Ads 468x60px

Monday, October 17, 2011

రాసాను ప్రేమలేఖలెన్నో




రాసాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె
దివిలోన తారకలాయె నీ నవ్వులే
రాసాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె
దివిలోన తారకలాయె
నీ నవ్వులే

కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ
కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ
నా మనసు నిన్నే తలచి ఓ యన్నదీ
మురిపించే ముద్దు గులాబి మొగ్గేసిందీ
చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది

రాసాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె
దివిలోన తారకలాయె నీ నవ్వులే

నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో
నీ చల్లని రూపం ఉందీ నా కనులలో
నాలోని సోయగమంతా విరబూసెలే
నాలోని సోయగమంతా విరబూసెలే
మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే

రాసాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో
భువిలోన మల్లియలాయె
దివిలోన తారకలాయె నీ నవ్వులే

అందాల పయ్యెద నేనై ఆటాడనా
కురులందు కుసుమం నేనై చెలరేగనా
నీ చేతుల వీణని నేనై పాట పాడనా
నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా

రాసాను ప్రేమలేఖలెన్నో
దాచాను ఆశలన్ని నీలో....

చిత్రం - శ్రీదేవి
గానం - బాలు, జానకి
సంగీతం - జి.కె. వెంకటేశ్
రచన - దాశరధి.

యమునా తీరమున సంధ్య సమయమున



యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా!

బాస చేసి రావేల మదన గోపాలా..!
బాస చేసి రావేల మదన గోపాలా..!
నీవు లేని జీవితము తావి లేని పూవు కదా

యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా!
యమునా తీరమునా.....

పూపొదలో దాగనేల పో పోరా సామి
ఇంతసేపు ఏ ఇంతికి వంత పాడినావో
దాని చెంతకె పోరాదో

రానంత సేపు విరహమా
నేను రాగానే కలహమా
రాగానే కలహమా
నీ మేన సరసాల చిన్నెలు
అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ
ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ
దోబూచులాడితి నీతోనే
ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు
ఈ కొమ్మ గురుతులు కాబోలు
నేను నమ్మనులే
నేను నమ్మనులే నీ మాటలు
అవి కమ్మని పన్నీటి మూటలు
నా మాట నమ్మవే రాధికా
ఈ మాధవుడు నీ వాడే గా
రాధికా.....మాధవా.........

చిత్రం: జయభేరి
గాత్రం : ఘంటసాల,సుశీల
సంగీతం : పెండ్యాల
రచన : ఆరుద్ర

మాటే మంత్రము మనసే బంధము




మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం

నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా పువ్వు తావిగా
సమ్యోగాల సంగీతాలు విరిసే వేళలో

నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎద నా కోవెలా యెదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

చిత్రం: సీతాకోకచిలుక
గానం: బాలు , శైలజ
సంగీతం: ఇళయరాజా

Thursday, October 13, 2011

మనసే జతగా పాడిందిలే

మనసే జతగా...



మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో ..
ఆ..ఆఆ.అ

మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో .. ఓఓఓ..ఓ

ఈ గిలిగింత.. సరికొత్త వింత ఏమన్నదీ ?
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ

ఏ..ఏ. హె.హే
ఈ గిలిగింత.. సరికొత్త వింత ఏమన్నదీ ?
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ

అందుకే ఓ చెలీ .. అందుకో కౌగిలీ .. ఓ చెలీ ..

ఏ.. హె హే...
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో .. ఓఓఓ..ఓ

ఓ..ఓఓ ఓ..
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో .. ఓఓఓ..ఓ

నింగిని తాకే నీలాల మేఘం ఏమన్నదీ ?
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ
ఆ..ఓ..హో ..
నింగిని తాకే నీలాల మేఘం ఏమన్నదీ ?
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ

ఓ.. అందుకే ఓ ప్రియా .. అందుకో పయ్యెద .. ఓ ప్రియా

ఏ.. హె హే...
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో !

ఓ..ఓఓ ఓ..
మనసే జతగా పాడిందిలే .. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో!

చిత్రం: నోము
గానం : బాలు, సుశీల
సంగీతం: సత్యం
రచన: సి. నారాయణ రెడ్డి

Wednesday, October 12, 2011

కాలమిలా ఆగిపోనీ ... కల నిజమై సాగిపోనీ

Get this widget | Track details | eSnips Social DNA


కాలమిలా ఆగిపోనీ ... కల నిజమై సాగిపోనీ
అన్నీ మరిచి ఈ నిమిషంలో నీ ఓడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ ... కల నిజమై సాగిపోనీ
అన్నీ మరిచి ఈ నిమిషంలో నీ ఓడిలోనే నిదురపోనీ

తోలిసంజె మలిసంజె వేళ ... నా చెంత చెలి ఉన్న వేళ
తొలిసంజె మలిసంజె వేళ ... నా చెంత చెలి ఉన్న వేళ
చిరుగాలి చెలరేగు వేళ .. నా మనిషి తోడున్న వేళ
అనువైన వేళ ... ఈ శుభ వేళ
బ్రతుకే వెన్నెల వేళా ... వేళా ... వేళా

కాలమిలా ఆగిపోనీ ... కల నిజమై సాగిపోనీ
అన్నీ మరిచి ...
ఆ ఆ ఆ
ఈ నిమిషంలో
ఆ ఆ ఆ
నీ ఓడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ

సిరిదివ్వేలో వెలుగులాగా ... నీ చూపులో నిలిచిపోనీ
సిరిదివ్వేలో వెలుగులాగా ... నీ చూపులో నిలిచిపోనీ
జేగంటలో రవళి లాగా ... నీ ఊపిరై కలిసిపోనీ
కలలే గానీ ... కలతే లేనీ
లోకానికే చేరిపోనీ ... చేరిపోనీ
కాలమిలా ఆగిపోనీ ... కల నిజమై సాగిపోనీ
అన్నీ మరిచి
ఆ ఆ ఆ
ఈ నిమిషంలో
ఆ ఆ ఆ
నీ ఓడిలోనే నిదురపోనీ
కాలమిలా ఆగిపోనీ

చిత్రం: ఏది పాపం? ఏది పుణ్యం?
గానం: బాలు, సుశీల
సంగీతం: సత్యం
Share

Widgets