Wednesday, August 26, 2009
సన్నజాజి పడక
సన్నజాజి పడక
మంచెకాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
సన్నజాజి పడక
మంచెకాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
మనసులో ప్రేమే ఉంది
మరువనీ మాటే ఉంది
మాయని ఊసే పొంగి పాటై రావే
సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
కొండమల్లి పువ్వులన్నీ
గుండెల్లోనీ నవ్వులన్నీ
దండే కట్టి తోచుకున్నా నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు
ఎండల్లోన చిన్నబోతే
పండించగా చేరుకున్నా నీ దరికే
అండాదండా నీవేనని
పండుగంతా నాదేనని
ఉండి ఉండి ఊగింది ఇంకా మనసే
కొండపల్లి బొమ్మా ఇక పండు చెండు దోచేయ్యనా
దిండే పంచే వేళైనది రావే
దిండే పంచే వేళైనది రావే
సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
అడిగితే సిగ్గేసింది
సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయే
సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
చిత్రం : క్షత్రియ పుత్రుడు
రచన : వెన్నెలకంటి
గానం: ఎస్.ఫై.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
సంగీతం : ఇళయరాజా
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment