Ads 468x60px

Wednesday, November 2, 2011

ఈ చైత్రవీణ ఝుమ్ ఝమ్మని



ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా

ఈ చైత్ర వీణ ఝుం ఝుమ్మని

విడిపొలేని విరితీవెలలో
కురులే మరులై పోతుంటే
యెడబాటేది ఎదలోతులలో
అదిమే వలపే పుడుతుంటే
తనువూ తనువూ తరువూ తరువై
పుప్పొడి ముద్దే పెడుతుంటే
పూలే గంధం పూస్తుంటే
తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధనా

ఈ చైత్ర వీణ ఝుం ఝుమ్మని
ఈ చైత్ర వీణ ఝుం ఝుమ్మని

గళమే పాడే అల కోయిలనే
వలచీ పిలిచే నా గీతం
నదులై సాగే రుతుశోభలనే
అభిషేకించే మకరందం
గగనం భువనం కలిసే సొగసే
సంధ్యారాగం అవుతుంటే
లయలే ప్రియమై పోతుంటే
వనమే యవ్వనమై జీవనమై సాగే రాధాలాపన

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా

చిత్రం : ప్రేమించు పెళ్లాడు
గానం : ఎసి.పి.బాలు, ఎస్.జానకి
రచన : వేటూరి
సంగీతం: ఇళయరాజా

0 comments:

Post a Comment

Share

Widgets