Ads 468x60px

Saturday, April 3, 2010

తెలుగు జాతి మనది




తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ నాది
రాయలసీమ నాది
సర్కారు నాది
నెల్లూరు నాది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా
మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న
మన భాష తెలుగు భాషన్న

వచ్చిండన్న వచ్చారన్న
వచ్చిండన్న వచ్చారన్న
వరాల తెలుగు ఒకటేనన్న

మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది
నాగార్జునసాగరమేవరిది
మూడు కొండ్రలూ కలిసి దున్నిన
ముక్కరు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలే ఐదుకోట్ల తెలుగువారిది.
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్‌కి జై
గాంధి నెహ్రూల పిలుపు నందుకొని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం వందేమాతరం
స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర

దేశభక్తితో తెలుగువారికి ధిటే లేదనిపించాము
ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ మనది
రాయలసీమ మనది
సర్కారు మనది
నెల్లూరు మనది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

చిత్రం :తల్లా! పెళ్లామా!
గానం : ఘంటసాల
రచన : సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు

అర్రే ఏమైంది....

అరె ఏమైందీ
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కల కాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతని నిద్దురలేపింది
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ

నింగి వంగి నేల తోటి నేస్తమేదొ కోరింది
నేల పొంగి నింగి కోసం పూల దోసెలిచ్చింది
పూలు నేను చూడలేను
పూజలేమి చేయలేను
నేలపైన కాళ్ళు వేరు
నింగి వైపు చూపు వేరు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావూ


ఈడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోనా పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి రాసాడో
చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు
మనిషవుతాడూ

అరె ఏమైందై ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కల కాని కల ఏదో కల్లెదుతే నిలిచింది
అది నీలో మమతని నిద్దురలేపింది

చిత్రం : ఆరాధన
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
రచన :వేటూరి
సంగీతం : ఇళయరాజా

ఎ కులమూ నీదంటే ..

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కుల్కమే లెమ్మంది

ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది
ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కుల్కమే లెమ్మంది

ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు... ఇన్ని మాటలు

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

***

చిత్రం: సప్తపది
గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్ జానకి
సంగీతం: కె.వి.మహదేవన్
రచన: వేటూరి

కమ్మనీ ఈ ప్రేమలేఖనే



కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఉహాలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలొ

ఒహోకమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే


గుండెల్లో గాయమేదొ చల్లంగా మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్ఛమైనది


మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా

శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమా దేవి లాలి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా

చిత్రం : గుణ
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.పి.శైలజ
సంగీతం : ఇళయరాజా

కొమ్మ కొమ్మకో సన్నాయి



కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం

మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు
పసితనాల తొలివేకువూలో ముసురుకున్న మబ్బులు చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం

కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం

కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనంఅందుకే ధ్యానం అందుకే మౌనం

కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి

చిత్రం : గోరింటాకు
గానం : పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహాదేవన్
Share

Widgets