Ads 468x60px

Monday, March 5, 2007

మౌనం గానే

మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలవగనే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది
తెలుసుకుంటె సత్యమిది
తలచుకొంటె సాధ్యమిది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలీ బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగ నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్నే దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లొ గుడికట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

చిత్రం: నా ఆటోగ్రాఫ్
రచన: చంద్రబోస్
గానం : చిత్ర



powered by ODEO


0 comments:

Post a Comment

Share

Widgets