Aakasama Neevekkad... |
ఆకాశమా నీవెక్కడ
అవనిపైనున్న నేనెక్కడ
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా
నిలువగలనా నీ పక్కన ||ఏ రెక్కలతో||
ఆకాశమా నీవెక్కడ
అవనిపైనున్న నేనెక్కడ
నీలాల గగనాల ఓ జాబిలి
నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా ||నీలాల||
ముళ్ళున్న రాళ్లున్న నా దారిలో
నీ చల్లని పాదాలు సాగేదెలా
నీ మనసన్నది నా మది విన్నది
నిలిచిపోయింది ఒక ప్రశ్నలా
నిలిచిపోయింది ఒక ప్రశ్నలా
ఆకాశమా లేదక్కడ
ఆకాశమా లేదక్కడ
అది నిలిచి ఉంది నీ పక్కన
వేల తారకలు తనలో ఉన్నా
వేల తారకలు తనలో ఉన్నా
నేలపైనే తన మక్కువ ||ఆకాశమా||
వెల లేని నీ మనసు కోవెలలో
నను తలదాచుకోని చిరు వెలుగునై ||వెల లేని||
వెను తిరిగి చూడని నీ నడకలో
నను కడ దాక రాని నీ అడుగునై
మన సహ జీవనం వెలిగించాలిలే
సమతా కాంతులు ప్రతి దిక్కున
సమతా కాంతులు ప్రతి దిక్కున
ఆకాశమా నీవెక్కడ
అది నిలిచి ఉంది నా పక్కన
వేల తారకలు తనలో ఉన్నా
నేలపైనే తన మక్కువ
ఈ నేల పైనే తన మక్కువ
చిత్రం : వందేమాతరం
గానం : ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన : సి.నారాయణరెడ్డి
సంగీతం :వందేమాతరం శ్రీనివాస్
0 comments:
Post a Comment