Ads 468x60px

Monday, March 5, 2007

రేపల్లియ ఎద

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి మొహనమురళి
ఇదేనా ఆ మురళి

రేపల్లియ||

కాళింది మడుగున కాళియుని పడగల
ఆబాల గోపాల మాబాల గోపాలుని
కాళింది మడుగున కాళియుని పడగల
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి

రేపల్లియ||

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవన రాగమై బృందావన గీతమయి
జీవన రాగమై బృందావన గీతమయి
కన్నుల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
వేణుగానలోలుని మురిపించిన రవళి నటనల సరళి ఆ నందనమురళి
ఇదేనా ఆ మురలి మువ్వల మురళి ఇదేనా ఆ మురలి

మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆ రాధ నా గీతి పలికించి
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆ రాధ నా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై..ఆ
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా..ఇదేనా ఆ మురళి

రేపల్లియ||
చిత్రం: సప్తపది
రచన: వేతూరి
గానం : జానకి
సంగీతం:కె.వి.మహదేవన్

పెళ్ళీ చేసుకొని ఇల్లు చూసుకొని

ఓ భావి భారత భాగ్య విధాతలార యువతీ యువకులార
స్వానుభవమున చాటు నా సందేశమిదే వరెవహ్


పెళ్ళీ చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాపురముండాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్
కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖ పడగా
ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్
ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్
పెళ్ళి||

నవ భావముల నవ రాగముల నవ జీవనమె నడపాలోయ్
నవ భావముల నవ రాగముల నవ జీవనమె నడపాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్

పెళ్ళి||

చిత్రం: పెళ్ళి చేసి చూడు
రచన: పింగళి
గానం : ఘంటసాల
సంగీతం: ఘంటసాల

మాటేరాని చిన్నదాని

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా

మాటేరాని||

వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంతచేరి ఆదమరచి ప్రేమను కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్టపగలె నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మొహనరాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే...

మాటేరాని||

ముద్దబంతి లేతనవ్వులే చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లు లోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపే నా చెలి పిలిపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసిముసి తలపులు కరగని వలపులు
నా చెలి సొగసులు అన్ని ఇక నావే...

మాటేరాని||


చిత్రం : ఓ పాపా లాలి
గానం : బాలసుబ్రమణ్యం
రచన :వేతూరి
సంగీతం:ఇళయరాజా

ఎటో వెళ్ళిపొయింది

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటో వేళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయింది వయసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో

ఎటో వెళ్ళిపోయింది మనసు
ఎటెళ్లిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో..

ఏ స్నేహమొ కావాలని ఇన్నాళ్ళుగ తెలియలేదు
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదు
చెలిమి చిరునామ తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏవిటో..

ఎటో వెళ్ళిపోయింది||

కలలన్నవే కొలువుండని కనులుండి ఏం లాభముంది
ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది
తోడు ఒకరుంటె జీవితం ఎంతో వేడుకౌతుంది అంటు..

ఎటో వెళ్ళిపొయింది||

చిత్రం : నిన్నే పెళ్ళాడుతా
రచన : సీతారామ శాస్త్రి
గానం : రాజేష్
సంగీతం: సందీప్ చౌతా

మౌనం గానే

మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలవగనే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది
తెలుసుకుంటె సత్యమిది
తలచుకొంటె సాధ్యమిది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలీ బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగ నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్నే దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లొ గుడికట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

చిత్రం: నా ఆటోగ్రాఫ్
రచన: చంద్రబోస్
గానం : చిత్ర



powered by ODEO


Share

Widgets