Ads 468x60px

Friday, June 25, 2010



గా మా రీ గమగస
మగస గస నీసానిదమగ
దమగ మగ సరీసాని
గమాగానీ గమాగ మదామ
దనీద నిసానిరీ



వేదం అణువణువున నాదం
వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై
వేదం , వేదం అణువణువున నాదం


సాగరసంగమమే ఒక యోగం
నిరిసనిదమగా గదమగరిసనీ
నిరిసనిదమగా
మదనిసరీ సగారి మగదమ
గమద నిసాని దనిమద గమ రిగస
సాగరసంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయే
ఆ మధనం ఒక అమృతగీతం
జీవితమే చిరనర్తనమాయే
పదమలు తామే పెదవులు కాగా
పదమలు తామే పెదవులు కాగా
గుండియలే అందియలై మ్రోగ
వేదం అణువణువున నాదం


ఆ ఆ ఆ మాతృదేవోభవా
పితృదేవోభవా
ఆచార్య దేవోభవా, ఆచార్య దేవోభవా
అతిధి దేవోభవా, అతిధి దేవోభవా

ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురు తాయె కుదురైన నాట్యం
గురు దక్షిణైపోయే జీవం
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
సుగమము రసమయ
సుగమము రసమయ నిగమము భరతముగానా

వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై


జయంతితే సుకృతినో
రస సిద్దా: కవీశ్వరాః
నాస్తిక్లేతేశాం యశ: కాయే
జరామరణజంచ భయం
నాస్తి జరామరణజంచ భయం
నాస్తి జరామరణజంచ భయం

చిత్రం : సాగరసంగమం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.పి.శైలజ
రచన: వేటూరి
సంగీతం : ఇళయరాజా

1 comments:

Share

Widgets