Ads 468x60px

Saturday, December 10, 2011

నిత్యం ఏకాంత క్షణమే అడిగా
నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్ధం లేనట్టి లోకం అడిగా
రక్త తరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా
అనుబంధాలను ఆయుషు అడిగా
ఆనందాక్షుల ఆశీస్సడిగా
మది నొప్పించై మాటలు అడిగా
యెద మెప్పించే యవ్వనం అడిగా
పిడుగులు రాల్చని మేఘం అడిగా
జ్వలించు నూరేళ్ల పరువం అడిగా
వరించు తరించు వలపే అడిగా
ప్రాణతుల్యమౌ బంధం అడిగా
పచ్చికలో మంచి ముత్యాలడిగా
పువ్వుల ఒడిలో పడకే అడిగా
తను ఓదార్చే ఓర్పుని అడిగా
తలనే నిమిరే వేళ్ళని అడిగా
నెమలి ఆట కి పదమే అడిగా
కోయిల పాటకు పల్లవి అడిగా
గదిలో గుక్కెడు నీళ్లే అడిగా
మదిలో జానెడు చోటే అడిగా
మచ్చంటూ లేని జాబిలినడిగా
నక్షత్రానికి నట్టింటినడిగా
దుఖం వధించు అస్త్రం అడిగా
అస్త్రం ఫలించు యోగం అడిగా
చీకటి ఊడ్చే చీపురు అడిగా
పూవులకు నూరేళ్లామని అడిగా
మానవ జాతికి ఒక నీతిని అడిగా
వెతల రాత్రికే వేకువ అడిగా
ఒకటే వర్ణం సబబని అడిగా
ఒకటే అనురాగం గుడిలో అడిగా
వాలని పొద్దుల నెలవంకడిగా
ప్రాణముండగా స్వరం అడిగా
న్యాయం ధర్మం ఇలలో అడిగా
యెద రగిలించే కవితే అడిగా
కన్నెలెరుగని కన్నే అడిగా
క్షామం నశించు కాలం అడిగా
చుక్కలు దాటే స్వతంత్రమడిగా
దిక్కులు దాటే విహంగమడిగా
తొలకరి మెరుపుల నిలకడనడిగా
యెద మావిలో ఏరుని అడిగా
మూగ మాటకు చరణం అడిగా
మౌన బాష వ్యాకరణం అడిగా
శాంతిని పెంచే సంపద అడిగా
వస్తే వెల్లని వసంతమడిగా
యేడేడు జనమలకు ఒక తోడడిగా
ఏనాడు వాడని చిరునవ్వడిగా
ముసిరే మంచుల ముత్యాలడిగా
ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా
ఆశల మెరుపుల జగమే అడిగా
అంధకారమా పొమ్మని అడిగా
అందరి యెదలో హరివిల్లడిగా
మరుగై పోని మమతను అడిగా
కరువై పోని సమతను అడిగా
రాయలంటి కవిరాజుని అడిగా
బమ్మెర పోతన భక్తిని అడిగా
భారతి మెచ్చిన తెలుగే అడిగా
పాశుపతాస్త్రం నరుడై అడిగా
మోహన కృష్ణుని మురళే అడిగా
మధుర మీనాక్షి చిలకే అడిగా
ఉన్నది చెప్పే ధైర్యం అడిగా
ఒడ్డెంకించే పందెం అడిగా
మల్లెలు పూచే వలపే అడిగా
మంచిని పెంచే మంచే అడిగా
పంజా విసిరే దమ్మే అడిగా
పిడుగును పట్టే ఒడుపే అడిగా
: ఉన్నది చెపె దైర్యమదిగ
ద్రోహం అణిచే సత్తా అడిగా
చస్తే మిగిలే చరిత్ర అడిగా
విధిని జయించే ఒరిమినడిగా
ఓరిమిలో ఒక కూరిమినడిగా
సహనానికి హద్దేదని అడిగా
దహనానికి అంతేదని అడిగా
కాలం వేగం కాళ్లకు అడిగా
చిన్నా చితకా జగడాలడిగా
తీయగ ఉండే గాయం అడిగా
గాయానికి ఒక గేయం అడిగా
పొద్దే వాలని ప్రాయం అడిగా
ఒడిలో శిశువై చనుబాలడిగా
కంటికి రెప్పగ తల్లిని అడిగా
ఐదో ఏట బడినే అడిగా
ఆరో వేలుగ పెన్నే అడిగా
ఖరీదు కట్టని చదువే అడిగా
ఎన్నని అడగను దొరకనివి
ఎన్నని అడగను జరగనివి
ఎవరిని అడగను నా గతిని
కళ్లకు లక్ష్యం కలలంటూ
కాళ్లకు గమ్యం కాదంటూ
భగవద్గీత వాక్యం వింటూ
మరణం మరణం శరణం అంటూ

చిత్రం: అద్భుతం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

1 comments:

  1. అద్భుతమైన భావం గానం.

    ReplyDelete

Share

Widgets