Ads 468x60px

Saturday, November 1, 2008

రావోయి చందమామ



రావోయి చందమామ
మావింత గాధ వినుమా
రావోయి చందమామ

సామంతము గల సతికీ
ధీమంతుడనౌ పతినోయి -2
సతి పతి పోరే బలమై
సతమతమాయెను బ్రతుకే
రావోయి

ప్రతినలు పలికిన పతితో
బ్రతుకగ వచ్చిన సతినోయి -2

మాటలు బూటకమాయే
నటనలు నేర్చేను చాలా
రావోయి

తన మతమేమో తనదీ
మన మతమసలే పడదోయి
మనమూ మనమను మాటే
అననీ ఎదుటాననదోయి
రావోయి

నాతో తగవులు పడుటే
అతనికి ముచ్చటలేమో
ఈ విధి కాపురమెటులో
నీవొక కంటను గనుమా
రావోయి

చిత్రం : మిస్సమ్మ
గానం : ఏ.ఎం.రాజా. పి.సుశీల
రచన : పింగళి
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు

0 comments:

Post a Comment

Share

Widgets