Ads 468x60px

Tuesday, January 24, 2012

పారిజాతమ్ములీయగలనో సఖి





ఏ పారిజాతమ్ములీయగలనో సఖి - 1

ఏ పారిజాతమ్ములీయగలనో సఖి - 2


ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ

గిరి మల్లికలు తప్ప గరికపూవులు తప్ప

ఏ కానుకలను అందించగలనో చెలీ

గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప

జగతిపై నడయాడు చంచలా వల్లికా

తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా ….

శరదిందు చంద్రికా,.,,

నీవు లేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి

నీవు లేని విరి పానుపు నిప్పులు చెరిగే కుంపటి

విరులెందుకు సిరులెందుకు

మనసు లేక మరులెందుకు

తలపెందుకు తనువెందుకు

నీవు లేక నేనెందుకు … నీవు లేక నేనెందుకు …


కలువపూల చెంత చేరి కైమోడుపు చేతును


నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలని


మబ్బులతో ఒక్కమాటు మనవి చేసికొందును


నా అంగన ఆలాంగనమున ముంగురులై కదలాలని


చుక్కలతో ఒక్కసారి చూపించి నిను


నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియనై మొలవాలని


పూర్ణ సుధాకర బింబమునకు వినతి చేతును


నా కొలతికి ముఖబింబమై కలలు దిద్దుకోవాలని


ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్ధింతు కడసారిగా


నా రమణికి బదులుగా ఆకారం ధరియించాలని


చిత్రం : ఏకవీర

గాత్రం : ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం

పదం : సినారే

స్వరం : కె.వి.మహదేవన్

మూసిన ముత్యాలకేలే


మూసిన ముత్యాలకేలే మొరగులు ఉం ఉం ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు


కందులేని మొమునకేలే కస్తూరి
చిందు నీ కొప్పునకేలే చేమంతులు
మందయానమునకేలే మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే పైకమ్మని నీమేనికి
మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు


ముద్దుముద్దు మాటలకేలే ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలేలే
ఒద్దిక కూటమికేలే ఊర్పులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి
మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు

చిత్రం : అన్నమయ్య

గానం: ఎస్.పిఃబాలు. చిత్ర

Thursday, January 12, 2012

కలికి చిలకల కొలికి



కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడల్ని
అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య
మాయింటికంపించవయ్య మావయ్యా
కలికి చిలకల కొలికి||

ఆ చేయి యీ చేయి అద్ద గోడలికి
ఆ మాట యీ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లొ దారమై పూజలే చేసే
నీ కంటి పాపలా
కలికి చిలకల కొలికి||

మసకబడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మలపంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సాయ్యోధ్యనేలేటి సాకేత రామా
కలికి చిలకల కొలికి||

చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు
గానం : చిత్ర

Share

Widgets