Ads 468x60px

Wednesday, August 15, 2007

జయ జయ ప్రియ భారతి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ సశ్యామల సు శ్యామ చలాంచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!


జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!


రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి

జన్మభూమి

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిని
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగబలమో
జనియించినాడ ఏ స్వర్గఖండమున
ఏమంచి పూవులన్ ప్రేమించినావో
నిను మోసే ఈ తల్లి కనక గర్భమున
లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేరురా మనవంటి పౌరులింకెందు
సూర్యుని వెలుతురుల్ సోకునందాక
ఓడల జెండాలు ఆడునందాక.
అందాకగల ఈ అనంత భూతలిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ తెలుగు బాలగీతములు
పాడరా నీ వీర భావ భారతము.
తమ తపస్సులు ఋషులు ధారవోయంగ
శౌర్యహారము రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవిప్రభువు లల్ల్లంగ
రా దుగ్ధము భక్తరత్నముల్ పిదుక.
దిక్కుల కెగదన్ను తేజమ్మువెలుగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగ
జగముల నూగించు మగతనం బెగయ
సౌందర్యమెగ బోయు సాహిత్యమలర
వెలిగినదీ దివ్యవిశ్వంబు పుత్ర
దీవించె నీ పుణ్యదేశంబు పుత్ర
పొలముల రత్నాలు మొలిచెరా యిచట
వార్ధిలో ముత్యాలు పండేరా యిచట.
పృధివి దివ్యౌషధుల్ పిదికెరా మనకు
కానల కస్తూరి కాచెరా మనకు
అవమానమేలరా? అనుమానమేల?
భారతీయుడనంచు భక్తితో పాడ.


రచన : రాయప్రోలు సుబ్బారావు

Monday, August 13, 2007

పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా

మనలోని ప్రాణం అమ్మ
మనదైన రూపం అమ్మ
యెనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మా
నా ఆలి అమ్మ గా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా

ఆ..
పొత్తిల్లొ ఎదిగే బాబు
నా వొళ్ళో వొదిగె బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పట్టేవాడు
నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్ళు సాకనా చల్లగ చల్లగా
ఎదిగీ ఎదగని ఓ పసి కూనా
ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో
బజ్జో లాలిజో

పలికే పదమే వినకా కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగీ ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో..


చిత్రం:నాని


PEDAVE PALIKE03.m...

Tuesday, July 24, 2007

ఓ ప్రియా!!!




కొన్ని జ్ఞాపకాలు తెరమరుగు కావు
కొన్ని అనుభూతులు నిదురే పొనీవు

కళ్ళు మూసి పడుకునే వేళ
కళ్ళ ముందు ప్రత్యక్షమవుతావు

నువ్వు పరిచయమయ్యాక యెన్ని నిదురలేని
రాత్రులు గడిపానో నా అలసిన కళ్ళకు తెలుసు

అసలు నువ్వంటే నాకు యెందుకింత ఇష్టం
ఎంత ఆలోచించినా సమాధానం లేని
ప్రశ్నగానే ఉంది ...........

నీ పెదవులపై చిరునవ్వుని మళ్ళీ మళ్ళీ
చూడాలని నువ్వు పిలవగానే వస్తాను
పరుగు పరుగున...

నీ మధుర స్పర్శకై నా ఊహల రెక్కలపై
ఊరేగుతూ నీ చెంత వాలిపోతాను

మన మధ్య ఉన్నది ఆకర్శన అనుకుంటే
అది నాకు దురదృష్టం

నాలాగే నీ హృదయం స్పందిస్తే
అది నా అదృష్టం

రచన : శ్రీరామ్
poet@yahoo.com
Share

Widgets