Ads 468x60px

Monday, September 7, 2009

సిరులొలికించే చిన్ని నవ్వులే

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు

జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ మంచి జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ

నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ
లోలో ఆశలన్ని నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని చందమామ నువ్వనీ
ఊరువాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ
కలకాలము కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ

వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్న ప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైన

చిత్రం : యమలీల
గానం : చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : సిరివెన్నెల

కథగా కల్పనగా

కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో

మోసం తెలియని లోకం మనదీ
తీయగ సాగే రాగం మనదీ
ఎందుకు కలిపాడో..బొమ్మలను నడిపే వాడెవడో
నీకూ నాకూ సరిజోడని..కలలోనైనా విడరాదనీ

కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో

కారడవులలో కనిపించావూ
నా మనసేమో కదిలించావూ
గుడిలో పూజారై నా హౄదయం నీకై పరిచాను
ఈ అనుబంధం ఏ జన్మదీ..ఉంటే చాలు నీ సన్నిధి

కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో

చిత్రం : వసంత కోకిల
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : ఇళయరాజా

వేణువై వచ్చాను

వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి

ఏడుకొండలకైనా అండ తానొక్కడే
ఏడు జన్మల తీపి ఈ బంధమే -2
నీ కంటిలో నలక లో వెలుగు నేననక
నేను నేననుకుంటే ఎద చీకటి హరీ హరీ.....హరీ
రాయినై ఉన్నాను ఏనాటికీ రామ పాదము రాక ఏనాటికీ..

వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయె
నీరు నిప్పుగ మారె నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు
పుట్టిల్లు చేరెను మట్టి ప్రణాలు హరీ హరీ హరీ
రెప్పనై ఉన్నాను నీ కంటికి పాపనై వస్తాను నీ ఇంటికి...

వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి

చిత్రం : మాతృదేవో భావ
గానం : చిత్ర
రచన : వేటూరి
సంగీతం :కీరవాణి

Thursday, September 3, 2009

నీలాల కన్నుల్లో

Get this widget | Track details | eSnips Social DNA

నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండార రావే
నెలవంక చలువ్వల్లు వెదజల్లగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండార రావే

చిరుగాలి బాల పాడింది జోల పాడింది జోల
చిగురాకు మనసు కనుపాపలందు ఎగపోసేనమ్మ ఏవేవో కలలు
కలలని కళలేనో విరబూయగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండార రావే

నిదురమ్మ ఒడిలో ఒరిగింది రేయి ఉగింది లాలి
గగనాని చూచి ఒక కన్ను దోయి వినిపించమంది ఎనెన్నో కథలు
కథ చెప్పి మురిపించి మరపించగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండార రావే
నెలవంక చలువ్వల్లు వెదజల్లగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే

చిత్రం : నాటకాల రాయుడు
గానం : పి.సుశీల
రచన :ఆత్రేయ
సంగీతం : జి.కె.వెంకటేష్

సిగలో అవి విరులో

సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో..

ఎదుట నా ఎదుటా ఏవో సోయగాల మాలికలు..
ఎదుట నా ఎదుటా ఏవో సోయగాల మాలికలు..
మదిలోనా గదిలోనా... మదిలోనా గదిలోనా...
మత్తిలిన కొత్త కోరికలూ...నిలువనీవు నా తలపులు..
మరీ మరీ ప్రియా..ప్రియా...
నిలువనీవు నా తలపులూ.. నీ కనుల ఆ పిలుపులూ..

సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో..

జరిగి ఇటు ఒరిగీ... పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు ఒరిగీ... పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అర విడినా.. చిగురాకు పెదవుల మరిగీ..
చిరునవ్వుల అర విడినా.. చిగురాకు పెదవుల మరిగీ..
మరలి రాలేవు నా చూపులూ.. మరీ మరీ ప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులూ.. మధువుకై మెదలు తుమ్మెదలూ...

సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో..

చిత్రం : మేఘసందేశం
గానం : జేసుదాస్
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం :రమేష్ నాయుడు
Share

Widgets