిచే
II ప్రియతమా II

ప్రాణవాయువులో వేణువూదిపోయే
శ్రుతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంత ఎంకి పాటలాయే
మనసు మమత అన్నీ కలిపి
వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే
బహుశా మనసా వాచా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె
కులము గుణము అన్నీ కుదిరి
నీవులేని నింగిలోన
వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద
బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే
II ప్రియతమా II

చిత్రం : జగదేకవీరుడు. అతిలోకసుందరి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి బృందం
రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా

ఎదుట నిలిచింది చూడు...

ఎదుట నిలిచింది చూడు..
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు..
చినుకంటే చిన్నదేమో
మైమరచిపోయా మాయలో..
ప్రాణమంత మీటుతుంటే .. వానవీణలా!
II ఎదుట నిలిచింది చూడు..II

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో .. కాదో.. అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా

నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక..
నీదో.. కాదో.. రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ
వరం లాంటి శాపమేదో సొంతమైందిలా
II ఎదుట నిలిచింది చూడు..II

చిత్రం : వాన
గానం : కార్తీక్
రచన : సిరివెన్నెల
సంగీతం : కమలాకర్

గుర్తుకొస్తున్నాయి..

గుర్తుకొస్తున్నాయి .. గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ మూలనో
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి .. గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమతలో
మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి...

మొదట చూసిన టూరింగ్ సినిమా
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పళ్ళకై పట్టిన కుస్తీ
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలో బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగచాటుగా కాల్చిన బీడి
సుబ్బుగాడిపై చెప్పిన చాడీ
మోట బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం
గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి

మొదటిసారిగా గీసిన మీసం
మెదట వేసిన ద్రౌపది వేషం
నెలపరీక్షలో వచ్చిన సున్న
గోడ కుర్చీ వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరు సాయిబు పూసిన సెంటు
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనము
మొదటి ప్రేమలో తియ్యందనము

చిత్రం : నా ఆటోగ్రాఫ్
గానం : కె. కె.
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి

Gurtukostunnayi......

Friday, August 8, 2008

జాబిల్లి కోసం ఆకాశమల్లే..




జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను చేరలేక మనసూరుకోక
పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకెక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా

ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలి ఉర్రూతలూగి
మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి

జాబిలి కోసం

నీ పేరొక జపమైనది
నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది
ఎన్నళ్ళయినా

ఉండి లేకా ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నా నీడ నాదే
నాకున్నదంతా నీవే నీవే

జాబిల్లి కోసం ఆకాశమల్లే
వేచాను నీ రాకకై

చిత్రం : మంచిమనసులు
గానం :ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : వేటూరి
సంగీతం: ఇళయరాజా

స్వప్నవేణువేదో..




స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైనా రెండు గుండెలా ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేతా పూల బాసలూ
కాలేవా చేతి రాతలు

స్వప్నవేణువేదో

నీవే ప్రాణం.. నీవే సర్వం..
నీకై చేశా వెన్నెల జాగారం
ప్రేమా నేనూ.. రేయీ పగలూ..
హారాల్లల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలు అష్ట దిక్కులు
నిన్ను చూచు వేళా
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాలా
కాలాలే ఆగిపోయినా.. గానాలే మూగబోవునా..

నాలొ మోహం.. రేగే దాహం..
దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం.. గెలిచే బంధం
రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా
మలుచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం
వాలేదే ప్రణయ గోపురం

ll స్వప్నవేణువేదో ll

చిత్రం : రావోయి చందమామ
గానం :ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. చిత్ర
రచన: వేటూరి
సంగీతం : మణిశర్మ

నా మది నిన్ను పిలిచింది..

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...ప్రియతమా...
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను

తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను

వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

చిత్రం : అరాధన
గానం : మహమ్మద్ రఫీ
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం :సాలూరి హనుమంతరావు

లాహిరి లాహిరి లాహిరిలో...



లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో! జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగెనుగా

తారాచంద్రుల విలాసములతో
విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో
తారాచంద్రుల విలాసములతో
విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే
పిల్ల వాయువుల లాలనలో

ll లాహిరి ll

అలల ఊపులో తీయని తలపులు
చెలరేగే ఈ కలకలలో మిలమిలలో
అలల ఊపులో తీయని తలుపులు
చెలరేగే ఈ కలకలలో
మైమరపించే ప్రేమనౌకలో
హాయిగ చేసే విహరణలో

ll లాహిరి ll

రసమయ జగమును రాసక్రీడకు
ఉసిగొలిపే ఈ మధురిమలో మధురిమలో
రసమయ జగమును రాసక్రీడకు
ఉసిగొలిపే ఈ మధురిమలో
ఎల్లరి మనములు ఝల్లన జేసే
చల్లని దేవుని అల్లరిలో

ll లాహిరి ll

చిత్రం : మాయాబజార్
గానం : ఘంటసాల, పి.లీల
రచన: పింగళి
సంగీతం: ఘంటసాల

గలగల పారుతున్న గోదారిలా...




గలగల పారుతున్న గోదారిలా
జలజల జారుతుంటే కన్నీరలా

నాకోసమై నువ్వలా.. కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నదీ.. హాయిలా !

ll గల గల ll

వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నాపైనా
మిన్నేటి దారులా వేచి.. నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవేలా చేరుతావిలా నాలోనా
ఊ.. ఓ.. ఈ అల్లరి
ఊ...ఓ ..బాగున్నదీ

ll గల గల ll

చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడీ హాయిగౌన్నదీ ఏమైనా
ఊ.. ఓ. ఈ లాహిరి
ఊ.. ఓ .. నే ప్రేమని

ll గల గల ll

చిత్రం: పోకిరి
గానం :నిహాల్
రచన: కందికొండ
సంగీతం: మణిశర్మ

తెలిసిందిలే .. తెలిసిందిలే..



తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే

చలిగాలిరమ్మంటు పిలిచిందిలే
చెలి చూపు నీ పైన నిలిచిందిలే

ఏముందిలే ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము
ముందుందిలే నీ ముందుందిలే
ll తెలిసిందిలే ll

వరహల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
ఆ...

అవునందునా కాదందునా
అయ్యారే విధి లీల
అనుకొందునా అనుకొందునా

ll తెలిసిందిలే ll

సొగసైన కనులేమో నాకున్నవి
చురుకైన మనసేమో నీకున్నది
కనులేమిటో ఈ కథ లేమిటో
శ్రుతిమించి రాగన పడనున్నది పడుతున్నది
ll తెలిసిందిలే ll

చిత్రం : రాముడు భీముడు
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : డా.సి.నారాయణ రెడ్డి
సంగీతం: పెండ్యాల నాగేశ్వర్‌రావు

నా హృదయంలో నిదురించే చెలి






నా హృదయంలో నిదురించే చెలీ !
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై, వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
ll నా హృదయంలో ll

నీ కన్నులలోన దాగెనులే వెన్నెలసొనా
కన్నులలోనా దాగెనులే వెన్నెలసోనా
చకోరమై నిను వరించి
అనుసరించినావే కలవరించినావే
ll నా హృదయంలో ll

నా గానములో నీవే
ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించరావే
నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీద వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే
నిదుర కాచినానే

ll నా హృదయములో ll

చిత్రం : ఆరాధన
గానం : ఘంటసాల
రచన: శ్రీ శ్రీ
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు

గుండెల్లో ఏముందో ...



గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం
నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం'
నీ అలికిడి నినకుంటే
కలవరమో తొలివరమో
తెలియని తరుణమిది
ll గుండెల్లో ll
మనసా మనసా మనాసా
ఓ మనసా..!

పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది
నినిలా హ్చూసి పయనించి
వెన్నెలే చిన్నబోతోంది
కన్నులే దాటి కలలన్నీ
ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో. ఇదంతా..నిజంగా కలలాగే ఉంది.
ll గుండెల్లో ll

ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది
ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది
పరిమళం వెంట పయనించే
పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించీ
పరిచయం తోడు కోరింది
దూరం తలొంచే ముహూర్తం
ఇంకెప్పుడొస్తుంది!
ll గుండెల్లో ll

మనసా.. మనసా.. మనసా
ఓ మనసా..!

చిత్రం : మన్మధుడు
గానం: వేణు, సుమంగళీ
రచన: సిరివెన్నెల
సంగీతం :దేవిశ్రీ ప్రసాద్

నిలువుమా! నిలువుమా! నీలవేణి...

నిలువుమా!
నిలువుమా ! నిలువుమా! నీలవేణీ
నీ కనుల నీలినీడ
నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ.

అడుగడుగున ఆడే లే నడుము సొంపులా
తడబడే అడుగుల నటనల మురిపింపులా

సడిసేయక ఊరించే...
సడిసేయక ఊరించే వయ్యరపు ఒంపుల
కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపులా
నడచిరా నడచిరా నాగవేణీ
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ

అద్దములో నీ చెలువు తిలకింపకు ప్రేయసీ
అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి

నా ఊర్వశి రావే రావేయని పిలువనా
ఆ సుందరి నెరనీకు నీ గోటికి సమమౌనా
రా చెలీ నినుమదీ దాచుకోనీ
నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ.

చిత్రం : అమరశిల్పి జక్కన్న
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : ఎస్.రాజేశ్వర్‌రావు
Share

Widgets