Ads 468x60px

Monday, September 7, 2009

సిరులొలికించే చిన్ని నవ్వులే



సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు


జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ మంచి జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ


నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ
లోలో ఆశలన్ని నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని చందమామ నువ్వనీ
ఊరువాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ
కలకాలము కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ



వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్న ప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైన


చిత్రం : యమలీల
గానం : చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : సిరివెన్నెల

0 comments:

Post a Comment

Share

Widgets