Ads 468x60px

Wednesday, February 8, 2012

శివగోవింద గోవిందహరిహి ఓం ... హరిహి ఓం.... హరిహి ఓం... హరిహి ఓం

శివ గోవింద గోవింద... హరి గోవింద గోవింద....

ఉత్పాతములెన్నో ఉద్బవిల్లేను, తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను
అంతు పొంతూ లేని ఆపదల దేశంబు అల్లకల్లోలమై పోయెను

శివ గోవింద గోవింద.......

హంపిలో హనుమంతుడు ఆగ్రహమ్మున లేచి ఆర్బాటముగా కేక వేసేను
ఆ కేకలకు జనులు ఆదరిపోయేను ఆకు రాలినయట్లు రాలిపోయేను...

శివ గోవింద గోవింద.......

హైదరాబాదును మూసి మాహానది వరదతోటి ముంచి వేసేను
బావులు చెరువులు నీళ్ళు లేక ఎండి క్షామ దేవత తాండవించెను

శివ గోవింద గోవింద.......

ఉదయగిరిలో ఒక కాన్పుకే ఒక భామ ఏడ్గురు పిల్లల్నికంటుంది
సాగరంలో పెద్ద బడబాలనం పుట్టి గ్రామాలనే మర్చివేస్తుంది

శివ గోవింద గోవింద.......

ఉన్నవాళ్లు లేనివాళ్ళు ఒక్కటే అని సామ్యవాదము పైకి వస్తుంది
బంగారమే కంటికగుపడక మాయమై ఇత్తడికి ఆదిక్యమోస్తుంది

శివ గోవింద గోవింద.......

శ్రీ గిరి మల్లయ్య దేవాలయమ్ములో పట్ట పగలే ముసళ్ళు దూరెను
తిరుపతి వెంకన్న గుడి నాల్గురోజులు పుజలేక మూతపడెను

శివ గోవింద గోవింద.......

తిరుపతి కొండపై జలధార పుట్టి అందరికి ఆధారమయ్యేను
అమెరికా దేశాన భుకంపములు పుట్టి పట్టణాలకే చేటు వచ్చేను

శివ గోవింద గోవింద.......

ఆరేండ్ల పిల్లకు ఆశ్చర్యకరముగా మగచిన్నవాడు జన్మించేను
వేప చెట్టుకు అమృతబిందువులరీతిగా పాలు కారే రోజు వచ్చేను

శివ గోవింద గోవింద.......

ధరణి పట్టని జనం తల్లకిందులుగా పెరిగి తిండి గుడ్డ చాలకుండెను
తెరమీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారమును చేలయించెను
తెరమీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారమును చేలయించెను

శివ గోవింద గోవింద.......

కంచికి పడమర గాండ్లవారి ఇంట కామదేనువు ఒకటి పుట్టెను
పల్నాటిసీమలో ప్రజలవంచేన చేసి ద్రవ్యమంతా ఒకడు దోచెను

శివ గోవింద గోవింద.......

గండికోటను మందుగుండు ప్రేలిపోయి జననష్టమే సంభవించెను
పచ్చెర్ల కోటలో కోడి మాట్లాడేను నేల్లురునకు ముప్పు వచ్చేను

శివ గోవింద గోవింద.......

వొంగుతులేచేటి ఈత చెట్టుని చూచి లోకులంత పూజ చేసేరు
వెనుకజన్మములోన జరిగిన కథలన్నీ మూడేళ్ళ బాలుడు చెప్పేను

శివ గోవింద గోవింద.......

యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను
యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను
వీరభోగా వసంత రాయుడుగ నేవచ్చి దుష్ట శిక్షణ అపుడు చేస్తాను

చిత్రం : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
గానం: రామకృష్ణ

0 comments:

Post a Comment

Share

Widgets