ఓ.. భావి భారత భాగ్య విధాతలారా..
యువతీ యువకులారా...
స్వానుభవమున చాటు నా సందేశమిదే..
వారెవ్వా..
తాదిన్న తకదిన్న తాంగితటకతక తరికితకతోం
పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరి సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగ ఉండాలొయ్
కట్నాల మోజులో మన జీవితాలనే బలిచేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశదేశాల
మన పేరు చెప్పుకుని
ప్రజలు సుఖపడగా
తాధిన్న తకధిన్న తాంగిటతకతక తరికటకతోం
ఇంటా బయటా జంట కవులవలె
అంటుకు తిరగాలోయ్ తరంపం
కంటిపాపలై దంపతులెపుడు
చంటి పాపలను సాకాలోయ్
నవభావములా.. నవరాగములా..
నవజీవనమే నడపాలోయ్
భావకవులవలె ఎవరికి తెలియని
ఏవో పాటలు పాడాలోయ్...
చిత్రం : పెళ్లి చేసి చూడు
గానం : ఘంటసాల
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : ఘంటసాల
Monday, January 12, 2009
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment